For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిలకడ, పోరాట స్ఫూర్తి కోల్‌కతా సక్సెస్ సీక్రేట్

మూడేళ్లలోనే రెండోసారి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) చాంపియన్ షిప్ టైటిల్‌ను కైవసం చేసుకుందీ అట్లెటికో డి కోల్‌కతా.

న్యూఢిల్లీ: మూడేళ్లలోనే రెండోసారి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) చాంపియన్ షిప్ టైటిల్‌ను కైవసం చేసుకుందీ అట్లెటికో డి కోల్‌కతా. ఆటలో నిలకడ, విజయం పట్ల పోరాట స్ఫూర్తి ప్రదర్శించడం వల్లే ఈ స్థాయికి చేరామంటున్నారు సౌరవ్ సేన.

లీగ్ దశ నుంచి ఫైనల్స్ వరకు ప్రతి జట్టును ఎదుర్కొనేందుకు సమ పాళ్లతో కూడిన వ్యూహం అమలుతోపాటు నిలకడగా ఆడడమే. అటాకింగ్, డిఫెన్స్‌లో ఒకింత మెరుగైన ఆటతీరు ప్రదర్శన, ఉమ్మడిగా క్రుషి సాగించడంతో అత్యధికంగా సానుకూల ఫలితాలు రాబట్టడానికి కారణమైంది.

అయితే ఇది ఎల్లవేళలా సాధ్యం కాదు. ఈ సీజన్‌లో వారు గెలిచిన మ్యాచ్‌లన్నీదాదాపు ఒక్క గోల్ కంటే ఎక్కువ తేడాతోనే. రెండు మ్యాచ్ ల్లో మాత్రమే ఓటమిని చవిచూసిన కోల్ కతా కుర్రాళ్లు లీగ్ దశలో పది మ్యాచ్ లను డ్రాగా ముగించారు. చివరకు ఫైనల్స్‌లోనూ విన్నింగ్ పాయింట్ సాధించలేక చతికిలపడ్డారు. కేవలం ఫెనాల్టీలతోపే విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకున్నారు. ఎటువంటి ప్రణాళిక లేకుండా అడ్డంకులను అధిగమిస్తూ ముందుకెళ్లడం అసాధ్యం.

Consistency and fighting spirit highlight champions ATK’s campaign

ముచ్చటైన అభిమానుల మద్దతు

ఇంతకుముందు రెండు సీజన్లలోనూ సొంతగడ్డపై భారీస్థాయిలో అభిమానుల మద్దతు పొందలేదు. దీనికి తోడు పెద్దదైన స్టాల్ లేక్ స్టేడియం కంటే చిన్నదైన రవీంద్ర సారోబార్ స్టేడియంలోనే మ్యాచ్ లు ఆడాల్సి రావడం కోల్ కతాకు ఇబ్బందికరమే మరి. రెండున్నర నెలల పాటు సాగిన టోర్నీలో సొంత స్టేడియంలో కోల్‍కతా రెండంటే రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.

కానీ వారు ఒక్కో పాయింట్ గెలుచుకుంటూ లీగ్ దశ ముగిసే సరికి నాలుగో స్థానానికి చేరుకోవడంతో నాకౌట్ దశకు అర్హత పొందేందుకు గంగూలీ సేనకు ఎటువంటి అవరోధాలు ఎదురుకాలేదు. సెమీస్‌కు అర్హత సాధించిన తర్వాత కూడా వారు ప్రశాంతంగా ఆడుతూ ఉమ్మడిగా బంతిపై ఆధిపత్యం సాధిస్తూ టైటిల్ సొంతం చేసుకున్నారు.

హుమ్ పెర్పార్మెన్స్ కీలకం

ఎటికె సక్సెస్ స్టోరీలో కీలకం ఇయాన్ హుమ్ పెర్పార్మెన్స్. ఈ 33 ఏళ్ల కెనడా అటాకర్ 2014లో కేరళ, 2015లో ఎటికె జట్టులో అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్. ఈసారి కూడా అదే స్థాయిలో చెలరేగిపోయి జట్టుకు విజయం సాధించి పెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. ఏడు ముఖ్యమైన గోల్స్ సాధించాడు. ప్రత్యేకించి ముంబై సిటీపై కోల్ కతాలో జరిగిన తొలి సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లో సాధించిన రెండు గోల్స్ ఫైనల్స్‌లో అడుగు పెట్టేందుకు అవసరమైన ప్రాతిపదికను సిద్ధంచేశాయి.

క్రెడిట్ మొలీనాదే

కోచ్ గా అడుగుపెట్టిన తొలి ఏడాదే జట్టుకు టైటిల్ సాధించి పెట్టిన జోస్ మొలీనాదే క్రెడిట్ అంతా కూడా. తక్కువ నిడివి గల ఐఎస్ఎల్ వంటి టోర్నీలో త్వరితగతిన సరైన ఆటగాళ్ల సమూహాన్ని గుర్తించడంతోపాటు వ్యూహాత్మకంగా వారిని బరిలోకి దించడమూ కీలకమే. తరచుగా ప్లేయర్లు గాయాల భారీన పడినా.. ఆయన అస్త్రాల పొదిలో మంచి ప్రత్యామ్నాయాలు సిద్ధంగా ఉండేవి. ప్లేయర్లందరి మీదా ఒకే రకమైన విశ్వాసం ప్రదర్శించడం కూడా జట్టు విజయాల్లో మరో కారణం.

మిగతా కోచ్ లెవరు కూడా ఈ తరహాలో వ్యవహరించలేదు. మామూలుగా నైతే గోల్ కీపర్ దేబ్జిత్ మజుందార్ గొప్ప ఆటగాడేం కాదు. కానీ ఆయనలో పలు రకాల క్వాలిటీలను గమనించిన మొలీనా,, వాటిని ప్రోత్సహించాడు. రంగంలోకి దించి బాక్స్ వద్ద గోల్స్ సాధించకుండా అడ్డుకోగలిగాడు. ఫైనల్స్ లోనూ షూటౌట్ల విషయంలో ఆటగాళ్లందరికీ సమాన అవకాశాలు కల్పించి తాను అందరి వాడినని రుజువుచేసుకున్నాడు మొలీనా.

టైటిల్‌ను గెలుచుకునేందుకు ప్రత్యేకించి కొన్ని కీలక మ్యాచ్‌ల్లో ఎటికె పలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. కేరళతో సొంతగడ్డపై జావీ లారా అవకాశాన్ని జారవిడవడంతో కేరళ మూడు పాయింట్లు కొట్టేసింది. డిఫెండర్లు ఉన్నా సకాలంలో స్పందించకపోవడంతో మూల్యం చెల్లించాల్సి వచ్చింది.

లీగ్ నుంచి సెమీస్ వరకూ జట్లకు రిప్లై

ఎఫ్ సి గోవాతో జరిగిన మ్యాచ్‌లో జువాన్ బెలెంకోసో గోల్ చేసినా.. 80వ నిమిషంలో ప్రత్యర్థి జట్టు గోల్ చేసేందుకు అవకాశం కల్పించారు. లీగ్ దశ నుంచే నాకౌట్ దశకు చేరుకునేందుకు అవకాశాలు స్పష్టంగా ఉండటంతో కోల్ కతా కూడా ఒకటి రెండు పాయింట్లు వదిలేందుకు వెనుకాడలేదు.

మొలీనా కుర్రాళ్లు అంత తేలిగ్గా వ్యవహరించకుండా స్టీఫెన్ పియర్సన్ ఇంజ్యూరీ సమయంలో గోల్ సాధించి జట్టుకు విజయం సాధించి పెట్టాడు. నార్త్ఈస్ట్ జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ ఎమిలియానో అల్ఫారో 39వ నిమిషంలో గోల్ చేసి ఆధిక్యంలో నిలిస్తే సెకండాఫ్ లో హెల్డర్ పొస్టిగ, బెలెంకోసో చెరోగోల్ తో స్ఫూర్తిదాయక విజయం సాధించి జట్టును గట్టెక్కించారు. నిలకడగా ఆడటమే కొన్నిసార్లు వారిని కాపాడింది.

కోల్ కతాలో ఢిల్లీ డైనమోస్ జట్టుపై జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ బూట్ విన్నర్ మార్సిలిన్హోకు గోల్ చేసుకునేందుకు అవకాశం కల్పించినా ఆ వెంటనే ఇయాన్ హుమ్ పెనాల్టీ ద్వారా గోల్ సాధించాడు. తొలి సెమీ ఫైనల్స్‌లో అటాకింగ్‌తో కూడిన డిఫెన్స్ వ్యూహంతో సాధించిన మూడు గోల్స్.. ఎటికెను బెస్ట్ డిఫెన్స్ టీంగా నిలిపాయి. రెండో సెమీ ఫైనల్స్‌లోనూ ఇదే వ్యూహం అమలు చేసి టైటిల్ పోరుకు సిద్ధమయ్యారీ బెంగాలీ కుర్రాళ్లు.

హోం సపోర్ట్‌తో కేరళ రఫీ తోలి గోల్

టైటిల్ పోరు కోసం కోచిలో జరిగిన మ్యాచ్‌లో కేరళ కుర్రాడు మహ్మద్ రఫీ 60 వేల మందికి పైగా అభిమానుల దన్నుతో 37వ నిమిషంలో గోల్ సాధించి విజిటర్లపై ఒత్తిడి పెంచాడు. ఆ వెంటనే ఏడు నిమిషాలకు హెన్రిక్యు సెరెనో గోల్ సాధించి స్కోర్ సమంచేశాడు. తర్వాత షూటౌట్ సెషన్స్‌లో ఎటికె ఇంద్రజాలికుడు ఇయాన్ హుమ్ రూపంలో తొలి అవకాశం కోల్పోయారు.

క్రాస్ బార్ వద్ద డిడియర్ బోరిస్ కాడియో పెనాల్టీ ద్వారా పాయింట్ సాధించాడు. సెడ్రిక్ హెంగ్బార్ట్ షూటౌట్ ను మజుందార్ అడ్డుకోకుండా ఉండి ఉంటే టైటిల్ కేరళ వశమయ్యేది. నాలుగు విభాగాల్లోనూ గుడ్ పెర్పార్మెన్స్ గల ప్లేయర్లతో బరిలోకి దిగిన కోల్ కతా చాంపియన్ షిప్ సాధించేందుకు అర్హురాలే. ఇక 27 గోల్స్ తో మొదటి వరుసలో నిలిచిన ఢిల్లీ, 19 గోల్స్‌తో రెండో స్థానంలో ఉన్న ముంబై జట్లకు కాలం కలిసి రాలేదు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+