క్రిస్టియానో రొనాల్డోకు కవల పిల్లలు (ఫోటోలు)
హైదరాబాద్: పోర్చుగల్ పుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో తన ఇద్దరు కవల పిల్లలను చూసి తెగ మురిసిపోతున్నాడు. సరోగసీ ద్వారా రొనాల్డో ఈ కవల పిల్లలకు తండ్రయ్యాడు. ఈ సందర్భంగా వీరిని తొలిసారి ఎత్తుకున్న ఫోటోను రొనాల్డో తన ఇనిస్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
రొనాల్డోకు ఇప్పటికే ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. అతని పేరు క్రిస్టియానో రొనాల్డో జూనియర్. ఇదిలా ఉంటే కాన్ఫెడరేషన్స్ కప్ ఫైనల్ చేరడంలో పోర్చుగల్ విఫలమైన సంగతి తెలిసిందే. ఈ కప్‌లో మూడో స్ధానం కోసం పోర్చుగల్ ఆదివారం రష్యాతో తలపడనుంది.

దీంతో తన కవల పిల్లలను కలిసేందుకు వెళ్తున్నానని చెప్పి ఈ మ్యాచ్‌కు రొనాల్డో దూరంగా ఉన్నాడు. 20 రోజుల కిందట ఈ కవలు జన్మించారు. అయితే కాన్ఫెడరేషన్స్ కప్‌లో బిజీగా ఉండటంతో వారిని చూసేందుకు రొనాల్డో వెళ్లలేదు. కాన్ఫెడరేషన్స్ కప్ గెలవలేదన్న బాధ ఉన్నా.. పిల్లలను చూడటం చాలా సంతోషంగా ఉందని రొనాల్డో అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications