సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న రొనాల్డో గర్లఫ్రెండ్ ఫొటోలు
హైదరాబాద్: మామూలుగానే సెలబ్రిటీల ఫొటోలు వైరల్ అవుతూ ఉంటాయ్. కొన్నిసార్లు వాళ్ల సన్నిహితులవి కూడా.. వాటిల్లో ఏ విషయం లేకుండానైతే వైరల్ అవ్వవు కదా.. ఇలాంటిదే పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో గర్లఫ్రెండ్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.

ఇటీవలే ఆడశిశువుకు జన్మనిచ్చిన రోడ్రిగేజ్
జార్జినా రోడ్రిగేజ్ మొదటి సారి ఓ ఆడశిశువుకు జన్మనిచ్చి రొనాల్డో నాలుగో సంతానానికి తల్లైంది. ఆమె ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఫొటోలే కాకుండా త ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నప్పటి ఫొటోలు కూడా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

తల్లైన తర్వాత కూడా ఫిట్‌గా
తల్లైన తర్వాత కూడా ఆమె స్పోర్ట్స్ వేర్ ధరించి ఫిట్‌గా ఉండటం కొందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. దీంతో ఈమె రొనాల్డో భార్యేనా అని ముక్కున వేలేసుకుంటున్నారు. దీంతో ఆమె ఆమె ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

మొత్తం నలుగురు పిల్లలు
కాగా, 32 ఏళ్ల రొనాల్డోకు క్రిస్టియానో జూనియర్‌తో పాటు ఇవా, మాటియో అనే ఇద్దరు కవల పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవలే జార్జినా రోడ్రిగేజ్ ఓ ఆడశిశువుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రొనాల్డో తన అధికారిక ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
రొనాల్డో కుమార్తె పేరు అలాన మార్టినా
'అలాన మార్టినా మా కుటుంబంలోకి వచ్చేసింది. జియో, అలాన ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గా ఉంది. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం' అని తన ఏడేళ్ల క్రిస్టియానో జూనియర్, జార్జీనతో ఆసుపత్రిలో కలిసి ఉన్న ఫొటోను రొనాల్డో తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications