For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

700వ గోల్ చేసిన రొనాల్డోకు ఒక పక్క సంతోషం, మరోవైపు బాధ!

Cristiano Ronaldo scores 700th career goal but Ukraine defeat Portugal 2-1 to reach Euro 2020 finals

హైదరాబాద్: యూరో 2020 మెగా టోర్నీలో ఉక్రేయిన్ జట్టు ఫైనల్స్‌కు అర్హత సాధించింది. టోర్నీలో భాగంగా సోమవారం పోర్చుగల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉక్రెయిన్ 2-1తేడాతో విజయం సాధించింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో పోర్చుగల్‌ జట్టు కెప్టెన్, స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో కెరీర్‌లో అరుదైన ఘనత సాధించాడు.

తన కెరీర్‌లో క్రిస్టియానో రొనాల్డో 700వ గోల్‌ కొట్టాడు. మొత్తం 973 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. ఈ జాబితాలో రొనాల్డో కంటే ముందు చెక్‌ ఆస్ట్రియన్‌ ఆటగాడు జోసెఫ్‌ బికన్‌ 805 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉండగా రొమారియో 772, పీలే 767 (బ్రెజిల్‌), ఫెరెన్‌ పుస్కాస్‌ 746 (హంగేరి), గెర్డ్‌ ముల్లర్‌ 735 (జెర్మనీ) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

అర్జెంటీనా స్టార్‌ ప్లేయర్ లియోనెల్‌ మెస్సీ ప్రస్తుతం 672 గోల్స్‌తో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ ప్రపంచంలో అత్యుత్తమ పుట్ బాలర్లుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో రొనాల్డో 700వ గోల్స్ రికార్డుని అందుకునే అవకాశం ఒక్క మెస్సీకి మాత్రమే ఉంది. కాగా, పోర్చుగల్ ఓటమితో యూరో 2020 గ్రూప్‌ బీలో ఉక్రెయిన్‌ 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించి 19 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

ఈ విజయంతో ఉక్రెయిన్ వరుసగా మూడోసారి యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. మరోవైపు ఢిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన పోర్చుగల్‌ 11 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. లూథియానాతో జరిగిన మ్యాచ్‌లో 2-1తేడాతో విజయం సాధించిన సెర్బియా 10 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.

Story first published: Tuesday, October 15, 2019, 13:16 [IST]
Other articles published on Oct 15, 2019
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+