Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'నేనేరా బాద్ షా.. నాకన్నా తోపుగాడు లేడిక్కడ' - రొనాల్డో

దశాబ్దకాలంగా ఫుట్‌బాల్‌ ప్రపంచంలో రారాజులాగా వెలుగొందుతున్నారు అర్జెంటీనా స్టార్ లియోనల్‌ మెస్సి, పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో. ప్రపంచవ్యాప్తంగా వీరిద్దరు తమ ఆటతీరుతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. మరి వీరిద్దరిలో ఎవరు గొప్ప? అంటే టక్కున ఓ పేరు చెప్పడం కష్టమే.

అభిమానుల్లోనూ లియోనల్ మెస్సి-రొనాల్డోలో ఎవరు గొప్ప అనే చర్చ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. అయితే తాజాగా తానే గొప్ప అని అంటున్నాడు రొనాల్డో. ఆటలో తానే అత్యుత్తమం అని చెప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్పుకొచ్చాడు.

Cristiano Ronaldo says He is the Best footballer than lionel messi

"ఫుట్‌బాల్‌ చరిత్రలోనే నేనే బెస్ట్ ప్లేయర్. ఇప్పటి వరకు నాకన్నా ఉత్తమమైన ప్లేయర్ ను చూడలేదు. మనసులో నుంచి చెబుతోన్న మాట ఇది. గణాంకాలు ఆధారంగానే ఇలా చెబుతున్నాను. ఫుట్‌బాల్‌ లో ఎన్నో ఘనతలు అందుకున్నాను. పెనాల్టీ, లెఫ్ట్‌ ఫుట్, హెడర్, ఫ్రీకిక్స్‌.. సహా ఎన్నో షాట్లతో గోల్స్ చేశాను. మొత్తంగా 923 గోల్స్‌ బాదాను. నేను ఓ పరిపూర్ణమైన ఆటగాడిని. అభిమానులు ఇతరుల పేర్లు చెబితే వారి అభిప్రాయాన్ని గౌరవిస్తాను." అని రొనాల్డో వెల్లడించాడు.

మెస్సీతో తనకున్న అనుబంధం గురించి కూడా వివరించాడు రొనాల్డో. "మెస్సీతో నాకెప్పుడూ ఎలాంటి సమస్యలు రాలేదు. అంతా మంచిగానే సాగుతోంది. అప్పట్లో అయితే భలే సరదాగా కూడా ఉండేవాళ్లం." అని అన్నాడు.

Cristiano Ronaldo says He is the Best footballer than lionel messi

సోషల్ మీడియాలో క్రేజ్ ఎక్కువ..
మెస్సీ - రొనాల్డోకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే ఈ సోషల్ మీడియాలో రొనాల్డోనే టాప్ ప్లేస్ లో ఉన్నాడు. రొనాల్డోకు ప్రపంచంలోనే అత్యధిక మంది 648 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. మెస్సికి 504 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

Story first published: Wednesday, February 5, 2025, 9:46 [IST]
Other articles published on Feb 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+