Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండో విజయంతో నాకౌట్ కు చేరువలో చిలీ

Mark Gonzalez
పోర్ట్‌ ఎలిజబెత్‌: ఫుట్ బాల్ ప్రపంచకప్‌ లో చిలీ గ్రూప్‌ 'హెచ్‌'లో వరుసగా రెండో విజయంతో నాకౌట్‌ కు చేరువైంది. సోమవారం జరిగిన మ్యాచ్‌ లో చిలీ 1-0తో స్విట్జర్లాండ్‌ ను ఓడించింది. 75వ నిమిషంలో మార్క్‌ గొంజాలెజ్‌ గోల్‌తో చిలీ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 30వ నిమిషంలోనే 10 మందికి పరిమితమైనా స్విస్‌ పోరాడింది. కానీ చిలీ విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది. తొలి మ్యాచ్‌లో స్విస్‌..స్పెయిన్‌కు షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఈ గెలుపుతో చిలీ (6 పాయింట్లు) గ్రూపులో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

ఆరంభంలో రెండు జట్ల మధ్య పోటీ తీవ్రంగా సాగింది. ఐతే బంతిని ఎక్కువగా తన నియంత్రణలోనే ఉంచుకున్న చిలీ గోల్‌ కోసం తీవ్రంగా యత్నించింది. చిలీ ప్రయత్నాలను సమర్థంగా అడ్డుకుంటున్న సమయంలో స్విట్జర్లాండ్‌ కు 30వ నిమిషంలో పెద్ద షాక్‌ తగిలింది. వైడల్‌ (చిలీ)ను మోచేత్తో కొట్టినందుకు వాలోన్‌ బెహ్రామి రెడ్‌ కార్డుకు గురై మైదానం నుంచి నిష్క్రమించడంతో ఆ జట్టు 10 మందికే పరిమితమైంది. అవకాశం దొరకడంతో చిలీ పదే పదే దాడులు చేసింది. అయినా స్విస్‌ పట్టుదలగా పోరాడడంతో గోల్‌ కొట్టలేకపోయింది. 40వ నిమిషంలో అలెక్సిక్‌ సాంచెజ్‌ కొట్టిన షాట్‌ను స్విస్‌ గోల్‌ కీపర్‌ డీగో బెనాగ్లియో అడ్డుకున్నాడు. అంతకుముందు ఫార్వర్డ్‌ హంబర్టో సుజో (చిలీ) హెడర్‌..నెట్ ‌పై నుంచి వెళ్లింది. చిలీకి ఇంకా అనేక అవకాశాలు వృథా చేసుకుంది. పది మందికే పరిమితమైన స్విట్జర్లాండ్‌ కేవలం డిఫెన్స్‌కే పరిమితం కాలేదు. తాను కూడా కొన్ని చక్కని అవకాశాలను సృష్టించుకుంది.
Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+