మెస్సీకి షాక్: 4వసారి రొనాల్డోకే బాల్లోన్ డీ’ఓర్ అవార్డు
పారిస్: అంతా ఊహించినట్లే రియల్ మాడ్రిడ్ కీలక ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోకే 2016 సంవత్సర బాల్లోన్ డి'ఓర్ అవార్డు దక్కింది. రొనాల్డోకు ఈ అవార్డు దక్కడం నాలుగోసారి. ఇంతకుముందు ఐదుసార్లు ఈ అవార్డును గెలుచుకున్న ఎఫ్ సి బార్సిలోనా స్టార్ ప్లేయర్ లియానెల్ మెస్సీ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
అయితే పోర్చుగీస్ ఇంటర్నేషనల్ రొనాల్డో తొలుత 2008లో ఫస్ట్ గోల్డెన్ బాల్ గెలుచుకున్నాడు. అంతకుముందు మాంఛెస్టర్ యునైటెడ్ జట్టు నుంచి బ్లాంకోస్ 132 మిలియన్ల అమెరికన్ డాలర్లకు కొనుగోలుచేసింది. రియల్ మాడ్రిడ్ జట్టుకు ఈ ఏడాది సారథ్యం వహించిన రొనాల్డో 54 మ్యాచ్‌ల్లో 51 గోల్స్ సాధించాడు.

పోర్చుగల్‌కు తొలి యూరోపియన్ కప్ టైటిల్
రికార్డు స్థాయిలో 11వ చాంపియన్స్ లీగ్ ట్రోఫీ గెలుచుకోవడంతోపాటు తొలిసారి ఆయన సొంతదేశం పోర్చుగల్ కు తొలి యూరోపియన్ కప్ టైటిల్ సాధించి పెట్టి రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం జపాన్ లోని యొకోహామ్ నగరంలో జరుగుతున్న క్లబ్ వరల్డ్ కప్ టోర్నీ సెమీ ఫైనల్స్ లో పాల్గొనేందుకు రియల్ మాడ్రిడ్ జట్టు అక్కడకు చేరుకున్నది.

అవార్డు ప్రదానోత్సవానికి హాజరుకాని రొనాల్డో
దీంతో పారిస్‌లో జరిగిన అవార్డు ప్రదానోత్సవానికి రొనాల్డో హాజరు కాలేదు. ‘జట్టు పరంగా, వ్యక్తిగతంగా ఈ ఏడాది నా కెరీర్ లోనే బెస్ట్‌గా నిలుస్తుంది' అని రొనాల్డో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. పోర్చుగల్ జట్టు తరఫున యూరోపియన్ కప్ గెలుచుకోవడం తన జీవితంలో అత్యంత ముఖ్యమైన క్షణాల్లో ఒకటిగా ఉంటుందన్నాడు.

చాంపియన్స్ లీగ్‌లో విజయం
‘కానీ చాంపియన్స్ లీగ్‌లో విజయం సాధించడం రియల్ మాడ్రిడ్‌కు అతిపెద్దదైన ముఖ్యాంశం. యూరోప్ క్లబ్ కాంపిటీషన్ లో 11 ట్రోఫీలు గెలుచుకున్నాం. నాలుగోసారి బాల్లోన్ డీ'ఓర్ అవార్డు గెలుచుకోవాలన్న నా కల నిజమైంది. నేను అందుకు చాలా గర్వ పడుతున్నా. ఈ విజయం రియల్ మాడ్రిడ్ క్లబ్, పోర్చుగల్ జట్లది. ఈ ట్రోఫీని మళ్లీ గెలుచుకోవడం తిరుగులేని అంశం' అని రొనాల్డో వ్యాఖ్యానించాడు.

1956 నుంచి ప్రతియేటా బాల్లోన్ డీ’ఓర్ అవార్డు
ఫ్రాన్స్ ఫుట్‌బాల్ మ్యాగజైన్ 1956 నుంచి ప్రతియేటా బాల్లోన్ డీ'ఓర్ అవార్డును ప్రదానంచేస్తున్నది. ఈ ఏడాది ఈ అవార్డు కోసం లా లీగ, కొపా డెల్ రే టైటిళ్లు గెలుచుకున్న ఎఫ్‌సి బార్సిలోనా క్లబ్ సారధి లియానెల్ మెస్సీ రెండోస్థానంలో నిలిచాడు. మూడో స్థానంలో చాంపియన్స్ లీగ్ ఫైనలిస్టు జట్టు అట్లెటికో మాడ్రిడ్ ప్లేయర్ అంటోనియే గ్రైజ్మన్ ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications