న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఇన్‌స్టాగ్రామ్‌లో క్రిస్టియానో రొనాల్డో సరికొత్త రికార్డు!!

Cristiano Ronaldo becomes first person to have 200 million Instagram followers

న్యూఢిల్లీ: పోర్చుగల్ ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మైదానంలోనే కాదు సోషల్‌ మీడియాలో కూడా తనకు ఎదురులేదని మరోసారి నిరూపించాడు. ఇప్పటికే సోషల్‌ మీడియాలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న రొనాల్డో.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 200 మిలియన్ల ఫాలోవర్ల మార్కు దాటేశాడు. ఈ మైలురాయిని దాటిని తొలి వ్యక్తి రొనాల్డోనే కావడం విశేషం. ప్రస్తుతం ఇన్‌స్టాలో ఇన్‌స్టాగ్రమ్ అధికారిక ఖాతా (330.5 మిల్లియన్ల ఫాలోవర్స్‌)కు మాత్రం రొనాల్డో వెనుకున్నాడు.

నేడు నాలుగో టీ20 మ్యాచ్‌.. మార్పులతో బరిలోకి భారత్‌.. ఓపెనర్‌గా విలియమ్సన్‌నేడు నాలుగో టీ20 మ్యాచ్‌.. మార్పులతో బరిలోకి భారత్‌.. ఓపెనర్‌గా విలియమ్సన్‌

ఈ సందర్భంగా రొనాల్డో తన అభిమానులకు అభినందనలు చెబుతూ ఓ పోస్టు చేశాడు. ఇప్పటివరకు తనకు అండగా నిలుస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు. సోషల్‌ మీడియాలో మొత్తంగా 330 మిలియన్ల మంది రొనాల్డోను ఫాలో అవుతున్నారు. హాలీవుడ్ సింగర్ అరియానా గ్రాండే 173.1 మిల్లియన్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉన్నారు. డ్వేన్‌ జాన్సన్‌ (170 మిలియన్లు), సెలెనా గోమేజ్‌ (167 మిలియన్లు), కైలీ జెన్నెర్‌ (160 మిలియన్లు), కిమ్‌ కర్దాషియన్‌ (158 మిలియన్లు) వరుసగా తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

రొనాల్డో ప్రత్యర్థి లియోనల్ మెస్సీ 141.8 మిల్లియన్ల ఫాలోవర్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. రొనాల్డో తన ఆటతో కంటే పోస్ట్‌ల ద్వారానే ఎక్కువగా ఆర్జిస్తున్నట్లు ప్రఖ్యాత మార్కెటింగ్‌ కంపెనీ 'హాపర్‌ హెచ్‌క్యూ' సర్వేలో తేలింది. పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ అయిన రొనాల్డో తన ప్రతి స్పాన్సర్డ్‌ పోస్టుకు తొమ్మిది లక్షల యూరోలు (సుమారు రూ. 7 కోట్ల 10 లక్షలు) సంపాదిస్తున్నాడట. వీటి ద్వారానే అతనికి ఏడాదికి 48 మిలియన్ల యూరోల (సుమారు రూ. 379 కోట్లు) ఆదాయం వస్తోంది.

ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచిన మరో ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సీ ఏటా స్పాన్సర్డ్‌ పోస్టుల ద్వారా 23.3 మిలియన్లు సంపాదిస్తున్నాడట. లీగ్‌లో ఆడుతున్న క్లబ్‌ యువెంటాస్‌ రొనాల్డోకు ఏడాదికి 34 మిలియన్ల యూరోలు (సుమారు రూ. 268 కోట్లు) చెల్లిస్తోంది. ఇక ఫేస్‌బుక్‌లో అత్యధిక లైక్స్ కలిగిన ప్రపంచ క్రీడాకారుడు రొనాల్డోనే కావడం విశేషం. రొనాల్డో ఫేస్‌బుక్ పేజీని 122.3 మిల్లియన్ల మంది లైక్ చేయగా.. 124.4 మిల్లియన్ల మంది ఫాలో అవుతున్నారు.

Story first published: Friday, January 31, 2020, 10:14 [IST]
Other articles published on Jan 31, 2020
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X