న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

20 ఏళ్ల కుర్రాడు.. రొనాల్డొ ఇద్దరూ సమానమేనా..!!

Cristiano Ronaldo has physical abilities of 20-year-old, reveals Juventus medical

హైదరాబాద్: రెండు నెలల కిందట పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో స్పెయిన్‌కు చెందిన ఎల్ చిరింగిటో అనే చానెల్‌కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో మాట్లాడుతూ.. నా వయసు 33 ఏళ్లయినా.. 23 ఏళ్ల కుర్రాడికుండే శక్తి నాలో ఉంది. నేను 41 ఏళ్ల వరకు కూడా ఫుట్‌బాల్ ఆడగలను అని అన్నాడు. ఇప్పుడు అతను చెప్పిన మాటలు నిజమయ్యాయి. ఓ మెడికల్ స్టడీయే ఈ విషయాన్ని వెల్లడించింది.

ఈ విషయంపై సాకర్ దిగ్గజం క్రిస్టియన్ రొనాల్డొ మాట్లాడుతూ..'ప్రాక్టీస్ సమయంలో నేనే టాప్‌గా ఉండాలని ప్రయత్నిస్తాను. శిక్షణ కాలంలో కఠిన శ్రమ చేయడానికి ఇష్టపడతాను. ఇంకా ఇంతకుమించి నేనేంటో నిరూపించుకోవాలసిన అవసర్లేదు. నా గురించి అందరకీ తెలుసు. కొత్తగా కనిపించాలనుకుంటాను. మార్పులను కోరుకుంటాను. ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకుని అందులో ఉండిపోవాలనుకోను. కొత్త ఛాలెంజ్‌లను స్వీకరించడాన్ని ఇష్టపడతాను. మాంచెస్టర్, రియల్ మాడ్రిడ్ క్లబ్‌ల తర్వాత చేరిన జ్యూవెంటస్‌లోనూ చరిత్ర సృష్టించి తీరతాను'.

నిజంగానే రొనాల్డోకు 20 ఏళ్ల కుర్రాడికుండే సామర్థ్యం ఉన్నదని ఆ అధ్యయనం తేల్చింది. సెరీ ఎ చాంపియన్స్‌కు చెందిన మెడికల్ స్టాఫ్ ఈ అధ్యయనం నిర్వహించింది. వాళ్ల ప్రకారం తన కన్నా 13 ఏళ్ల చిన్నవాళ్లతో కూడా తలపడే సామర్థ్యం అతని సొంతమని తేల్చారు.

ఈ సందర్భంగా ప్రధానంగా రొనాల్డోలో ఉన్న మూడు ప్రత్యేకతలను ఈ అధ్యయనం చెప్పింది. రొనాల్డో శరీరంలో కొవ్వు శాతం ఏడు మాత్రమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఏ ఇతర ప్రొఫెషనల్ ప్లేయర్ కంటే మూడు శాతం తక్కువ కావడం విశేషం. ఇక అతని కండర శక్తి 50 శాతంగా ఉంది. ఇతర ప్రొఫెషనల్ ప్లేయర్స్ కంటే ఇది నాలుగు శాతం ఎక్కువ. అంతేకాదు మొన్న వరల్డ్‌కప్‌లో రొనాల్డో అత్యధికంగా గంటకు 21.1 మైళ్ల వేగం అందుకున్నాడు. ఆ టోర్నీలో ఎవరికీ సాధ్యం స్పీడు ఇది అని ఆ అధ్యయనం స్పష్టంచేసింది. రొనాల్డో ఈ మధ్యే రియల్ మాడ్రిడ్‌కు గుడ్‌బై చెప్పి ఇటలీకి చెందిన జువెంటస్ క్లబ్‌తో చేరాడు. దీనికోసం అతనికి దాదాపు రూ.800 కోట్ల మొత్తం అందింది.

Story first published: Wednesday, July 25, 2018, 16:01 [IST]
Other articles published on Jul 25, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X