న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఇంటర్వ్యూలో ఎమోషనల్: బోరున ఏడ్చిన రొనాల్డో (వీడియో)

Cristiano Ronaldo breaks down in tears during emotional interview

హైదరాబాద్: పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో ఒక ఇంటర్వ్యూలో బోరున ఏర్చాడు. తాను సాధించిన ఘనతలను కుటుంబంలోని అందరూ చూసినప్పటికీ తన తండ్రి చూడలేకపోరంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రముఖ ఇంగ్లీష్‌ జర్నలిస్టు పీయర్స్‌ మోర్గాన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో రొనాల్డో తన తండ్రి జోస్ డినిస్ అవీరోని గుర్తు చేసుకున్నాడు.

ఫోటో ఏం చెబుతోంది!: అజహర్ కొడుకుతో సానియా మిర్జా చెల్లెలు పెళ్లి!ఫోటో ఏం చెబుతోంది!: అజహర్ కొడుకుతో సానియా మిర్జా చెల్లెలు పెళ్లి!

రొనాల్డో మాట్లాడుతూ

రొనాల్డో మాట్లాడుతూ

ఈ సందర్భంగా రొనాల్డో మాట్లాడుతూ "ఈ వీడియోని నేను ఎప్పుడూ చూడలేదు. అది నమ్మశక్యంగా లేదు" అని అంటూ బోరున విలపించాడు. అందులో ఏడిపించే సన్నివేశం ఏముందని మోర్గాన్‌ అడగ్గా "నేను నంబర్‌ వన్‌ కావడం దగ్గర్నుంచి, నేను తీసుకున్న అవార్డులు ఏవీ నాన్న జోస్‌ డినిస్‌ చూడలేదు. ఏ ఒక్క ఘనతను ఆయన చూడలేకపోయాడు" అని సమాధానమిచ్చాడు.

మా నాన్నకు తెలియదు

"నేను ఫుట్‌బాల్‌ రంగంలో ఎలా ఎదిగానో అస్సలు మా నాన్నకు తెలియదు. మా కుటుంబం అంతా నా ఘనతల్ని చూశారు. మా అమ్మ, సోదరులు, చివరకు నా కుమారుడు కూడా నేను అవార్డులు తీసుకోవడం చూశాడు. కానీ, మా నాన్న మాత్రం అది చూడలేకపోయాడు. యుక్త వయసులోనే నాన్న చనిపోయారు" అని రొనాల్డో కన్నీళ్లు పెట్టుకున్నాడు.

2005లో చనిపోయిన రొనాల్డో తండ్రి

2005లో చనిపోయిన రొనాల్డో తండ్రి

రొనాల్డో తండ్రి జోస్ డినిస్ అవీరో 2005లో ఛాంపియన్స్ లీగ్ గ్రూప్ గేమ్‌లో భాగంగా మాంచెస్టర్ యునైటెడ్-విల్లారీల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మృతి చెందారు. ఫెర్గుసన్ గైడెన్స్‌లోనే క్రిస్టియానో రొనాల్డో అత్యుత్తమ ఆటగాడిగా ఎదిగాడు. మాంచెస్టర్ జట్టు 2007-09 మధ్య కాలంలో మూడు సార్లు ప్రీమియర్ టైటిళ్లు నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు.

ఐదు సార్లు ‘బాలోన్ డి ఓర్‌’ అవార్డు

ఐదు సార్లు ‘బాలోన్ డి ఓర్‌’ అవార్డు

ఇక, 2008లో మాంచెస్టర్ జట్టు ఛాంపియన్స్ లీగ్ టైటిల్ నెగ్గడంలో రొనాల్డోదే కీలకపాత్ర. అంతేకాదు ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాలర్‌కు ఇచ్చే ప్రతిష్టాత్మక ‘బాలోన్ డి ఓర్‌' అవార్డును రొనాల్డో ఐదు సార్లు(2008, 2013, 2014, 2016, 2017) అందుకున్నాడు.

Story first published: Monday, September 16, 2019, 18:29 [IST]
Other articles published on Sep 16, 2019
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X