Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబై ఓటమికి కారణాలివే: అవకాశాలపై రొనాల్డో ధీమా

న్యూఢిల్లీ: కేరళ బ్లాక్ బస్టర్స్ చేతిలో పరాజయం భారం నుంచి త్వరితగతిన తమ జట్టు బయట పడాల్సిన అవసరం ఉందని ముంబై సిటీ ఎఫ్‌‌సి హెడ్ కోచ్ అలెగ్జాండ్రీ గుమారెస్ వ్యాఖ్యానించాడు. సారధి డియాగో ఫోర్లాన్ గాయం వల్ల, రెడ్ కార్డు వల్ల ప్రధాన డిఫెన్సివ్ మిడ్ ఫీల్డర్ ప్రొనాయ్ హాల్డర్ లేకుండానే ముంబై సిటీ, కేరళతో తలపడింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నేపథ్యంలో తాము కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి వచ్చిందన్నాడు. పలుసార్లు బంతిని గోల్ పోస్ట్ దారి పట్టించేందుకు వచ్చిన అవకాశాలను తమ కుర్రాళ్లు మిస్ చేశారని తెలిపాడు. ఆటలో ఎటువంటి చాన్స్‌లు కూడా తమకు తాము కల్పించుకోలేకపోయారని తెలిపాడు. కేరళ కుర్రాళ్లు డిఫెన్సివ్‌గా ఆడటం వల్లే తాము ఓటమి పాలయ్యామన్న అభిప్రాయాన్ని ఆయన కొట్టి పారేశాడు.

తేలిపోయిన ముంబై: ఐఎస్ఎల్‌లో కేరళకు తొలి విజయం

వారికి అవకాశం కలిసి వచ్చి విజయం సాధించారే గానీ, సెకండాఫ్‌లో కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టుకు ఎటువంటి అవకాశం లభించలేదన్నాడు. చివరి 25 నిమిషాల్లోనూ తమకు వచ్చిన చాన్స్ లు మిస్సయ్యామని అలెగ్జాండ్రీ వ్యాఖ్యానించాడు. తమ జట్టులో ప్రత్యేకించి డిఫెన్సివ్ విభాగంలో ప్లేయర్లను రొటేట్ చేయాల్సి వచ్చిందని చెప్పాడు.

అద్భుతమైన అవకాశాలపై రొనాల్డో ధీమా

లా లీగా టోర్నీకి రెండు నెలలుగా దూరంగా ఉన్న ఫుట్ బాల్ లీగ్ జెయింట్ రియల్ మాడ్రిడ్ కీలక ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో.. తన జట్టు నెమ్మదిగా క్యాంపెయిన్ ప్రారంభించినా మున్ముందు అద్భతమైన అవకాశం లభిస్తుందని ధీమాగా ఉన్నాడు. యూరో 2016 టోర్నీలో గాయపడిన రొనాల్డో లా లీగా టోర్నీలో తొలి మూడు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు.

Cristiano Ronaldo Confident of a 'Spectacular' Season Ahead

జట్టులోకి వచ్చీ రాగానే ఒకే మ్యాచ్ లో నాలుగు గోల్స్ చేసి రికార్డు సాధించిన రొనాల్డో.. తనకు ప్రారంభంలో విశ్వాసం తక్కువగా వున్నదని వ్యాఖ్యానించాడు. హిట్ తర్వాత హిట్ కొట్టినా కొద్దీ తనలో విశ్వాసం పెల్లుబుకుతున్నదని మాడ్రిడ్ స్పోర్ట్స్ డెయిలీ మార్కాతో చెప్పాడు. ఈ సీజన్ సుదీర్ఘంగా సాగుతున్నదని, మరో అద్భుతమైన సీజన్ మన ముందు ఆవిష్కరణ కానున్నదని తెలిపాడు.

భవిష్యత్‌లో 2021లో జరిగే యూరోపియన్ చాంపియన్ షిప్ టోర్నీ వరకు తాను బంపర్ కాంట్రాక్టుపై సంతకం చేస్తానని తలపోస్తున్నాడు రొనాల్డో. తాను స్పానిష్ క్యాపిటల్ తోనే రిటైర్ కావాలని ఆకాంక్షిస్తున్నట్లు భవిష్యత్ వ్యూహాన్ని బయటపెట్టాడు. 2009లో మాంఛెస్టర్ యునైటెడ్ క్లబ్ తరపున ఆల్ టైమ్ గోల్ స్కోరర్‌గా నిలిచినప్పటి నుంచి రొనాల్డో మెరుపులు మెరిపిస్తూనే ఉన్నాడు.

తాను ఎంతోకాలం రియల్ మాడ్రిడ్ క్లబ్ తరఫున ఆడలేనని, రిటైర్ కావాలని భావిస్తున్నట్లు ఇంతకుముందే చెప్పానని గుర్తుచేశాడు. అయితే రియల్ మాడ్రిడ్ క్లబ్‌కు తన హృదయంలో గొప్ప స్థానం ఉన్నదని తెలిపాడు. 'రియల్ మాడ్రిడ్ క్లబ్ వ్యక్తిగతంగానూ, సమిష్టిగా టోర్నీలను గెలుచుకొనేందుకు క్లబ్ యాజమాన్యం పలు అవకాశాలు కల్పించింది. నా కాంట్రాక్టును రియల్ మాడ్రిడ్‌తోనే పునరుద్ధరించుకోనున్నాను' అని రొనాల్డో అన్నాడు.

రెండు చాంపియన్స్ లీగ్ టైటిళ్లు గెలుచుకున్నా, బాలోన్ డీ 'ఓర్ చాంపియన్ షిప్‌ను రెండు సార్లు గెలుచుకున్నా రియల్ మాడ్రిడ్ తరఫున లా లీగా టోర్నీలోనే ఆడాలని భావిస్తున్నానన్నాడు. ఏడుసార్లు లా లీగా టైటిళ్లను గెలుచుకోవడంలో రొనాల్డో పాత్ర కీలకం. కాగా, ప్రస్తుత డిఫెండింగ్ చాంపియన్లు బార్సిలోనా క్లబ్ జట్టుపై పాయింట్లలో ఆధిక్యం సాధించిన రియల్ మాడ్రిడ్ ఏళ్ల తరబడి లా లీగా టోర్నీ టైటిల్ కోసం ఎదురుచూసే అవకాశమే లేదన్నాడు. పోటీ పటిష్ఠంగా ఉన్నా.. ట్రోఫీ తమ జట్టుదేనని రొనాల్డో స్పష్టంచేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+