Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రియల్‌మాడ్రిడ్‌లో ఉండాలంటే ఇవీ రొనాల్డో షరతులు

 Cristiano Ronaldo has made two huge demands to commit his future at Real Madrid

హైదరాబాద్: స్పానిష్ ఫుట్‌బాల్ లీగ్ 'లా లీగా' జెయింట్ క్లబ్ రియల్ మాడ్రిడ్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో తన భవితవ్యంపై తాజాగా కీలక ప్రకటన చేశాడు. రియల్ మాడ్రిడ్ క్లబ్‌లోనే కొనసాగాలంటే తన రెండు డిమాండ్లు నెరవేర్చాలని క్లబ్ యాజమాన్యాన్ని కోరాడు. రియల్ మాడ్రిడ్ క్లబ్ అధ్యక్షుడు ఫ్లోరెంటినో పెరెజ్ ఆయన డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటారో లేదోనన్న విషయం తేలాల్సి ఉంది. బయటకు ఫుట్‌బాల్ ఆటగాళ్లు, అభిమానుల దృష్టంతా వచ్చేనెలలో రష్యాలో జరిగే సాకర్ సంరంభంపైనే ఉండగా, కొందరు ప్రధాన ఆటగాళ్లు మాత్రం తమ ట్రాన్స్‌ఫర్ పైనే కేంద్రీకరించారు. వారిలో రియల్ మాడ్రిడ్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఒకరు.

త్వరలో ఫ్లోరెంటినో పెరెజ్‌తో రొనాల్డో భవితవ్యంపై చర్చలు

త్వరలో ఫ్లోరెంటినో పెరెజ్‌తో రొనాల్డో భవితవ్యంపై చర్చలు

ఎల్లవేళలా ట్రాన్స్‌ఫర్ మార్కెట్‌లో బదిలీలు, మార్పుల గురించి వచ్చే వార్తలు, దీంతో తీవ్ర ప్రతికూల ప్రభావంపై కథనాలు వస్తున్నాయి. చాంపియన్స్ లీగ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత క్రిస్టియానా రొనాల్డో తన భవితవ్యంపై చేసిన వ్యాఖ్యలు మరింత వేడిని రగిల్చాయి. త్వరలో ఆయన రియల్ మాడ్రిడ్ క్లబ్ అధ్యక్షుడు ఫ్లోరెంటినో పెరెజ్‌తో సమావేశమై స్పెయిన్‌లో తన భవితవ్యం గురించి చర్చించనున్నారని వార్తలొచ్చాయి.

మెస్సీతో సమానంగా వేతనం ఇవ్వాలి

మెస్సీతో సమానంగా వేతనం ఇవ్వాలి

ఆయన ప్రధానంగా తాను రియల్ మాడ్రిడ్ క్లబ్‌లోనే కొనసాగాలంటే రెండు డిమాండ్లు నెరవేర్చాలని క్లబ్ యాజమాన్యాన్ని కోరారు. వాటిలో ఒకటి తన వేతనాన్ని బార్సిలోనా ఫార్వర్డ్ ప్లేయర్ లియానెల్ మెస్సీతో సమానంగా వారానికి ఏడు లక్షల యూరోలు ఇవ్వాలన్నది రొనాల్డొ తొలి డిమాండ్.

నేయ్మార్ తీసుకునే విషయం మర్చిపోవాలన్న రొనాల్డో

నేయ్మార్ తీసుకునే విషయం మర్చిపోవాలన్న రొనాల్డో

ఇక ఈజిప్టు ఆటగాడు నేయ్మార్‌ను జట్టులోకి తీసుకునే విషయాన్ని మరిచిపోవాలని ప్రతిపాదించాడు. ఐదుసార్లు చాంపియన్స్ లీగ్ టైటిల్‌ను గెలుచుకున్న రొనాల్డో తమ క్లబ్‌ డ్రెస్సింగ్ రూమ్‌లో నేయ్మార్‌కు చోటు కల్పించొద్దని కోరుతున్నాడు. క్లబ్‌లో తాను మాత్రమే పెద్ద దిక్కుగా ఉండాలని అభిలషిస్తున్నాడు రొనాల్డో.

రియల్ మాడ్రిడ్‌లో చేరిక వార్తలను కొట్టి పారేసిన నేయ్మార్

రియల్ మాడ్రిడ్‌లో చేరిక వార్తలను కొట్టి పారేసిన నేయ్మార్

బ్రెజిల్, పారిస్ సెయింట్ జెర్మైన్ (పీఎస్జీ) స్టార్ ప్లేయర్ నేయ్మార్ రియల్ మాడ్రిడ్ జట్టులో తన చేరిక గురించి వస్తున్న వదంతులను కొట్టి పారేశారు. వచ్చే నెలలో ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు సరిపడా శిక్షణ పొందలేదన్నాడు. పూర్తిగా ఫిట్‌నెస్ సాధించలేదన్నాడు. నా ఫోకస్ అంతా బ్రెజిల్ జట్టు కోసమేనని, మిగతా అంశాలను పట్టించుకోనన్నాడు. కాలికైన గాయంతో గత ఫిబ్రవరి నుంచి చికిత్స పొందుతున్న నేయ్మార్ భౌతికంగా తాను బాగానే ఉన్నా, కొన్ని కార్యక్రమాలు చేపట్టాల్సి ఉన్నదని తెలిపాడు. ప్రపంచకప్ టోర్నీ కోసం 100 శాతం సంసిద్ధంగా ఉన్నట్లు తేల్చి చెప్పాడు.

Story first published: Tuesday, May 29, 2018, 14:59 [IST]
Other articles published on May 29, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+