For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యునైటెడ్‌పై రొనాల్డొ చేసిన గోల్ వృథా!!

 Cristiano Ronaldo scores sensational goal for Juventus, takes opportunity to show world his stomach

హైదరాబాద్: చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా తన జట్టు జువెంటస్‌ను నాకౌట్ దశకు చేర్చడానికి క్రిస్టియానో రొనాల్డో పడిన శ్రమ వృథాగా మిగిలింది. మాంచెస్టర్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో జువెంటస్ గెలిచివుంటే, నేరుగా నాకౌట్‌కు చేరేది. అయితే, ఆ జట్టు అనూహ్యంగా 1-2 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొని, నాకౌట్ అవకాశాలను సంక్లిష్టం చేసుకోవడంతో మరో మ్యాచ్ వరకూ ఆగాల్సిన పరిస్థితి.

మ్యాచ్ ఆరంభం నుంచి మాంచెస్టర్ యునైటెడ్ నుంచి ఎదురైన గట్టిపోటీని తట్టుకొంది. గోల్స్ నమోదుకాకుండా చూసేందుకే జువెంటస్ నానా తంటాలు పడింది. దీంతో ప్రథమార్ధంలో ఒక్క గోల్ కూడా నమోదు కానివ్వకుండా కట్టడి చేసింది. ద్వితీయార్ధంలో వ్యూహాన్ని మార్చిన జువెంటస్ దాడులకు ఉపక్రమించింది. 65వ నిమిషంలో రొనాల్డో చక్కటి గోల్ చేశాడు. దీంతో జువెంటస్‌ 1-0స్కోరుతో ఆధిక్యాన్ని దక్కించుకుంది.

ఆతర్వాత పూర్తిగా రక్షణాత్మకంగా ఆడిన జువెంటస్ అదే తేడాతో విజయం సాధించాలనే వ్యూహాన్ని అనుసరించింది. అయితే, చివరి క్షణాల్లో మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాళ్లు రెచ్చిపోయారు. 86వ నిమిషంలో జువాన్ గోల్ సాధించి, స్కోరును సమం చేయగా, మరో మూడు నిమిషాల్లోనే అలెక్స్ సాంచెజ్ ద్వారా మాంచెస్టర్ యునైటెడ్‌కు రెండో గోల్ లభించింది.

ఆధిక్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న జువెంటస్ తీవ్ర దిగ్భ్రాంతి నుంచి తేరుకోక ముందే మ్యాచ్ ముగిసింది. ఈ క్రమంలో రొనాల్డొ శ్రమ వృథాకావడంతో పాటు అతని సిక్స్ ప్యాక్‌‍పై విమర్శలు తలెత్తుతున్నాయి. ఆట 65వ నిమిషంలో గురి చూసి గోల్ పోస్ట్‌లోకి షూట్ చేసిన రొనాల్డో జెర్సీ పైకెత్తి తన సిక్స్ ప్యాక్ చూపిస్తూ సంబరాలు జరుపుకున్నాడు. అదే సమయంలో జువెంటస్ గ్యాలరీలో ఉన్న తన ప్రియురాలు జార్జీనా రోడ్రిగ్వెజ్‌ను చూస్తూ సిక్స్ ప్యాక్‌ను కెమెరాలకు చూపించాడు.

Story first published: Friday, November 9, 2018, 14:06 [IST]
Other articles published on Nov 9, 2018
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+