Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐఎస్ఎల్: హ్యాట్రిక్ విజయం కోసం ఢిల్లీ తహ తహ

న్యూఢిల్లీ: గత రెండు మ్యాచ్‌ల్లో విజయాలతో జోరు మీదున్న ఢిల్లీ డైనమోస్ హ్యాట్రిక్ విజయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఈ దశలో బుధవారం రాత్రి న్యూఢిల్లీలో జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆధిపత్యం సాధించగలమని విశ్వాసంతో ఉన్నది. హ్యాట్రిక్ విజయం సాధించడంతో టాప్ 4 లో తమ స్థానాన్ని మరింత సంఘటిత పరుచుకోవాలని జంబ్రొట్టా జట్టు ఉవ్విళ్లూరుతున్నది.

చెన్నైయిన్ కూడా గత ఐదు మ్యాచ్‌ల్లో ఓటమికి తావులేకుండా ముందుకు సాగుతుండటంతో పాజిటివ్ ద్రుక్పథంతో మ్యాచ్ కు సిద్ధమవుతున్నది. మూడు మ్యాచ్ లు డ్రా అయినా బుధవారం జరిగే మ్యాచ్ లో ఫలితాన్ని ప్రభావితంచేస్తామని సూపర్ మాచన్స్ ఆశగా ఉన్నారు. దేశ రాజధానిలో జరిగే మ్యాచ్ అభిమానులకు థ్రిల్లింగ్ ను ఇవ్వడంతోపాటు బాణా సంచా పేలుళ్లు మిన్నంటుతాయని భావిస్తున్నారు.

తొలి ఐఎస్ఎల్ ఎడిషన్‌లో సొంతగడ్డపై 4 - 1 స్కోర్ తేడాతో విజయం సాధిస్తే.. మరో మ్యాచ్ 2 - 2 స్కోర్ తేడాతో డ్రాగా ముగించింది. గతేడాది కూడా ఇదే పరిస్థితి. ప్రస్తుత సీజన్‌లో చెన్నైయిన్‌లో 3 - 1 స్కోర్ తేడాతో ఢిల్లీ గెలుపొందింది.

అనాస్ ఎడాథోడికా వర్సెస్ జెజె

అనాస్ ఎడాథోడికా వర్సెస్ జెజె

అనాస్ ఎడాథోడికా ఢిల్లీ కుర్రాళ్లలో పెర్పార్మెన్స్ ఉన్న ప్లేయర్‌గా విశ్వాసం సాధించాడు. నాలుగు దఫాలు జరిగిన మ్యాచ్‌లలో రెండింట జట్టు విజయాల్లో హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న ఎడాథోడికా పూర్తిగా స్ఫూర్తిదాయక ప్లేయర్ అనడంలో సందేహం లేదు. క్రమశిక్షణ పాటిస్తూ పూర్తిగా పాసింగ్‌కు ప్రాధాన్యం ఇస్తాడు. ప్రత్యర్థి జట్ల అటాకింగ్‌ను తిప్పికొట్టడంతోపాటు బంతిని నియంత్రించడంలోనూ, మొత్తంగా ఢిల్లీ ఆధిక్యాన్ని కొనసాగించడంలోనూ కీలక పాత్రదారి ఎడాథోడికా. ఇక ప్రత్యర్థి జట్టు చెన్నైయిన్‌ సంచలనం జెజె లాల్పెఖౌలా ప్రతి మ్యాచ్‌లోనూ పెర్పార్మెన్స్ మెరుగు పరుచుకుంటున్నాడు. తన స్కిల్స్ తో ప్రత్యర్థి నుంచి వచ్చే డిఫెన్స్ అడ్డంకులను తొలగించేస్తున్నాడు. గోల్స్ చేయడంలోనూ, ఇతరులకు అసిస్టెన్స్ ఇవ్వడంలోనూ ఇంద్రజాలికుడిగా వ్యవహరిస్తారు. తన ఆట తీరు పెర్పార్మెన్స్ మరింత పెంచుకుని జట్టు గెలుపుకు దోహదపడతాడని చెప్పడంలో సందేహం లేదు.

మార్సిలిన్హో, రాఫెల్ అగస్టో మధ్య పోటాపోటీ

మార్సిలిన్హో, రాఫెల్ అగస్టో మధ్య పోటాపోటీ

బ్రెజిలియన్ ప్లేయర్ మార్సిలిన్హో ఈ ఏడాది ప్రతి మ్యాచ్ లోనూ చెలరేగిపోతున్నాడు. జట్టుకు ఐదు గోల్స్ సాధించి పెట్టడంలోనూ నాలుగు గోల్స్ లో అసిస్టెన్స్ లోనూ మార్సిలిన్హో పాత్ర ఎనలేనిది. ఆయన సిల్క్ పాసింగ్ ధోరణి, స్మార్ట్ ఫినిషింగ్, పేసింగ్ అభిమానులను ఇట్టే కట్టి పడేస్తుంది. మొత్తంగా టీమ్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన మార్సిలిన్హో గత మ్యాచ్ లోనూ చెన్నైయిన్ పై 3 - 1 స్కోర్ తేడాతో విజయం సాధించడంలో మార్సిలిన్హోదే కీలక పాత్ర. ఇక సూపర్ మాచన్స్ ప్లేయర్ రాఫెల్ అగస్టో.. చెన్నైయిన్ కు విజయ వ్యూహాల రూపకల్పనలో కీలకం. ఫీల్డ్ అంతటా జట్టుకోసం చెలరేగిపోయే అగస్టో అవరోధాలను పక్కనబెట్టి అవసరమైనప్పుడు బంతిని నియంత్రణలోకి తీసుకోవడం అగస్టోకే చెల్లు. 25 ఏళ్ల ఈ బ్రెజిలియన్ అసాధారణమైన పాసింగ్ రేట్, గ్రేట్ వర్క్ ఎథిక్స్, అత్యంత వాస్తవిక ద్రుక్పథం కనబర్చే ప్లేయర్.

సాటిలేని గాడ్జె, మెండీ

సాటిలేని గాడ్జె, మెండీ

ప్రస్తుత సీజన్ లో ఢిల్లీ డైనమోస్ కీలక ప్లేయర్లలో రిచర్డ్ గాడ్జె ఒకడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఫీల్డంతా కలియ తిరుగుతూ విపక్షం డిఫెన్స్ ను దీటుగా ఎదుర్కొనే సత్తా ఆయన సొంతం. ప్రత్యర్థి జట్టును శిక్షిస్తూ మ్యాచ్ ఆడే ప్లేయర్ ఆయనొక్కడే. ఢిల్లీ డైనమోస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు తన వంతు పాత్ర పోషిస్తున్న గాడ్జె ప్రతి మ్యాచ్ ముగింపులోనూ విభిన్న పాత్ర పోషిస్తున్నాడు. చెన్నైయిన్ సూపర్ స్టార్లలో ఒకడు బెర్నాండ్ మెండీ. 35 ఏళ్ల ఈ ఫ్రెంచ్ మ్యాన్ ప్రత్యర్థులను కట్టడిచేయడంలో నంబర్ వన్. అంతేకాదు. తన ప్రత్యర్థి జట్టుకు సింహస్వప్నం వంటి వాడు. నిరంతరం పాసింగ్ చేస్తూ దూసుకెళ్తుంటాడు. కీలక సమయాల్లో ప్రత్యర్థి జట్లకు ఆయన అంటే హడలే. కానీ బుధవారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ డైనమోస్‌కు అటాకింగ్ ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తాడంటే అతిశేయోక్తి కాదు.

జట్ల వివరాలు:

జట్ల వివరాలు:

ఢిల్లీ డైనమోస్: ఆంటోనియో డొబ్లాస్ సంతానా, సంజీబన్ ఘోష్, సోరం పౌరేయి, రూబెన్ గొంజాలెజ్ రోచా, డేవిడ్ అడ్డీ, ఇబ్రహీమా నాస్సీ, అన్నాస్ ఎడాథోడికా, చింగ్లేశాన కోనశ్హాం సింగ్, లాల్చావంకిమా, రూపర్ట్ నంగ్రూమ్, సౌవిక్ చక్రవర్తి, ఫ్లోరెంట్ మాలౌడా, బ్రూనో అగస్టో, పెలిస్సారి డీ లిమా, మార్కోస్ టేబర్, ఎమర్సన్ గోమ్స్ డీ మౌరా, డెన్సన్ దేవదాస్, మిలాన్ సింగ్, మల్సావ్మజులా, రిచర్డ్ గాడ్జె, బాదర బాద్జీ, అర్జున్ తుడు, మార్సెలో లైటీ పెరీరా, కీన్ లూయిస్, అమోస్ డూ, అల్విన్ జార్జి.

చెన్నైయిన్ ఎఫ్ సి: కరంజిత్ సింగ్, పవన్ కుమార్, దువ్యానే కెర్ర్, బెర్నాండ్ మెండీ, మెహ్రాజుద్దీన్ వాడో, ఎలి సాబియా, ఎడర్ మొంటారియో, జెర్రీ లాల్రింజులా, అభిషేక్ దాస్, జాన్ ఆర్నె రైస్, బాల్జిత్ సాహ్ని, హన్స్ ముల్లర్, మాన్యులె బ్లాసి, థాయిసింగ్, రాఫెల్ అగస్టో, హర్మన్జోత్ సింగ్ ఖబ్రా, దేవిడ్ సుక్కీ, మౌరిజికో పెలుసో, బేదాశ్వోర్ సింగ్, ఉత్తం రాయ్, జెజె లాల్పెఖౌలా, జాకిర్ ముందాంపరా, అనిరుధ్ థాపా.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+