న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

రెండేళ్ల డేటింగ్.. నలుగురు పిల్లల తర్వాత రొనాల్డొ-రొడ్రిగేజ్ వివాహం

Cristiano Ronaldo set to marry girlfriend Georgina Rodriguez

హైదరాబాద్: ఫుట్‌బాల్‌ లెజెండ్‌ క్రిస్టియానో రొనాల్డో మరోసారి దాంపత్య జీవనంలోకి అడుగుపెట్టనున్నాడు. రెండేళ్ల పాటు సహజీవనం చేస్తున్న ప్రేయసినే పెళ్లాడేందుకు నిశ్చయించుకున్నాడు. అయితే వీరిద్దరి వివాహం ఇంతకుముందెప్పుడో అయిపోయిందని వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ.. అధికారికంగా మరి కొద్దిరోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు.

రెండేళ్ల క్రితం మాడ్రిడ్‌లోని ఒక దుకాణంలో జార్జియాను కలుసుకున్న రొనాల్డో ఆమె ప్రేమలో పడ్డాడు. అప్పటినుంచి ఇటలీలో సహజీవనం చేస్తున్నారు. ఈ ఇద్దరికీ సరోగసీ ద్వారా జన్మించిన మాటియో, అవా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా, జార్జియాతో డేటింగ్‌కు ముందే క్రిస్టియానోకు జూనియర్‌ రొనాల్డో అనే ఎనిమిదేళ్ల కొడుకు, అలనా మార్టినా అనే రెండేళ్ల కూతురు ఉంది.

2018 ఫిఫా ప్రపంచకప్‌ సందర్భంగా జార్జియానా 615,000 పౌండ్ల విలువైన వజ్రపు ఉంగరం ధరించిన ఫొటోను సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేయడంతో రొనాల్డోతో ఆమె వివాహం జరిగిపోయిందన్న వార్తలు గుప్పుమన్నాయి. అయితే అదంతా అబద్ధమని, తామిప్పుడు పెళ్లి చేసుకోబోతున్నట్టు రొనాల్డో ప్రకటించాడు. ఏడాది క్రితం డేటింగ్‌లో ఉండగానే ఓ ఆడశిశువుకు జన్మనిచ్చిన రొనాల్డొ-రొడ్రిగేజ్‌లు పాపాయి మొదటి పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు.

దాంతో పాటుగా ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో జకోవిచ్ మ్యాచ్‌ను వీక్షించారు. గతంలో ఓ మహిళపై రొనాల్డో అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు వెలువడినప్పుడు ప్రియునికి జార్జియానా తోడుగా నిలిచింది. ప్రపంచ కప్ అనంతరం కొత్త క్లబ్ తరపున ఆడుతున్న రొనాల్డొ.. అదే దూకుడుతో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకూ ఆడిన 15 మ్యాచ్‌లు కలిపి 9 గోల్స్ చేశాడు.

Story first published: Sunday, November 18, 2018, 13:34 [IST]
Other articles published on Nov 18, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X