న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

తామిద్దరం ఇష్టపూర్వకంగానే సెక్స్‌లో పాల్గొన్నాం: అత్యాచార ఆరోపణలపై రొనాల్డో

Cristiano Ronaldo lawyer says documents presented in rape allegation are fabricated

హైదరాబాద్: 2009లో లాస్‌వెగాస్‌లోని ఓ హోటల్‌ గదిలో రొనాల్డో తనపై అత్యాచారం చేశాడని కేథరిన్‌ మయోర్గా అనే అమెరికా మాజీ మోడల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, తాను అత్యాచారం చేయలేదని ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో మరోసారి స్పష్టం చేశాడు.

తామిద్దరం ఇష్టపూర్వకంగానే శృంగారంలో పాల్గొన్నామని క్రిస్టియానో రొనాల్డో మరోసారి చెప్పుకొచ్చాడు. "చాలా ఒత్తిళ్ల వల్ల రొనాల్డో ఈ అంశంపై మాట్లాడాల్సివస్తోంది" అని అతడి తరుపు న్యాయవాది పేర్కొన్నాడు. తాను ఎప్పుడూ చెబుతున్న విషయాన్నే రొనాల్డో మరోసారి చెప్పాడు.

అత్యాచార ఆరోపణలు: రొనాల్డోకు తొలి ఎదురుదెబ్బ, సస్పెండ్‌ చేసిన కోచ్అత్యాచార ఆరోపణలు: రొనాల్డోకు తొలి ఎదురుదెబ్బ, సస్పెండ్‌ చేసిన కోచ్

2009లో లాస్‌వెగాస్‌ హోటల్లో జరిగింది ఇష్టపూర్వకంగానే జరిగిందని చెప్పాడు. అయితే, రొనాల్డో తనపై అత్యాచారం చేశాడని కేథరిన్‌ మయోర్గా అనే అమెరికా మాజీ మోడల్ ఆరోపించిన నేపథ్యంలో లాస్‌ వెగాస్‌ పోలీసులు కూడా ఆ కేసును రీఓపెన్‌ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

అయితే, తనపై వస్తోన్న అత్యాచార ఆరోపణలపై "అత్యాచారం అనేది హేయమైన నేరం. నాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమైనవి. వాటి మీద సమగ్ర విచారణ జరగాలి. నా పేరు చెప్పుకొని.. గొప్పవాళ్లవుదామనే తాపత్రయంతోనే కొంతమంది ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు" అని రొనాల్డో ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

ఆరోజు అసలేం జరిగింది?

ఆరోజు అసలేం జరిగింది?

రొనాల్డో తనను అత్యాచారం చేశాడని తాజాగా ‘మీ టూ' ప్రోగ్రాంలో పాల్గొన్న అమెరికన్‌ మాజీ మోడల్‌ కేథరిన్‌ మయోర్గా తనపై జరిగిన లైంగిక దాడి గురించి వివరించి, కోర్టులో కేసు వేసింది. జూన్‌ 13, 2009 రోజున లాస్‌ వెగాస్‌లోని రొనాల్డో తన పెంట్‌హౌస్‌లో తనను హత్యాచారం చేశాడని ఆమె అందులో ఆరోపించింది. ‘‘2009లో లాస్‌వేగాస్‌లోని పామ్స్‌ హోటల్‌ రొనాల్డోను కలిశాను. హోటల్లోని తన గదికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. నేను వెళ్లాను" అని తెలిపింది.

రొనాల్డో పేరును పోలీసులకు చెప్పలేదు

రొనాల్డో పేరును పోలీసులకు చెప్పలేదు

"ఓ కార్యక్రమంలో పాల్గొనాలని, దుస్తులు మార్చుకోమని అన్నాడు. మార్చుకోవడానికి బాత్ రూమ్‌కు వెళ్లాను. అక్కడికి వచ్చి నన్ను బలవంతంగా పడకగదికి తీసుకెళ్లి.. వద్దు వద్దు అంటున్నా అత్యాచారం చేశాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాను. ముందు రొనాల్డో పేరును పోలీసులకు చెప్పలేదు. తర్వాత విచారణలో చెప్పాను. అయితే బ్లాక్‌మెయిల్‌ చేయడానికే తాను ఇలాంటి ఆరోపణలు చేస్తున్నానని రొనాల్డో వాదించే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు" అని కేథరిన్‌ వెల్లడించింది.

ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయా

ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయా

"నాకు వైద్య పరీక్షలు చేసిన నర్సు కూడా ఆ మాటే చెప్పింది. దీంతో అప్పట్లో ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాను. అనంతరం భయపడిన రొనాల్డో తన లాయర్‌తో అగ్రిమెంట్‌ చేయించి కేసు బయటకి రాకుండా చేశాడు. ఇందుకోసం రొనాల్డో మనుషులు నాకు 3 లక్షల 75 వేల డాలర్లు చెల్లించి ఒప్పందం చేసుకున్నారు. మానసికంగా బలహీనంగా ఉన్న సమయంలో ఆ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అందుకే దానిని రద్దు చేయండి" అని తాను వేసిన దావాలో పేర్కొంది.

 కేసును రీఓపెన్ చేసి దర్యాప్తు ప్రారంభించిన లాస్ వేగాస్ పోలీసులు

కేసును రీఓపెన్ చేసి దర్యాప్తు ప్రారంభించిన లాస్ వేగాస్ పోలీసులు

ప్రస్తుతం లాస్‌ వెగాస్‌ పోలీసులు కూడా ఆ కేసును రీఓపెన్‌ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఏ రొనాల్డో అంటూ ఎక్కడ చెప్పకపోవడంతో అందరూ క్రిస్టియానో రొనాల్డో అని అనుకుంటున్నారు. అయితే అత్యుత్సాహం ప్రదర్శించిన జర్మన్‌ మ్యాగజైన్‌ క్రిస్టియానో రొనాల్డో ఫోటో కవర్‌ పేజీపై వేసి ఆ వార్త ప్రచురించింది. దీనిపై రొనాల్డో వ్యక్తిగత లాయర్‌ ఆ మ్యాగజైన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్య్కులేషన్‌ను పెంచుకునే భాగంగా ఇలాంటి నిరాధారిత వార్తలు రాయడం తగదని అన్నారు. జర్మన్‌ మ్యాగజైన్‌పై దావా వేయనున్నట్లు ప్రకటించారు. అది తప్పుడు వార్త అని, చట్టవ్యతిరేకమని తెలిపారు.

Story first published: Friday, October 12, 2018, 9:38 [IST]
Other articles published on Oct 12, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X