Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించాడు: వారానికి రూ. 3 కోట్ల సంపాదన

హైదరాబాద్: స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు బంపర్ ఆఫర్ తగిలింది. రియల్ మాడ్రిడ్ క్లబ్‌తో అతడితో రానున్న ఐదేళ్లకు గాను కాంట్రాక్టును కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్టు ప్రకారం రియల్ మాడ్రిడ్ క్లబ్... రొనాల్డోకు వారానికి రూ. 3 కోట్లకు పైగా చెల్లించనుంది. ఈ తాజా ఒప్పందంతో ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించే ఫుట్‌బాల్ ప్లేయర్‌గా రొనాల్డో చరిత్ర సృష్టించనున్నాడు.

ఈ కాంట్రాక్టు సందర్భంగా రొనాల్డో మీడియాతో మాట్లాడుతూ మరో పదేళ్ల పాటు తాను పుట్‌బాల్ ఆడుతానని స్పష్టం చేశాడు. 31 ఏళ్ల రొనాల్డోతో 2021 వరకు రియల్ మాడ్రిడ్ క్లబ్ కాంట్రాక్టుని కుదుర్చుకుంది. తన జీవితంలో మిగతా కాలమంతా కూడా తాను ఆటను ఎంజాయ్ చేస్తానని, మరో పదేళ్ల పాటు పుట్ బాల్ ఆడతానని రొనాల్డో ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

'ఇది నిజంగా తన జీవితంలో మరిచిపోలేని రోజు. క్లబ్‌తో తన కాంట్రాక్టుని పొడిగించడం సంతోషంగా ఉంది. కాంట్రాక్టుని పొడిగించిన ఈ ఐదేళ్లు ఎంతో ప్రత్యేకం. అయితే ఇదే చివరి కాంట్రాక్టు కాదు' అని రొనాల్డో స్పష్టం చేశాడు. తాజా ఒప్పందంతో సంపాదన విషయంలో బార్సిలోనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ కంటే రొనాల్డో ముందు వరుసలోకి దూసుకెళ్లాడు.

Cristiano Ronaldo agrees new five-year contract with Real Madrid

ప్రపంచంలోనే అత్యుత్తమ క్లబ్‌గా ఉన్న రియల్ మాడ్రిడ్‌ తరుపున రాబోయే రోజుల్లో మరిన్ని గోల్సా సాధిస్తానని రొనాల్డో పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే 'వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' టైటిల్‌ను ఇప్పటి వరకు రొనాల్డో మూడుసార్లు గెలుచుకున్నాడు. దీంతో పాటు ఈ ఏడాది అనేక సంచలన విజయాలను నమోదు చేశాడు.

ఈ ఏడాది రొనాల్డో పెనాల్టీ షూటవుట్ షాట్‌తో మాడ్రిడ్ 11వ సారి చాంపియన్స్ లీగ్‌ను గెలుచుకుంది. అంతేకాదు యూరో 2016ను పోర్చుగల్ గెలుచుకోవడంలో కూడా రొనాల్డో కీలకపాత్ర పోషించాడు. ఈ మధ్య కాలంలో రియల్ మాడ్రిడ్ క్లబ్ కాంట్రాక్టులను పునరుద్ధరించుకున్నవాళ్లలో రొనాల్డో ఒకడు.

రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్ నుంచి మాడ్రిడ్‌కు మారిన తర్వాత 8 సీజన్లలో 360 గేమ్స్ ఆడి 371 గోల్స్ సాధించాడు. ఈ క్లబ్‌లో ఇంతవరకు ఎవరూ చేయనన్ని గోల్స్ చేయడంతో 2009లోనే అత్యధిక మొత్తంలో ప్రైజ్ మనీని పొందాడు. ఇక ముందు ఎవరు ఏం చెప్పాలన్నా.. రొనాల్డో కంటే ముందు, ఆ తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుందని మాడ్రిడ్ ప్రెసిడెంట్ ఫ్లోరెంటినో పెరెజ్ వ్యాఖ్యానించారు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+