హాలోవీన్ సెలబ్రేషన్స్: జోకర్‌గా క్రిస్టియానో రొనాల్డో.. ఫోటో ఛూశారా!

హైదరాబాద్: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హాలోవీన్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. ఈ సెలబ్రేషన్స్‌లో భాగంగా పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానొ రొనాల్డో సైతం జోకర్‌గా మారాడు. హాలీవుడ్ హార్రర్ సినిమాల్లో జోకర్ క్యారెక్టర్ గురించి మనందరికీ తెలిసిందే. హాలీవుడ్ మూవీల్లో జోకర్ పాపులర్ క్యారెక్టర్ కావడం విశేషం.
తాజాగా ఈ హాలోవీన్ సెలబ్రేషన్స్‌లో భాగంగా జోకర్ లుక్‌లో కనిపించి క్రిస్టియానొ అభిమానులకు షాకిచ్చాడు. కుటుంబసభ్యులతో కలిసి హాలోవీన్ పార్టీలో సందడి సందడి చేశాడు. రొనాల్డో గర్ల్‌ప్రెండ్ జార్జీనా సైతం వెరైటీ లుక్‌తో ఈ ఫోటోలో దర్శనమిచ్చింది. తమ పిల్లల్ని సైతం హాలీవుడ్ సినిమాల్లోని పాపులర్ క్యారెక్టర్స్‌ను తలపించేలా తయారు చేశారు.
ఇందుకు సంబంధించిన ఫోటోని క్రిస్టియానో రొనాల్డో తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేస్తూ "అందరికీ హ్యాపీ హాలోవీన్" అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో రొనాల్డో జోకర్ లుక్‌లో భలేగా ఉన్నాడంటూ సాకర్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications