రియల్‌పైనే మా భవితవ్యం: బార్సిలోనా కోచ్ ఎన్రిక్యు
బార్సిలోనా: లాలీగ టోర్నీలో విల్లారియల్ జట్టుతో జరిగిన మ్యాచ్‌ను 1-1 స్కోర్ తేడాతో ముగించి పాయింట్ల పట్టికలో రియల్ మాడ్రిడ్ జట్టు కంటే బార్సిలోనా జట్టు ఐదు పాయింట్లు వెనుకబడి మూడో స్థానంలో నిలిచింది. 16 మ్యాచ్‌ల్లో 40 పాయింట్లతో రియల్ మాడ్రిడ్ టాపర్‌గా నిలిస్తే, సెవిల్లా టీం 17 మ్యాచ్‌ల్లో 36 పాయింట్లతో రెండో స్థానాన్ని ఆక్రమించింది.
దీంతో కోచ్ లూయిస్ ఎన్రిక్యు తమ జట్టు భవితవ్యం.. రియల్ మాడ్రిడ్ పెర్పార్మెన్స్‌పైనే ఆధారపడి ఉన్నదని అంగీకరించాడు. అయితే ఇంకా టోర్నీలో సగం సీజన్ మ్యాచ్ లు జరుగాల్సి ఉన్నదని గుర్తుచేశాడు. 'లా లీగ' టైటిల్ గెలుచుకునేందుకు ఇంకా అవకాశాలు ఉన్నాయని తెలిపాడు.

మాడ్రిడ్ ఆటతీరుపైనా మా జట్టు ఆధారపడి ఉంటుంది
అయితే ఇక ముందు విజయాలు సాధించడంతోపాటు రియల్ మాడ్రిడ్ ఆటతీరుపైనా తమ జట్టు టైటిల్ పోరు ఆధారపడి ఉన్నదన్నాడు. ‘లా లీగ టోర్నీలో ఈ సీజన్‌లో 13వ గోల్ చేశాడు. కానీ విల్లారియల్ జట్టు నికోలా సాన్సోన్ అంతకుముందే గోల్ చేయడంతో మ్యాచ్ డ్రా గా ముగిసింది' అని పేర్కొన్న లూయిస్ ఎన్రిక్యు తమ జట్టు మ్యాచ్ గెలుచుకోవడంతోపాటు మూడు పాయింట్లు తమ ఖాతాలో జమ చేసుకోవాల్సి ఉందన్నాడు.

బార్సిలోనా కుర్రాళ్లు పేలవ ప్రదర్శన
విజయం సాధించేందుకు అవసరమైన అవకాశాలు కల్పించుకున్న తర్వాత కూడా ఓటమి పాలయ్యామని ఎన్రిక్యు చెప్పాడు. ‘బార్సిలోనా కుర్రాళ్లు పేలవ ప్రదర్శన జరిపారు. కానీ కింగ్స్ కప్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో అథ్లెటిక్ బిల్బావో జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బార్సిలోనా 1-2 స్కోర్ తేడాతో ఓటమి పాలైంది.

మరింతగా మెరుగు పడాల్సి ఉంది
వారు రెండు సంతృప్తికర ప్రదర్శనలు సాధించారు. కానీ ఫలితాలు ప్రతికూలంగా వచ్చాయి. మేం డైనమిక్ గా ఆడాల్సిన తరుణం వచ్చేసిందని ఎన్రిక్యు అన్నాడు. తాము మరింత మెరుగు పడాల్సి ఉందన్నాడు.

గాయంతో బార్సిలోనా గోల్ కీపర్ కిల్లెసెన్ వెనుకడడుగు
ఎఫ్ సి బార్సిలోనా గోల్ కీపర్ జాస్పర్ సిల్లెస్సెన్ ట్రైనింగ్ సమయంలో ఎడమ కాలి గాయంతో తప్పుకున్నాడు. విల్లారియల్ జట్టుతో జరిగిన మ్యాచ్ 1-1 స్కోర్ తేడాతో డ్రాగా ముగియడంలో జాస్పర్ సిల్లెస్సెన్ పాత్ర కీలకంగా ఉంది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో మెరుగైన ఆటతీరు ప్రదర్శించిన బార్సిలోనా కుర్రాళ్లు బుధవారం కొపాడెల్ రే టోర్నీలో అథ్లెటిక్ బిల్బావో జరిగే మ్యాచ్ కోసం ట్రైనింగ్ ప్రారంభించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications