Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాలుగోసారి తండ్రయిన రొనాల్డో: ట్విట్టర్‌లో ఫోటో

Cristiano Ronaldo became a DAD for the FOURTH time, and fans lost their calm

హైదరాబాద్: పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో నాలుగోసారి తండ్రి అయ్యాడు. రొనాల్డో స్నేహితురాలు జార్జీన రోడ్రిగెజ్ ఆదివారం పండంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రొనాల్డో సోమవారం తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

'అలాన మార్టినా మా కుటుంబంలోకి వచ్చేసింది. జియో, అలాన ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గా ఉంది. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం' అని తన ఏడేళ్ల క్రిస్టియానో జూనియర్, జార్జీనతో ఆసుపత్రిలో కలిసి ఉన్న ఫొటోను రొనాల్డో తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

32 ఏళ్ల రొనాల్డో‌కు క్రిస్టియానో జూనియర్‌తో పాటు ఇవా, మాటియో అనే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. అయితే నాలుగోసారి తండ్రి అయిన రొనాల్డోకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Story first published: Tuesday, November 14, 2017, 10:39 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+