Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐదుగురు పిల్లల తర్వాత పెళ్లి: రొనాల్డో-జార్జినా లవ్ స్టోరీకి హ్యాపీ ఎండింగ్!

ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో తన ప్రేయసి జార్జినా రోడ్రిగెజ్‌ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ జంటకు ఇప్పటికే ఐదుగురు పిల్లలున్నారు. అయినప్పటికీ వారు పెళ్లి చేసుకోకుండా కేవలం ప్రేమించుకుంటూనే ఉన్నారు. వారి పెళ్లి వార్త అభిమానులకు ఆనందాన్ని పంచుతోంది. పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తూ ఐదుగురు పిల్లలకు తల్లిదండ్రులైన ఈ జంట ఇప్పుడిప్పుడే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు.

జార్జినా, రొనాల్డో 2016లో స్పెయిన్‌లో కలుసుకున్నారు. అప్పుడు జార్జినా ఒక గూచీ దుకాణంలో సేల్స్‌గర్ల్‌గా పనిచేసేవారు. అప్పుడు వారిద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఈ స్నేహం 2017లో ప్రేమగా మారింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి జీవించడం మొదలుపెట్టారు. ఈ జంటకు అలనా మార్టినా, బెల్లా అనే ఆడపిల్లలు పుట్టారు. రొనాల్డోకు ఉన్న మరో ముగ్గురు పిల్లలను కూడా జార్జినా పెంచుతున్నారు. 2022లో ఈ జంటకు కవలలు పుట్టారు. వారిలో ఒక మగపిల్లవాడు చనిపోయాడు. ఈ ఘటనతో రొనాల్డో, ఆయన ప్రేయసి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ సమయంలో క్రిస్టియానో రొనాల్డో తనను పెళ్లి చేసుకోవాలని అడుగుతూ, చాలా విలువైన వజ్రపు ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చారు.

Cristiano Ronaldo and Georgina Rodriguez Set to Marry After Five Children A Love Story s Happy Ending

జార్జినా కూడా సరే అని సమాధానం ఇచ్చి, దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనితో ఈ జంటకు త్వరలో వివాహం జరగనుంది. క్రిస్టియానో రొనాల్డో ప్రస్తుతం సౌదీ అరేబియాలోని అల్-నాసర్ అనే జట్టు తరఫున ఆడుతున్నారు. క్రిస్టియానో రొనాల్డో కుటుంబం పోర్చుగల్ నుంచి వచ్చింది. సమయం దొరికినప్పుడల్లా ఈ జంట సౌదీలో గడుపుతారు. ఇప్పటికే చాలా మంది పిల్లలు ఉన్నప్పటికీ రొనాల్డో జార్జినాను కేవలం ప్రేయసిగానే చూశారు. విదేశాలలో వివాహం తర్వాత విడాకులు తీసుకుంటే సగం ఆస్తులు కోల్పోవాల్సి వస్తుంది. అందుకే చాలా మంది ప్రముఖులు పెళ్లి చేసుకోకుండానే భార్యాభర్తలుగా జీవిస్తున్నారు.

Story first published: Tuesday, August 12, 2025, 10:14 [IST]
Other articles published on Aug 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+