న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

దుష్ప్రచారం చేస్తున్నారు: మోడల్ అత్యాచార ఆరోపణలపై రొనాల్డో

Cristiano Ronaldo denies rape allegation that left woman considering suicide

హైదరాబాద్: తనపై వస్తోన్న అత్యాచార ఆరోపణలపై ఎట్టకేలకు నొరువిప్పాడు పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాల్‌ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో. 2009లో లాస్‌వెగాస్‌లోని ఓ హోటల్‌ గదిలో రొనాల్డో తనపై అత్యాచారం చేశాడని కేథరిన్‌ మయోర్గా అనే అమెరికా మాజీ మోడల్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

సచిన్ క్రికెట్‌కు 'దేవుడైతే', ధోని 'కింగ్ ఆఫ్ క్రికెట్': పుస్తకం రాయనున్న స్పిన్నర్సచిన్ క్రికెట్‌కు 'దేవుడైతే', ధోని 'కింగ్ ఆఫ్ క్రికెట్': పుస్తకం రాయనున్న స్పిన్నర్

ప్రస్తుతం లాస్‌ వెగాస్‌ పోలీసులు కూడా ఆ కేసును రీఓపెన్‌ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఏ రొనాల్డో అంటూ ఎక్కడ చెప్పకపోవడంతో అందరూ క్రిస్టియానో రొనాల్డో అని భావిస్తున్నారు. తాజాగా, సోషల్ మీడియాలో తనపై వస్తోన్న అత్యాచార ఆరోపణలను బుధవారం క్రిస్టియానో రొనాల్డో ఖండించాడు.

"అత్యాచారం అనేది హేయమైన నేరం. నాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమైనవి. వాటి మీద సమగ్ర విచారణ జరగాలి. నా పేరు చెప్పుకొని.. గొప్పవాళ్లవుదామనే తాపత్రయంతోనే కొంతమంది ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు" అని రొనాల్డో ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.

 అసలేం జరిగిందంటే?

అసలేం జరిగిందంటే?

లాస్‌వెగాస్‌లోని ఓ హోటల్‌ గదిలో రొనాల్డో తనపై అత్యాచారం చేశాడని కేథరిన్‌ మయోర్గా అనే అమెరికా మాజీ మోడల్ నెవడా కోర్టులో కేసు వేసింది. వద్దు వద్దంటూ తాను అరిచినా రొనాల్డో వినలేదని ఆమె అందులో పేర్కొంది. లైంగిక దాడి చేశాక రొనాల్డో క్షమాపణలు చెప్పాడని, సాధారణంగా తాను మంచి మనిషినని తెలిపాడని వెల్లడించింది.

పామ్స్‌ హోటల్‌ రొనాల్డోను కలిశాను

పామ్స్‌ హోటల్‌ రొనాల్డోను కలిశాను

జూన్‌ 13, 2009 రోజున లాస్‌ వెగాస్‌లోని రొనాల్డో ఓ హోటల్‌ గదిలో తనను హత్యాచారం చేశాడని ఆమె అందులో ఆరోపించింది. ‘‘2009లో లాస్‌వేగాస్‌లోని పామ్స్‌ హోటల్‌ రొనాల్డోను కలిశాను. హోటల్లోని తన గదికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. నేను వెళ్లాను" అని తెలిపింది.

 దుస్తులు మార్చుకోవడానికి బాత్ రూమ్‌కు వెళ్లాను

దుస్తులు మార్చుకోవడానికి బాత్ రూమ్‌కు వెళ్లాను

"ఓ కార్యక్రమంలో పాల్గొనాలని, దుస్తులు మార్చుకోమని అన్నాడు. మార్చుకోవడానికి బాత్ రూమ్‌కు వెళ్లాను. అక్కడికి వచ్చి నన్ను బలవంతంగా పడకగదికి తీసుకెళ్లి.. వద్దు వద్దు అంటున్నా అత్యాచారం చేశాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాను. ముందు రొనాల్డో పేరును పోలీసులకు చెప్పలేదు. తర్వాత విచారణలో చెప్పాను. అయితే బ్లాక్‌మెయిల్‌ చేయడానికే తాను ఇలాంటి ఆరోపణలు చేస్తున్నానని రొనాల్డో వాదించే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు" అని కేథరిన్‌ వెల్లడించింది.

రొనాల్డో మనుషులు నాకు 3లక్షల 75వేల డాలర్లు చెల్లించారు

రొనాల్డో మనుషులు నాకు 3లక్షల 75వేల డాలర్లు చెల్లించారు

"నాకు వైద్య పరీక్షలు చేసిన నర్సు కూడా ఆ మాటే చెప్పింది. దీంతో అప్పట్లో ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాను. అనంతరం భయపడిన రొనాల్డో తన లాయర్‌తో అగ్రిమెంట్‌ చేయించి కేసు బయటకి రాకుండా చేశాడు. ఇందుకోసం రొనాల్డో మనుషులు నాకు 3లక్షల 75వేల డాలర్లు చెల్లించి ఒప్పందం చేసుకున్నారు. మానసికంగా బలహీనంగా ఉన్న సమయంలో ఆ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అందుకే దానిని రద్దు చేయండి" అని పేర్కొంది.

Story first published: Thursday, October 4, 2018, 15:43 [IST]
Other articles published on Oct 4, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X