Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మొరాట చాలా హ్యాపీ: రియల్ మాడ్రిడ్ కోచ్ జిడానె

మాడ్రిడ్: రియల్ మాడ్రిడ్ స్ట్రయికర్ అల్వారో మొరాటో సంతోషంగా లేరని, జువెంటస్ క్లబ్‌కు తిరిగి వెళ్లిపోవాలని భావిస్తున్నాడని ఇటలీ పత్రికలో వచ్చిన కథనాన్ని హెడ్ కోచ్ జిడానె జైనిడిన్ కొట్టి పారేశారు. యువ ఆటగాడు చాలా సంతోషంగా ఉన్నాడన్నారు. యూరోపియన్ పుట్ బాల్ చాంపియన్ షిప్ గెలుచుకోవడంతో సొంతింట్లో ఉంటున్నానన్న భావనతో ఉన్నాడన్నాడు.

జువెంటస్ క్లబ్ జట్టులో రెండేళ్లు గడిపిన తర్వాత అల్వారో మొరాటా తిరిగి గత వేసవిలోనే రియల్ మాడ్రిడ్ జట్టులో చేరాడు. కానీ మంగళవారం ఓ వార్తా కథనం ఇటలీ దిన పత్రిక మొరాట తిరిగి జువెంటస్ జట్టు వైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడని పేర్కొంది.

'ఈ వార్తాకథనంలో సమాచారం నిజమైందని నేను భావించడం లేదు. నాకు మాత్రం మొరాటా చాలా హ్యాపీగా కనిపించాడు. సొంతింట్లో ఆడుతున్నానన్న అభిప్రాయంతో ఉన్నాను' అని జిడానె ఓ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆయన పూర్తిగా జట్టుతో మమేకమయ్యాడని, వార్తాకథనాలు సత్యదూరమని స్పష్టం చేశాడు. ఇక డిఫెండర్ పెపె కాంట్రాక్టు ఈ వేసవితో ముగుస్తుంది. అయితే ఆయనను కూడా జట్టులోనే కొనసాగించేందుకు ప్రాధాన్యం ఇస్తామన్నాడు. 'జట్టులో చాలా ముఖ్యమైన ఆటగాడు. పదేళ్లుగా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పెపె చరిత్ర నెలకొల్పాడు. నా వరకు నేను పెపె రియల్ మాడ్రిడ్ జట్టులోనే కొనసాగాలని భావిస్తా' అని చెప్పాడు.

బుధవారం సివిల్లాతో జరిగిన మ్యాచ్‌కు పెపె దూరం

బుధవారం సివిల్లాతో జరిగిన మ్యాచ్‌కు పెపె దూరం

అయితే ఎడమ కాలి కండరాలకు గాయంతో బుధవారం సివిల్లాతో జరిగిన మ్యాచ్‌కు పెపె దూరంగా ఉన్నాడు. గత ట్రైనింగ్ సెషన్ నుంచి మంగళవారం వరకు పెపె జట్టుకు దూరంగా ఉన్నాడు. ఎమ్మారై స్కాన్‌లో అతడి ఎడమ కాలి కండరం గాయపడిందని తేలింది. దీంతో కొపె డెల్ రేతో జరిగే మ్యాచ్ కు పెపె దూరమే. ఆయనతోపాటు సెర్జియో రామోస్, గారెథ్ బాలె, మాటియో కొవాసిస్, లుకాస్ వాజ్ క్వెజ్ కూడా ఈ మ్యాచ్ లకు దూరం కానున్నారు. పెపె, రామోస్ గైర్హాజరీలో రియల్ మాడ్రిడ్ జట్టు రాఫెల్ వరానె, నాచో పెర్నాండెజ్ లపై మాత్రమ ఆధారపడాల్సి వస్తుంది. రామోస్ ఒంటరిగా ఎక్సర్‌సైజలు చేశాడు.గారెథ్ బాల్, కొవాసిస్, వాజ్ క్వెజ్ ప్రాక్టీస్ కు హాజరు కాలేదు. నార్వేయన్ మార్టిన్ ఒడేగార్డ్ మాత్రమే ఇతర ప్లేయర్లతో కలిసి ప్రాక్టీస్ సెషన్‌కు హాజరయ్యాడు.

పిఎస్‌జితో జర్మన్ వింగర్ డ్రాక్ల్సర్ కాంట్రాక్ట్

పిఎస్‌జితో జర్మన్ వింగర్ డ్రాక్ల్సర్ కాంట్రాక్ట్

పారిస్ సెయింట్ జెర్మైన్ (పిఎస్‌జి) క్లబ్ యాజమాన్యం అధికారికంగా జర్మన్ వింగర్ జులియాన్ డ్రాక్ల్సర్ తో కాంట్రాక్ట్ ఖరారుచేసుకున్నట్లు ప్రకటించింది. 2021 జూన్ 20 వరకు పిఎస్ జిలో కొనసాగేందుకు జులియాన్ డ్రాక్ల్సర్ సంతకంచేశాడు. ఇంతకుముందు జర్మనీలోని వోల్ఫ్స్ బర్గ్ క్లబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన డ్రాక్ల్సర్.. ట్రాన్ ఫర్ ఫీజు కింద 39.4 మిలియన్ల డాలర్ల రుసుమును వోల్ఫ్స్ బర్గ్ జట్టుకు చెల్లించాడు. పిఎస్ జితో కాంట్రాక్ట్‌పై సంతకం చేయడం ఆనందంగా ఉన్నదన్నాడు.

కెరీర్‌లో తొలిసారి కొత్త లీగ్‌కు ప్రాతినిధ్యం

కెరీర్‌లో తొలిసారి కొత్త లీగ్‌కు ప్రాతినిధ్యం

కెరీర్‌లో తొలిసారి కొత్తదేశంలో కొత్త లీగ్ కు ప్రాతినిధ్యం వహించబోతున్నానని, అందుకు తాను చాలా గర్వపడుతున్నానని జులియాన్ డ్రాక్ల్సర్ చెప్పాడు. ఇటీవలి కాలంలో చాలా మంది నూతన అడుగులు వేసేందుకు యూరప్ లోని పలువురు ప్రముఖ ప్లేయర్లు సంతకాలు చేశారన్నారు. పారిస్ సెయింట్ జెర్మైన్ జట్టు నూతన ట్రోఫీలు గెలువాలని, అంతర్జాతీయంగా మరింత ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. వోల్ఫ్స్ బర్గ్ జట్టులోకి వెళ్లక ముందు డ్రాక్ల్సర్.. స్కాల్కే జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

వోల్ఫ్స్ బర్గ్ వ్యవహారశైలి సరిగ్గా లేదని వ్యాఖ్య

వోల్ఫ్స్ బర్గ్ వ్యవహారశైలి సరిగ్గా లేదని వ్యాఖ్య

153 బండెస్ లిగా మ్యాచ్ లు, 47 యూరోపియన్ క్లబ్ లు, యుఇఎఫ్ఎ చాంపియన్స్ల్ లీగ్ లో 34 మ్యాచ్ ల్లో పాల్గొన్నాడు. వోల్ఫ్స్ బర్గ్ వ్యవహారశైలి సరిగ్గా లేదని వ్యాఖ్యానించాడు. చివరి క్షణం వరకూ అదే జట్టులో కొనసాగేందుకు ప్రయత్నించినా వోల్ఫ్స్ బర్గ్ యాజమాన్యం పట్టించుకోలేదన్నదని ఆయన విమర్శ. తమ జట్టులోకి డ్రాక్ల్సర్ రాక పట్ల పిఎస్‌జి క్లబ్ అధ్యక్షుడు నస్సీర్ అల్ ఖెలైఫి సంత్రుప్తి వ్యక్తంచేశాడు. డ్రాక్ల్సర్ రాకతో తమ జట్టులో ప్రధాన పాత్ర పోషిస్తాడిన భావిస్తున్నామన్నారు. ఉన్నత స్థాయికి దూసుకెళ్లాలన్న ఆలోచన గల పిఎస్ జి క్లబ్ ముందడుగు వేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నదన్నాడు. నెలకు డ్రాక్ల్సర్ 4,37, 383 అమెరికన్ డాలర్ల వేతనం పొందుతున్నాడని ఎల్' ఎక్విప్ ఓ వార్తాకథనం ప్రచురించింది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+