
హైదరాబాద్: క్రిస్టియానో రొనాల్డో.. సాకర్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ పుట్‌బాల్ ఆటగాళ్లలో ఒకడు. రొనాల్డోకు మొత్తం నలుగురు పిల్లలు. తాజాగా ఇప్పుడు అతని కొడుకు క్రిస్టియానో రొనాల్డో జూనియర్ కూడా తండ్రి బాటలోనే అడుగులు వేస్తున్నాడు.
ఏడేళ్ల జూనియర్ రొనాల్డో చేసిన గోల్ చూసిన అభిమానులు నోరెళ్లబెడుతున్నారు. అచ్చం తండ్రిలాగే గోల్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వరల్డ్‌కప్ వామప్‌లో భాగంగా అల్జీరియాతో లిస్బన్‌లో జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్ 3-0తో విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత జూనియర్ రొనాల్డో ఓ గోల్ చేశాడు.
గోల్‌పోస్ట్‌కు పది మీటర్ల దూరం నుంచి అతను చేసిన గోల్ కళ్లు చెదిరేలా ఉంది. ఇది చూసి రొనాల్డో కూడా తన నవ్వుని ఆపుకోలేకపోయాడు. గోల్ కొట్టిన తర్వాత ఇది తనకు మామూలే అన్నట్లు జూనియర్ రొనాల్డో చూసిన ఆ చూపు అయితే హైలైట్‌గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోని పోర్చుగల్ జట్టు తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది.