చిలె క్లబ్‌కు కొత్త కోచ్‌గా నియమించబడ్డ రుయెడా

హైదరాబాద్: కొలంబియా జట్టు మాజీ యజమాని అయిన రీనాల్డొ రుయెడా అనే వ్యక్తిని దక్షిణ అమెరికాకు చెందిన చిల్సీ క్లబ్‌కు కొత్త కోచ్‌గా నియమించింది. 2022 ప్రపంచ ఫుట్‌బాల్ కప్‌ను ఉద్దేశ్యంలో ఉంచుకుని ఈ నియమకాన్ని చేపట్టింది.
రష్యాతో జరిగిన మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయిన అనంతరం అంతకుముందు విధులు నిర్వహిస్తున్న జువాన్ అంటోనియో పిజ్జి రాజీనామా చేసి జట్టు నుంచి తప్పుకున్నారు. దాంతో అరవై ఏళ్ల రుయోడాను సోమవారం జట్టు ప్రధాన కోచ్‌గా ధ్రువీకరిస్తూ ప్రకటన జారీ చేసింది. ఖతర్‌లో ఆడనున్న 2022 ప్రపంచ కప్‌కు ఇప్పటినుంచే సిద్ధమవమంటూ యాజమాన్యం ఆదేశించింది.
అంతర్జాతీయ జట్టులతో ఆడిన అనుభవమున్న కోచ్ జట్టును ప్రతిభావంతంగా నడపగలడని ఆశిస్తున్నాం. రీనాల్డొ రుయెడా ఖచ్చితంగా గొప్ప లక్ష్యాలు సాధిస్తుందనే నమ్మకాన్ని కలిగి ఉన్నాం. పెద్దల ఇచ్చిన సలహాలు చిన్న వాళ్లకు చేరి విజయవంతంగా దూసుకుపోతాం. అంటూ ఆ జట్టు యజమాన్యం ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
రుయెడా (2004-06) వరకు కొలంబియా జట్టుకు, (2007-10) వరకు హండారస్‌కు అధికార ప్రతినిధిగా వ్యవహరించారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications