న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

అత్యాచార ఆరోపణలు: రొనాల్డోకు తొలి ఎదురుదెబ్బ, సస్పెండ్‌ చేసిన కోచ్

Cristiano Ronaldo Left Off Portugal's National Team
Cristiano Ronaldo Left Off Portugal National Team After Rape Allegations

హైదరాబాద్: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాల్‌ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు తొలి ఎదురుదెబ్బ. రొనాల్డోను పోర్చుగల్‌ జాతీయ జట్టులో నాలుగు మ్యాచ్‌ల నుంచి సస్పెండ్‌ చేశారు. పోర్చుగల్‌ ఆడనున్న తర్వాతి నాలుగు అంతర్జాతీయ మ్యాచ్‌లకు గాను జట్టులోకి రొనాల్డోను తీసుకోవడం లేదని ఆ జాతీయ జట్టు కోచ్‌ ఫెర్నాండో సాంటోస్‌ వెల్లడించాడు.

దుష్ప్రచారం చేస్తున్నారు: మోడల్ అత్యాచార ఆరోపణలపై రొనాల్డోదుష్ప్రచారం చేస్తున్నారు: మోడల్ అత్యాచార ఆరోపణలపై రొనాల్డో

 ఓ హోటల్‌ గదిలో రొనాల్డో తనపై అత్యాచారం చేశాడని

ఓ హోటల్‌ గదిలో రొనాల్డో తనపై అత్యాచారం చేశాడని

2009లో లాస్‌వెగాస్‌లోని ఓ హోటల్‌ గదిలో రొనాల్డో తనపై అత్యాచారం చేశాడని కేథరిన్‌ మయోర్గా అనే అమెరికా మాజీ మోడల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాస్‌ వెగాస్‌ పోలీసులు కూడా ఆ కేసును రీఓపెన్‌ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఏ రొనాల్డో అంటూ ఎక్కడ చెప్పకపోవడంతో అందరూ క్రిస్టియానో రొనాల్డో అని భావిస్తున్నారు.

అత్యాచార ఆరోపణలను ఖండించిన క్రిస్టియానో రొనాల్డో

అత్యాచార ఆరోపణలను ఖండించిన క్రిస్టియానో రొనాల్డో

అయితే, తనపై వస్తోన్న అత్యాచార ఆరోపణలను బుధవారం క్రిస్టియానో రొనాల్డో ఖండించాడు. "అత్యాచారం అనేది హేయమైన నేరం. నాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమైనవి. వాటి మీద సమగ్ర విచారణ జరగాలి. నా పేరు చెప్పుకొని.. గొప్పవాళ్లవుదామనే తాపత్రయంతోనే కొంతమంది ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు" అని రొనాల్డో ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

 జట్టు నుంచి తప్పించడానికి కారణాలను వెల్లడించిన అధ్యక్షుడు

జట్టు నుంచి తప్పించడానికి కారణాలను వెల్లడించిన అధ్యక్షుడు

అయినా... రొనాల్డోను యుఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ నుంచి తప్పించడానికి గల కారణాలను రొనాల్డోతో తాను, పోర్చుగీస్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్య అధ్యక్షుడు ఫెర్నాండో గోమ్స్‌ మాట్లాడినట్టు సాంటోస్‌ తెలిపాడు. యుఈఎఫ్ఏ నేషన్స్ లీగ్‌లో భాగంగా అక్టోబర్ 11న పోలెండ్-పోర్చుగల్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

రోనాల్డోపై వేటు, మీడియాకు చెప్పలేనన్న కోచ్‌

రోనాల్డోపై వేటు, మీడియాకు చెప్పలేనన్న కోచ్‌

ఈ మ్యాచ్ ముగిసిన మూడు రోజులకు గ్లాస్కో-స్కట్లాండ్ జట్ల మధ్య ప్రెండ్లీ మ్యాచ్ జరగనుంది. నవంబర్ వరకు పోర్చుగల్ ఆడే అన్ని జాతీయ మ్యాచ్‌ల నుంచి రొనాల్డోను తప్పించినట్లు ఫెర్నాండో గోమ్స్‌ వెల్లడించాడు. అయితే, రొనాల్డోను తప్పించడం వెనక కారణమేంటన్నది తాను మీడియాకు చెప్పలేనని కోచ్‌ పేర్కొన్నాడు.

Story first published: Saturday, October 6, 2018, 11:20 [IST]
Other articles published on Oct 6, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X