సెలెనా గోమెజ్ ఫాలోవర్లను మించిపోయిన రొనాల్డో ఫాలోవర్లు

హైదరాబాద్: అభిమానుల సంఖ్యను సోషల్ మీడియాల లెక్కబెట్టుకుంటున్నారు సెలబ్రిటీలు. తాజాగా ఓ ప్రముఖ పత్రిక ఇచ్చిన నివేదిక ప్రకారం.. పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియన్ రొనాల్డొకు సింగర్‌గా నటిగా ఫామస్ అయిన సెలెనా గోమోజ్‌ను పోల్చి గణాంకాలను ప్రచారం చేసింది. ఈ క్రమంలో రానొల్డో దాదాపు 17వేలకు పైగా ఫాలోవర్లను తన ఖాతాలో ఉండటం ద్వారా సెలెనా గోమెజ్‌ను ఓడించాడు. సెలెనా గోమెజ్‌కు 144, 321, 029 ఉండగా రొనాల్డోకు 144, 338, 650పరుగులతో ఉన్నారు.
సెలెనా గోమెజ్ మానసిక సమస్యల కారణంగా
రొనాల్డొ తన వ్యక్తిగత ఆటలోనూ దినదినాభివృద్ధి చెందుతుండగా సెలెనా గోమెజ్ మానసిక సమస్యల కారణంగా తాను సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. రొనాల్డొ తొమ్మిదేళ్ల పాటు రియల్ మాడ్రిడ్ క్లబ్‌లో కొనసాగి ఇటీవలే జ్యూవెంటస్ క్లబ్‌కు బదిలీ అయ్యాడు. ఈ క్రమంలో అతనిని కొత్త క్లబ్ 100మిలియన్ యూరోల ఒప్పందానికి కుదుర్చుకుంది. రొనాల్డో రెగ్యూలర్‌గా తన కుటుంబం ఫొటోలను ఇంకా అతని గర్ల్ ఫ్రెండ్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తుంటాడు.
మైదానంలో ఉన్నప్పటి ఫొటోలను కూడా
రొనాల్డొకు ఎనిమిదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. తండ్రి పెంపకంలోనే ఉన్న జూనియర్ క్రిస్టియానోతో పాటుగా ఈవా, మాటో కుమార్తెలు కూడా రొనాల్డొ సంతానమే. దాంతోపాటు మరోసారి ఈ 2017 నవంబరులో అతని ప్రేయసి జార్జినా మరో పాపకు జన్మనివ్వడంతో అలానా అనే పాప పుట్టింది. వీరితో పాటుగా సాకర్‌ని కెరీర్‌గా కొనసాగిస్తున్న రొనాల్డొ మైదానంలో ఉన్నప్పటి ఫొటోలను కూడా సోషల్ మీడియాలలో పంచుకుంటుంటాడు.
ఆలోచనపరంగా ఇది సబబేనని కచ్చితంగా
ఇప్పటికే మానసిక స్థితి బాగుండక చికిత్స తీసుకుంటున్న సెలెనా గోమెజ్ తన ఆఖరి పోస్టును ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సెప్టెంబరు 23వ తేదీన పోస్టు చేశారు. తన ఆఖరి పోస్టులో కూడా గొంతు బాలేదని సోషల్ మీడియా ద్వారా మరింతమంది అభిమానులను సొంతం చేసుకున్నానని.. కానీ, నేను తీసుకున్న ఆలోచనపరంగా ఇది సబబేనని కచ్చితంగా ఏదో ఒక రోజు తిరిగి వస్తానని అందులో పేర్కొంది.
రేపు అస్సలు ఎవ్వరూ లేకుండా పోవచ్చు
అంతకుముందు సెప్టెంబరు నెలలోనే సెలెనా గోమెజ్ ఓ వీడియోను పోస్టు చేసింది. అందులో ఆమె తనకు ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారనే సంగతి పట్టించుకోనని చెప్పింది. 'నేను పట్టించుకోను. అస్సలు లెక్కచెయ్యను. ఇవాళ ఇంతమంది ఉండి ఉండొచ్చు. రేపు అస్సలు ఎవ్వరూ లేకుండా పోవచ్చు. దాని వల్ల నాకే ఇబ్బంది ఉండదు.' అంటూ చెప్పుకొచ్చింది. 2016 నుంచి ఇన్‌స్టాగ్రామ్ అధికమంది ఫాలోవర్లు సంపాదించుకుని టేలర్ స్విఫ్ట్ రికార్డును ఓడిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications