Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కన్నీటితో రొనాల్డో.. కప్ చేజారడంతో వెక్కివెక్కి ఏడుస్తూ! (Video)

ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో కన్నీటి పర్యంతమయ్యాడు. కింగ్స్ కప్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో తన జట్టు అల్ నాసర్‌ను గెలిపించలేకపోయాననే బాధతో మైదానంలోనే వెక్కివెక్కి ఏడ్చాడు. ఫైనల్‌లో అల్ నాసర్- అల్ హిలాల్ జట్లు తలపడ్డాయి. నాటకీయంగా సాగిన ఈ తుదిపోరులో అల్ హిలాల్ పెనాల్టీ షూటౌట్‌లో గెలిచింది.

120 నిమిషాల పాటు సాగిన టైటిల్ పోరులో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. దీంతో మ్యాచ్ ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లింది. పెనాల్టీ షూట్‌లో అల్ నాసర్ 4-5 తేడాతో ఓటమిపాలైంది. నిర్ణయాత్మక షూట్‌లో మెషారి ఆడిన షాట్‌ను అడ్డుకోవడంతో అల్ హిలాల్ విజేతగా నిలిచింది.

Cristiano Ronaldo in Tears After Al Nassr s King Cup Final Defeat Video Surfaces

రొనాల్డో 120 నిమిషాల పాటు జట్టు గెలవాలని సర్వశక్తులతో పోరాడాడు. అంతేగాక పెనాల్టీలో గోల్ సాధించాడు. కానీ జట్టును గెలిపించలేకపోయాననే బాధతో ఈ పోర్చుగల్ సాకర్ కన్నీటినీ ఆపుకోలేకపోయాడు. మైదానంలోనే వెక్కివెక్కి ఏడ్చాడు. 2022 డిసెంబర్‌లో క్రిస్టియానా రొనాల్డో అల్‌నాసర్ ఫ్రాంచైజీకి వచ్చాడు.

అయితే 39 ఏళ్ల క్రిస్టియానో రొనాల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 35 గోల్స్ కొట్టిన రొనాల్డో సౌదీ ప్రో లీగ్‌లో అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు అల్ నాసర్ స్ట్రైకర్ అబ్డరజాక్ హమ్దల్లా పేరిట ఉంది. అతను 34 గోల్స్ సాధించాడు. కాగా, రొనాల్డో కంటతడి పెట్టిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Story first published: Saturday, June 1, 2024, 12:38 [IST]
Other articles published on Jun 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+