మాడ్రిడ్: ఆదాయం పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారని పేర్కొంటూ ముగ్గురు ఫుట్ బాల్ ఆటగాళ్లు, మరో ఇద్దరు ఇతర ప్లేయర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొనేందుకు మాడ్రిడ్ ప్రాసిక్యూషన్ సిద్ధం అవుతున్నది. అయితే రియల్ మాడ్రిడ్ సూపర్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో సదరు ముగ్గురు ఫుట్‌బాలర్ల జాబితాలో లేరని జట్టు క్లబ్ యాజమాన్యంపేర్కొంది.
అయితే పన్ను ఎగవేతకు పాల్పడుతున్న ఆటగాళ్ల వివరాలు స్పెయిన్ టాక్స్ అథారిటీ వద్ద అందుబాటులో ఉన్నాయి. అయితే సదరు ఆటగాళ్ల పేర్లను వెల్లడించేందుకు ప్రాసిక్యూషన్ అధికారులు నిరాకరించారు. ఇంతకుముందు యూరోపియన్ మీడియాలోని ఒక గ్రూప్ పలువురు ఫుట్ బాల్ క్రీడాకారులు పన్ను ఎగవేతకు పాల్పడ్డారని వార్తాకథనాలు ప్రచురించింది.
ఈ జాబితాలో రియల్ మాడ్రిడ్ ఫార్వర్డ్ ప్లేయర్ క్రిస్టియానో డొనాల్డ్, మాంఛెస్టర్ యునైటెడ్ మేనేజర్ జోస్ మౌరిన్హో సహా పలువురు ప్లేయర్లు, కోచ్‌లు అవకతవకలకు పాల్పడుతున్నారని ఆయా మీడియా కథనాల సారాంశం. రొనాల్డోకు చెందిన149.5 మిలియన్ల యూరోలు స్పాన్సర్ షిప్‌పై పన్ను చెల్లించాల్సి ఉంటుందని, కానీ ఆయన కేవలం 5.6 మిలియన్ల యూరోలు మాత్రమే టాక్స్ గా చెల్లించారని ఆయ మీడియా సంస్థల కథనాల సారాంశం.
కానీ రొనాల్డోతోపాటు జోస్ మౌరిన్హో ఏజెంట్ జార్జ్ మెండిస్ దీనిపై స్పందిస్తూ తాము ఎటువంటి తప్పిదానికి పాల్పడలేదని పేర్కొన్నాడు. 'క్రిస్టియానో రొనాల్డో, జోస్ మౌరిన్హోలు ఇద్దరు కూడా స్పెయిన్, ఇంగ్లండ్‌లలో ఆర్థిక సంబంధ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారు' అని జార్జ్ మెండిస్ వ్యాఖ్యానించాడు. స్పానిష్ మీడియాలో రొనాల్డోపై ఆరోపణలు రావడంతో మెండిస్ సంస్థ జెస్టిఫ్యూట్ ఓ ప్రకటన విడుదలచేసింది.

దీనికి సంబంధించి తప్పుడు కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. క్రిస్టియానో రొనాల్డోగానీ, జోస్ మౌరిన్హోగానీ ఏనాడు ఆర్థిక నేరాలకు పాల్పడిన దాఖలాలు లేవన్నది. మెండిస్ క్లయింట్లు పలువురి ఆర్థిక లావాదేవీల నిర్వహణపైనే అనుమానాలు ఉన్నాయని ఇంతకుముందు ఎల్ ముందో అనే మీడియా సంస్థ వ్యాఖ్యానించింది.
తామేం ప్రచురిస్తున్నామన్న సంగతి ప్లేయర్లకు తెలుసునని, తమకు బదులు సమాధానమివ్వడానికి బదులు న్యాయవాదులతో జవాబులు చెప్పిస్తున్నారని యాన్న్ ఫిలిప్పిన్ పేర్కొంది. తమ పరిశోధన టీం పరిశీలనలో ఉన్నప్పుడు తమ పన్ను చెల్లింపుల వివరాలు ప్రచురించొద్దని పదేపదే ప్లేయర్లు చెప్పారని పిలిప్పైన్ వివరించింది. తమ వద్ద మరికొన్ని రహస్యాలు వెల్లడి కావడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపింది.
స్పెయిన్‌కు ఇబ్బందికరం
స్పెయిన్ పన్ను అధికారుల పరిశీలనలో బార్సిలోనా స్టార్ ఆటగాళ్లు లియానెల్ మెస్సీ, నేయ్మార్ తదితరులు ఉన్నారు. ఇదే అంశంపై బార్సిలోనా ఎఫ్ సి కీలక ప్లేయర్ మెస్సీకి గత జూలైలో 22 నెలల జైలుశిక్ష పడింది. నేయ్మార్, ఆయన తండ్రికి రెండేళ్ల జైలుశిక్ష పడింది. బ్రెజిలియన్ క్లబ్ శాంతోస్ నుంచి బార్సిలోనా ఎఫ్‌సి జట్టుకు నెయ్మార్ బదిలీ అయినప్పుడు 10.6 మిలియన్ల యూరోలు అవకతవకలకు పాల్పడ్డాడని పన్ను అధికారులు ఆరోపించారు.
కానీ నెయ్మార్, ఆయన తండ్రి తామే తప్పు చేయలేదని పేర్కొన్నాడు. ప్లేయర్ బదిలీ ఫీజు చెల్లింపులో పొరపాటు జరిగిందని గత జూన్‌లో బార్సిలోనా యాజమాన్యం నెయ్మార్‌కు 5.8 మిలియన్ల యూరోలు మరో కేసులో చెల్లించింది. పన్నుచెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడుతున్నందుకు బార్సిలోనా మిడ్ ఫీల్డర్ జావియర్ మాచెరానోను ఏడాది పాటు సస్పెండ్ చేసింది.
అయితే మాడ్రిడ్ మాజీ ప్లేయర్లు జాబీ అలోంసో, అంగేల్ డి మారియా, రిచర్డో కార్వాల్హో పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరితోపాటు ఫార్మర్ అట్లెటికో రాడమెల్ ఫాల్కావో, రియల్ మాడ్రిడ్ ఫుల్ బ్యాక్ ఫాబియో కొయెంత్రావో పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.