Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Cristiano Ronaldo: ప్రమాదానికి గురైన బుగాటి వేరాన్ స్పోర్ట్స్ కార్

Cristiano Ronaldos super car Bugatti Veyron suffered a major accident in the Spain

మాడ్రిడ్: పోర్చుగీస్‌కు చెందిన సాకర్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు వాడుతోన్న సూపర్ స్పోర్ట్స్ కార్ బుగాటి వేరాన్.. ప్రమాదానికి గురైంది. స్పెయిన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో రొనాల్డో కారులో లేరు. అతని వ్యక్తిగత సిబ్బంది కారును నడిపినట్లు సమాచారం. ఈ ఘటనలో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేశారు.

స్పెయిన్ ద్వీప నగరం మజొర్కాలో ఈ ప్రమాదం సంభవించింది. మాంఛెస్టర్ యునైటెడ్ సాకర్ క్లబ్ తరఫున క్రిస్టియానో రొనాల్డో మ్యాచ్‌లను ఆడుతున్న విషయం తెలిసిందే. గాయం కారణంగా పోర్చుగల్ ఫైనల్ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. త్వరలో సాకర్ సీజన్ ఆరంభం కాబోతోన్నందున.. భార్య జార్జియానా రోడ్రిగ్జ్, పిల్లలు క్రిస్టియానో జూనియర్, ఇవా, మ్యాట్టెయో, అలన మార్టినా, బెల్లా ఎస్మరెల్డాతో కలిసి మజొర్కాకు ప్రైవేట్ జెట్‌లో బయలుదేరి వెళ్లారు. కారును సైతం తన వెంట తీసుకెళ్లారు.

తన వ్యక్తిగత సిబ్బందికి అప్పగించారు. రొనాల్డో బస చేసిన రిసార్ట్స్‌కు వెళ్తుండగా.. కారు ప్రమాదానికి గురైంది. మజొర్కాలోని రెసిడెన్షియల్ ఎస్టేట్ సా కోమా, బున్యోలా వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్ గాయపడ్డాడు. కారు ముందు భాగం ధ్వంసమైంది. ఈ కారు ఖరీదు 2.1 మిలియన్ డాలర్లు. అత్యంత విలావంతమైన కార్లల్లో ఇదీ ఒకటి. బుగాటి వేరాన్ స్పోర్ట్స్ వేరియంట్‌ను అతను వినియోగిస్తోన్నాడు.

Story first published: Tuesday, June 21, 2022, 12:35 [IST]
Other articles published on Jun 21, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+