Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన రొనాల్డో..ఆల్ టైమ్ రికార్డు (Video)

గత రెండు దశాబ్దాలుగా ఫుట్‌బాల్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న క్రిస్టియానో రొనాల్డో అరుదైన రికార్డు సాధించాడు. తన కెరీర్‌లో 900వ గోల్ సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా రొనాల్డో చరిత్రకెక్కాడు. యూఈఏఫ్‌ఏ నేషన్స్ లీగ్‌లో భాగంగా క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో అతడు ఈ ఆల్‌ టైమ్ రికార్డు నెలకొల్పాడు.

మ్యాచ్‌లో 34వ నిమిషంలో క్లోజ్ రేంజ్ నుంచి టాప్ చేస్తూ బంతి నెట్‌లోకి పంపాడు. అనంతరం వేగంగా పరుగెత్తి 900వ గోల్‌ను సెలబ్రేషన్స్ చేసుకున్న రొనాల్డో.. తర్వాత నేలపై పడిపోయి ఎమోషనల్ అయ్యాడు. కాగా, 39 ఏళ్ల అతను 1236 మ్యాచ్‌ల్లో 900 గోల్స్ సాధించాడు. అత్యధిక గోల్స్‌లో రొనాల్డో తర్వాత రెండో స్థానంలో అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ ఉన్నాడు. మెస్సీ 859 గోల్స్ సాధించాడు.

Cristiano Ronaldo Makes History as First Player to Reach 900 Career Goals

ఇక రొనాల్డో గోల్స్‌లో మరో విశేషం ఉంది. సాధారణంగా ఏ ఆటగాడైనా కుడి పాదాన్ని ఉపయోగించే ఎక్కువ గోల్స్‌ చేస్తారు.అయితే రొనాల్డో కూడా ఇదే పాదంతో అత్యధికంగా గోల్స్ చేసినప్పటికీ ఎడమపాదంతోనూ ఎక్కువ గోల్స్ సాధించడం విశేషం. కుడిపాదంతో 576, ఎడమ పాదంతో 173, హెడ్ షాట్‌తో 151 గోల్స్ అందుకున్నాడు. ఇక పెనాల్టీల నుంచి రొనాల్డో 164 గోల్స్ సాధించాడు. కేవలం 30 పెనాల్టీలలోనే బంతిని నెట్‌లోకి పంపలేకపోయాడు.

కాగా, రొనాల్డో 131 అంతర్జాతీయ గోల్స్ సాధించగా, రియల్ మాడ్రిడ్ తరఫున 450, మాంచెస్టర్ యునైటెడ్ తరఫున 145, జువెంటస్ తరఫున 101, ప్రస్తుత క్లబ్ ఆల్ నాజర్ తరఫున 68 గోల్స్ సాధించాడు.

Story first published: Saturday, September 7, 2024, 11:17 [IST]
Other articles published on Sep 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+