Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రొనాల్డో ది గ్రేట్: మాంఛెస్టర్ స్ట్రయికర్ జ్లాటన్

బెంగళూరు: రియల్ మాడ్రిడ్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోతోపాటు మరో బ్రెజిలియన్ స్టార్ రొనాల్డో గొప్ప ఆటగాళ్లని, కానీ వారిలో ఉన్నది సహజసిద్ధమైన ప్రతిభ మాత్రమే కాదని మాంఛెస్టర్ యునైటెడ్ ఏస్ స్ట్రయికర్ జ్లాటాన్ ఇబ్రహిమోవిక్ పేర్కొన్నాడు.

క్రిస్టియానో రొనాల్డో ఎప్పటికైనా అత్యంత గొప్ప ఫుట్ బాలర్ అని ఓ వార్తాసంస్థతో చెప్పాడు. రొనాల్డిన్హో కాలంలోనే ప్లేయర్లందరికంటే గొప్ప ఆటగాడని వ్యాఖ్యానించాడు. ఎసి మిలాన్ తరఫున రొనాల్డిన్హో కలిసి జ్లటాన్ కూడా కలిసి ఆడాడు.

కానీ క్రిస్టియానో రొనాల్డో ఎంతో కష్టపడి పనిచేస్తే గానీ ఈ స్థాయికి చేరుకోలేదని పేర్కొన్నాడు. రొనాల్డో ఒక ఫెనోమెనో 2 వంటి ఉత్తమ ప్లేయర్ అని, ఫుట్‌బాల్‌కు సరైన ఉదాహరణ అని అన్నాడు.

రొనాల్డో సహజమైన వ్యక్తేనని, కానీ కొంత శిక్షణ పొందితే గానీ ఈ స్థాయికి చేరుకోలేదన్నాడు. ఆయన చాలా అరుదైన ఆటగాడని పేర్కొన్నాడు. తాను, రొనాల్డిన్హో కలిసి ఎసి మిలాన్ జట్టు తరఫున ఆడామని, అప్పట్లో తమదే ఉత్తమ జోడీ అని పేర్కొన్నాడు.

Cristiano Ronaldo is not a natural talent: Zlatan Ibrahimovic

కానీ రొనాల్డో వంటి ప్లేయర్‌తో కలిసి ఆడకున్నా.. ఆయన చాలా విభిన్నమైన ఆటగాడన్నాడు. చాలా కష్టపడి శిక్షణ పొందితేనే ఆయన ఈ స్థాయికి చేరుకున్నాడని తెలిపాడు. 2016 క్రిస్టియానో రొనాల్డోకు గొప్ప సంవత్సరం అని పేర్కొన్నాడు. ఆయన యుఇఎఫ్ఎ చాంపియన్స్ లీగ్, యూరో 2016 టైటిళ్లు, క్లబ్ ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలు గెలుచుకున్నాడు, అదే విధంగా బాల్లోన్ డి'ఓర్ అవార్డు గెలుచుకున్నాడని గుర్తుచేశాడు.

జ్లాటన్ కూడా గొప్ప ఆటగాడు. ఈ ఏడాదే పారిస్ సెయింట్ జెర్మైన్ క్లబ్ ను వీడి ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ జెయింట్స్ మాంఛెస్టర్ యునైటెడ్ జట్టులో చేరాడు. 2016లో 50 గోల్స్ సాధించాడు. ఈ సీజన్ లోనే బార్సిలోనా ప్లేయర్ లియానెల్ మెస్సీ రికార్డును సమంచేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. తాను బ్రెజిల్ కు వెళితే ఫుట్‌బాల్ ఆటను ఎంజాయ్ చేస్తానని పేర్కొన్నాడు.

2018 ఫిఫా వరల్డ్ కప్ టోర్నీకి రికార్డు స్థాయిలో వాలంటీర్లు

మాస్కో: వచ్చే ఏడాది రష్యాలో జరిగే ఫిఫా ప్రపంచకప్ టోర్నీ నిర్వహణలో వాలంటీర్లుగా చేరడంలో రష్యన్లు రికార్డు నెలకొల్పారు. ఈ విషయాన్ని రష్యా - 2018 ఫుట్ బాల్ ఫిఫా వరల్డ్ కప్ నిర్వాహక కమిటీ డైరెక్టర్ జనరల్ అలెక్సి సొరోకిన్ తెలిపాడు. ఇప్పటి వరకు 1.70 లక్షల మంది వాలంటీర్లుగా చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారని ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

2017లో జరిగే కాన్ఫిడరేషన్స్ కప్, 2018 వరల్డ్ కప్ నిర్వహణకు అవసరమైన వాలంటీర్ల నియామక ప్రక్రియను గత ఏడాది జూన్ ఒకటో తేదీన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఫిఫా అధ్యక్షుడు జియాన్నీ ఇన్‌ఫాంటినో లాంచనంగా ప్రారంభించారు.ఈ రెండో టోర్నీలకు రష్యా ఆతిథ్యం ఇస్తున్నది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+