ఫిఫా ర్యాంకింగ్స్: మెస్సీని తోసేసి.. రేసులోకొచ్చిన రొనాల్డొ..!!

హైదరాబాద్: ఒకప్పుడు ఫుట్‌బాల్ ప్రపంచాన్ని శాసించిన మెస్సీకి క్రమంగా అవార్డులు తగ్గుముఖం పడుతున్నాయి. ఫుట్‌బాల్ ప్రపంచంలో అత్యంత గొప్పగా భావించే బార్సిలోనా అవార్డు కూడా గతేడాది మెస్సీని కాదని రొనాల్డొను వరించింది. అయితే ఈ సారి ఫిఫా ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ ప్లేయర్‌గా ఎంపికవకపోయినా.. కనీసం రేసులో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు.
ఈ క్రమంలో ఆశ్చర్యకరంగా 2018 సంవత్సరానికి ఫిఫా ప్రకటించిన బెస్ట్ ప్లేయర్ అవార్డ్ ఫైనలిస్ట్‌ల జాబితాలో క్రిస్టియానొ రొనాల్డో టాప్ ప్లేస్‌లో నిలవగా .. అర్జెంటీనా సూపర్ స్టార్ లయనెల్ మెస్సీకి మాత్రం చోటు దక్కలేదు. ప్రస్తుతం ఫుట్‌బాల్ వరల్డ్‌లో క్రిస్టియానొ రొనాల్డో, లియోనల్ మెస్సీలను మించిన వారు లేరు.ఇంటర్నేషనల్ సాకర్‌లో ఎంతమంది యువ సంచలనాలు వచ్చినా పోర్చుగల్ ఫార్వర్డ్ రొనాల్డో, అర్జెంటీనా స్ట్రైకర్ లయనెల్ మెస్సీ తర్వాతే ఎవరైనా.

దశాబ్ద కాలంగా ఆధిపత్య పోరు కొనసాగుతూనే:
దశాబ్ద కాలంగా ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది.అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు క్లబ్ సాకర్‌లోనూ రికార్డ్ స్థాయిలో గోల్స్ నమోదు చేసిన ఈ ఇద్దరే కొంతకాలంగా ఫిఫా అవార్డ్ రేస్‌లో ముందు వరుసలో ఉన్నారు. 2018 సంవత్సరానికి ఫిఫా ప్రకటించిన బెస్ట్ ప్లేయర్ అవార్డ్ ఫైనలిస్ట్‌ల జాబితాలో క్రిస్టియానొ రొనాల్డో టాప్ ప్లేస్‌లో నిలవగా .. మెస్సీకి మాత్రం చోటు దక్కలేదు.

2018లో ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 10 మంది ఆటగాళ్లను:
2018లో ఇంటర్నేషనల్ మ్యాచ్‌లతో పాటు,క్లబ్ సాకర్‌లో అత్యధిక గోల్స్, ఎసిస్ట్‌లు నమోదు చేసిన 10 మంది ఆటగాళ్లను ఎంపిక చేసి...ఆన్‌లైన్‌లో ఓటింగ్ నిర్వహించి ఫైనలిస్ట్‌లను ప్రకటిస్తారు. ఈ సారి కూడా ఫిఫా అదే చేసింది. టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్న మెస్సీ...టాప్ త్రీలో మాత్రం నిలబడలేకపోయాడు. బార్సిలోనా క్లబ్ తరఫున ఆల్ టైమ్ టాప్ స్కోరర్‌గా నిలిచిన మెస్సీ ఫైనల్ రేస్‌లో నిలబడలేకపోవడంతో సాకర్ ప్రపంచమంతా షాకైంది.

రియల్ మ్యాడ్రిడ్ క్లబ్ టైటిల్ నెగ్గడంలో రొనాల్డో:
రియల్ మ్యాడ్రిడ్ క్లబ్ తరఫున రికార్డ్‌ల మోత మోగించి ప్రస్తుతం యూవెంటస్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానొ రోనాల్డో అవార్డ్ రేస్‌లో హాట్‌ఫేవరెట్‌గా నిలిచాడు. రియల్ మ్యాడ్రిడ్ క్లబ్ ప్రతిష్టాత్మక చాంపియన్స్ లీగ్ టైటిల్ నెగ్గడంలో రొనాల్డోదే కీలక పాత్ర. క్రిస్టియానొ తర్వాతి స్థానంలో క్రొయేషియా మిడ్‌ఫీల్డర్ లూకా మోడ్రిచ్ నిలిచాడు.

ఆ మూడు స్థానాలను దక్కించుకున్న వాళ్లు వీరే:
రియల్ మ్యాడ్రిడ్ జట్టును చాంపియన్స్ లీగ్ విజేతగా నిలిపడంతో పాటు క్రొయేషియా జట్టు 2018 ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ చేరడంలోనూ మోడ్రిచ్ కీలక పాత్ర పోషించాడు. ఈ లిస్ట్‌లో ఈజిప్ట్ రైజింగ్ స్టార్ మహమ్మద్ సలా అనూహ్యంగా చోటు దక్కించుకున్నాడు. ఈజిప్ట్‌ను ప్రపంచకప్ ఫైనల్ రౌండ్ చేర్చడంతో పాటు లివర్‌పూల్ క్లబ్‌ను చాంపియన్స్ లీగ్ ఫైనల్ చేర్చడంలో మహమ్మద్ సలాదే ప్రధాన పాత్ర.
2018 ఫిఫా బెస్ట్ ప్లేయర్ అవార్డ్ ఫైనలిస్ట్‌లు :
క్రిస్టియానొ రోనాల్డో ( పోర్చుగల్ / యువెంటస్ )
లూకా మోడ్రిచ్ ( క్రొయేషియా / రియల్ మ్యాడ్రిడ్)
మహమ్మద్ సలా ( ఈజిప్ట్ / లివర్‌పూల్ )
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications