Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అనుష్క‌ను ఫాలో అయిన క్రిస్టియానో రొనాల్డో గ‌ర్ల్‌ఫ్రెండ్ (వీడియో)!!

Cristiano Ronaldo Gets Haircut From Girlfriend Georgina Rodriguez in Coronavirus Lockdown

లిస్బన్‌: మహమ్మారి కరోనా వైరస్‌ కారణంగా క్రీడాలోకం స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ఇక లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్టార్‌ క్రీడాకారులు ఇంటిపట్టునే ఉంటూ కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అయితే ఒక్కొక్క‌రు ఒక్కో ర‌కంగా ఈ ఖాళీ సమయాన్ని స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. పోర్చుగల్‌ సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో కూడా తనకు లభించిన ఖాళీ సమయాన్ని తన గ‌ర్ల్‌ఫ్రెండ్తో కలిసి ఆస్వాదిస్తున్నాడు.

అద్భుతమైన ఆట‌తీరుతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్న క్రిస్టియానో రొనాల్డో.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అనుస‌రించాడు. కోహ్లీకి అత‌ని భార్య అనుష్క‌ శ‌ర్మ ఇటీవలే హెయిర్‌క‌ట్ చేస్తే.. తాజాగా రొనాల్డోకు అతని స్నేహితురాలు జార్జినా రోడ్రిగ్స్ హెయిర్‌ స్టయిలి్‌స్టగా మారిపోయింది. తన జుట్టును జార్జినా ట్రిమ్‌ చేస్తున్న వీడియోను రొనాల్డో ట్వీట్‌ చేయడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా గ‌త నెల రోజుల నుంచి క్రిస్టియానో రొనాల్డో.. మ‌దిర‌లోని త‌న నివాసంలో సరదాగా గ‌డుపుతున్నాడు. క‌రోనాపై పోరాటంలో జువెంట‌స్ జ‌ట్టు నుంచి రొనాల్డోతో పాటు స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు నాలుగు నెల‌ల జీతాల‌ను వ‌దులుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇటీవలే లివింగ్ రూమ్ కప్ ఛాలెంజ్‌ను రొనాల్డో స్వీకరించి సక్సెస్ అయ్యాడు.

ఫిఫా చానెల్‌తో జ‌రిగిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో అడిగిన ప్ర‌శ్న‌ల‌కు బ్రెజిల్ సాక‌ర్ దిగ్గ‌జం కాకా ఆస‌క్తిక‌ర స‌మాధాన‌మిచ్చాడు. రొనాల్డో కంటే మెస్సీ అద్భుత ప్ర‌తిభ క‌ల్గిన ఆట‌గాడంటూ కాకా కితాబిచ్చాడు. 'రొనాల్డోతో క‌లిసి నేను చాలా ఏళ్లు ఆడాను. అత‌ను సూప‌ర్‌. కానీ ఈ ఇద్ద‌రిలో ఎవ‌రినో ఒక‌రిని ఎంచుకోవాలంటే మాత్రం నేను ..మెస్సీ వైపు మొగ్గుచూపుతాను. ఈ అర్జెంటీనా సాక‌ర్ స్టార్ జీనియ‌స్‌, ఇత‌నిది నిఖార్సైన ప్ర‌తిభ‌. ఆల్‌టైమ్ ఫుట్‌బాల్ చ‌రిత్ర‌లో వీరిద్ద‌రికి ప్ర‌త్యేక స్థాన‌ముంటుంది. క‌చ్చితంగా టాప్‌-5లో వీరు ఉంటారు. రొనాల్డో, మెస్సీ ఆట‌ను చూడ‌టం మా అదృష్టం' అని కాకా అన్నాడు.

Story first published: Monday, April 6, 2020, 13:41 [IST]
Other articles published on Apr 6, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+