Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిఫా వరల్డ్ కప్ 2018: పిల్లి చనిపోయింది.. ఆక్టోపస్‌ను కూడా చంపేశాడు

జపాన్ ఓటమితో మార్కెట్‌లో మాంసాహారంగా మారిపోయిన ఆక్టోపస్
Chinese social media mourns the death of Baidian’er, the psychic cat that predicted World Cup games

హైదరాబాద్: ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌లో ఆరు మ్యాచ్‌ల ఫలితాలను సరిగ్గా అంచనా వేసిన చైనాకు చెందిన ఆ పిల్లి చనిపోయింది. అర్జెంటీనా, నైజీరియా మధ్య జరిగిన మ్యాచ్‌లో విజేతను సరిగ్గా అంచనా వేసిన ఆ పిల్లికి.. అదే చివరి మ్యాచ్ అయింది. గత సోమవారం అనారోగ్యం కారణంగా అది చనిపోయినట్లు దానిని చేరదీసిన బీజింగ్లోని ప్యాలస్ మూజియం వెల్లడించింది. దీనికి బైదియనెర్ అనే పేరు పెట్టారు. ఇది బీజింగ్‌లోని ఫర్‌బిడెన్ సిటీ వీధుల్లో తిరుగుతుండగా.. ప్యాలస్ మ్యూజియం చేరదీసింది.

2 కప్పుల ద‌గ్గ‌ర 2 టీమ్‌ల జెండాలు:

2 కప్పుల ద‌గ్గ‌ర 2 టీమ్‌ల జెండాలు:

దానికి రెండు క‌ప్పుల్లో ఆహారం పెట్టి.. ఆ రెండు కప్పుల ద‌గ్గ‌ర రెండు టీమ్‌ల జెండాలు పెట్టేవాళ్లు. అది ఏ క‌ప్పు ద‌గ్గ‌రికి వెళ్లి ఆహారం తీసుకుంటుందో ఆ టీమ్‌ను విజేత‌గా అంచ‌నా వేసేవాళ్లు. ఇలా ఆరు మ్యాచుల్లో అది విజేతలను సరిగ్గా అంచనా వేసింది. అదెంతలా సక్సెస్ సాధించిందంటే.. దాని పేరు మీద ఓ వీబో అకౌంట్ కూడా క్రియేట్ చేశారు. ట్విటర్‌లాగే చైనాలో వీబో చాలా ఫేమస్.

2010లో పాల్ అనే ఆక్టోపస్ కూడా

2010లో పాల్ అనే ఆక్టోపస్ కూడా

ఆ పిల్లి చనిపోయిందని తెలియగానే వేలాది మంది నివాళులు చెబుతూ కామెంట్లు పెట్టారు. 2010 ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ సందర్భంగా జర్మనీలోని ఆక్వేరియంలో ఉన్న పాల్ అనే ఆక్టోపస్ కూడా ఇలాగే మ్యాచ్‌ల ఫలితాలను ముందుగానే ఊహించి ఫేమస్ అయిన విషయం తెలిసిందే.

ఇప్పటికే చెవిటి పిల్లి, పందిలతో పాటు ఆక్టోపస్‌:

ఇప్పటికే చెవిటి పిల్లి, పందిలతో పాటు ఆక్టోపస్‌:

ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటికే చెవిటి పిల్లి, పంది చెప్పిన జోస్యాలతో పాటు మరో జంతువు కూడా 100శాతం నిజాన్ని జోస్యంగా చెప్పింది. జపాన్ ఆడిన మూడు మ్యాచ్‌ల గురించి టోక్యోలో 'రాబియో' అనే పేరుగల ఆక్టోపస్‌ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇలా జపాన్‌ మ్యాచ్‌ల ఫలితాల గురించి సరిగ్గా జోస్యం చెప్పి త్వరలో ఆహారం అయ్యేందుకు సిద్ధం కానుంది. నిజానికి ఈ ఆక్టోపస్‌ను కిమియో ఆబె అనే వ్యక్తి సముద్రం నుంచి తీసుకొచ్చాడు.

మాంసంగా అమ్మితే తాను ఎక్కువ సంపాదిస్తానని:

మాంసంగా అమ్మితే తాను ఎక్కువ సంపాదిస్తానని:

అదే సమయంలో రష్యాలో వరల్డ్ కప్ ప్రారంభం కావడంతో ఈ ఆక్టోపస్‌‌తో జ్యోతిష్యం చెప్పించడం మొదలుపెట్టాడు. రాబియోకు వస్తున్న పేరు ప్రఖ్యాతులకంటే దానిని మాంసంగా మార్చి అమ్మితే తాను ఎక్కువ సంపాదిస్తానని, తప్పని పరిస్థితుల్లో దానిని చంపాల్సి వచ్చిందని తెలిపాడు. గ్రూప్‌ దశలో కొలంబియాతో జపాన్‌తో గెలుస్తుందని, సెనెగల్‌తో డ్రా చేసుకుని... పోలాండ్‌ చేతిలో ఓడుతుందని ఈ ఆక్టోపస్‌ చెప్పిన జోస్యం 100 శాతం నిజమైంది.

Story first published: Thursday, July 5, 2018, 15:00 [IST]
Other articles published on Jul 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+