ఒకప్పుడు రోడ్డు పక్కన పడుకునే.. ఒక్క రాత్రిలో స్టార్.. !!

హైదరాబాద్: ఎవరూ రాత్రికి రాత్రే స్టార్లు అయిపోరు. దానికి తగ్గ శ్రమ.. పట్టుదల.. జిజ్ఞాస ఉంటే ఏదో ఒకరోజు మన ప్రతిభ వెలిగితీరుతుంది. ప్రపంచ ఫుట్‌బాల్‌లో ఇప్పటి వరకూ ఫామస్ కాని పేరు ఉన్నట్టుంది మార్మోగిపోతోంది. అలిరెజా బీరన్‌వాంద్.. ఇతనే సాకర్ వరల్డ్‌కప్‌లో ఇరాన్ టీమ్ గోల్‌కీపర్. నిన్న రాత్రి పోర్చుగల్‌తో మ్యాచ్‌లో ఇతడు ఒక్కసారిగా పెద్ద స్టార్ అయిపోయాడు.
ఫిఫా వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక

అసలు ఎవరీ అలిరెజా
అదెలా అంటే.. అతడు ప్రపంచంలోనే మేటి ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో గోల్ ఆపాడు. అది కూడా పెనాల్టీ గోల్ కావడంతో ఇప్పుడు ఇరాన్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అలిరెజా పేరు తెరమీదికి వచ్చింది. ఈ క్రమంలో అసలు ఎవరీ అలిరెజా అని ఆరా తీయగా.. మనసును కలిచి వేసే అతని స్టోరీ బయటపడింది. నిజానికి ఇది ఓ స్ఫూర్తిదాయకమైన స్టోరీ.

ఫుట్‌బాలర్ అనగానే కోట్ల కొద్దీ డబ్బు..
సాధారణంగా ఫుట్‌బాలర్ అనగానే కోట్ల కొద్దీ డబ్బు.. రిచ్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటుందని భావిస్తారు. కానీ ఈ గోల్ కీపర్ అత్యంత దయనీయమైన పరిస్థితులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాడు. అలిరెజా ఒకప్పుడు రోడ్లపై పడుకునేవాడు. ఓ కారు వాష్ కంపెనీలో పనిచేశాడు. సొంత ఇల్లు అంటూ అతనికి లేదు. ఫుట్‌బాలర్ కావాలన్న తన కలను వెతుక్కుంటూ టెహ్రాన్ చేరిన అలిరెజా గతంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు.
స్టేడియం బయట పడుకునే వాడు
స్థానిక ఫుట్‌బాల్ స్టేడియం బయట పడుకునే వాడు. అతని అడుక్కునేవాడు అని భావించిన ఎంతో మంది తమ దగ్గర ఉన్న చిల్లరను అతని దగ్గర వేసి వెళ్లేవారు. ఆ అవమాలన్నింటినీ భరించిన అలిరెజా.. ఇప్పుడు ఏకంగా ఇరాన్ నేషనల్ టీమ్‌కే ఆడే అవకాశాన్ని అందుకోవడం చాలా గొప్ప విషయం. అందులోనూ స్టార్ ప్లేయర్ రొనాల్డో పెనాల్టీ గోల్‌నే ఆపి పెద్ద హీరోగా మారిపోయాడు.

53వ నిమిషంలో జరిగింది ఆ అద్భుతం
పోర్చుగల్, ఇరాన్ మ్యాచ్ 53వ నిమిషంలో ఆ అద్భుతం జరిగింది. అక్కడున్నది రొనాల్డో, అందులోనూ పెనాల్టీ కిక్.. ఇక గోల్ కాకుండా పోతుందా అని భావించిన కోట్లాది మంది అభిమానులకు అలిరెజా షాకిచ్చాడు. అలిరెజా గోల్ ఆపిన తీరే కాదు.. అతని సక్సెస్ స్టోరీని కూడా ఎవరూ అంత తొందరగా మరచిపోరు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications