పుణెపై విజయం: ఐఎస్ఎల్‌లో చెన్నై ఆశలు సజీవం
చెన్నై: డిఫెండింగ్ చాంపియన్లుసూపర్ మాచన్లు తేరుకున్నారు. వరుసగా రెండు వరుస ఓటముల నుంచి బయటపడ్డారు. మంగళవారం రాత్రి చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో పుణెతో జరిగిన మ్యాచ్‌లో 2 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించిన చెన్నైయిన్.. సెమీ ఫైనల్స్‌పై ఆశలు సజీవంగా ఉంచుకున్నది.
44వ నిమిషంలో సంచలన ప్లేయర్ జెజె లాల్ఫెఖ్లౌ, 51వ నిమిషంలో డేవిడ్ సుక్కీ గోల్స్‌తో చెన్నైయిన్ లీడ్ సాధించింది. దీంతో 10 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లు పొంది ఐదో స్థానంలో నిలిచింది. ఇరు జట్లు పరస్పరం సక్సెస్ ఫుల్ అటాకింగ్‌లతో ఆధిపత్యం సాధించేందుకు విఫలయత్నంచేశాయి.
కుడివైపు నుంచి రాఫెల్ అగస్టో కొట్టిన కిక్ నెట్ వద్ద వైడ్‌గా మారి వెళ్లిపోయింది. ఏమైనా సూపర్ మాచన్లకు సొంతగడ్డపై మ్యాచ్ కలిసొచ్చింది. 20 వేల మంది అభిమానుల మద్దతు మధ్య పలు చాన్స్ కల్పించుకున్న చెన్నైయిన్ వాటిని సద్వినియోగంచేసుకోలేకపోయింది. పుణెలో అనిబల్ రోడ్రిగ్స్ ఫ్రీ కిక్ ద్వారా పంపిన బంతి గోల్ పోస్ట్‌కు చేరలేదు.
ఎట్టకేలకు 44వ నిమిషంలో డెడ్‌లాక్‌ను కొంత తెలివిగా వ్యవహరించిన చెన్నై బ్రేక్ చేసింది. హన్స్ ముల్లర్ తన సహచరుడు జెర్రీ లాల్రింజౌలా కోసం పంపిన బంతి గోల్ బాక్స్ వద్ద క్రాసయి పక్కకు తిరిగింది. అక్కడే ఉన్న డేవిడ్ సుక్కీ దాని దారి మళ్లించి జెజె లాల్ఫెఖ్లౌకి అందించాడు. పుణె గోల్ కీపర్ ఎడెల్ బెటె స్పందించే లోగా జెజె హెడ్డర్ ద్వారా బంతిని గోల్ పోస్ట్ బాట పట్టించి జట్టుకు 1 - 0 స్కోర్ ఆధిక్యం సాధించి పెట్టాడు.

లింగ్డో ప్రయత్నాలను తిప్పికొట్టిన కరంజిత్ సింగ్
సెకండాఫ్‌లో పుణె మేనేజ్‌మెంట్ శుభారంభం కోసం ముంబై సిటీ మ్యాచ్ హీరో ఎగైన్సోన్ లింగ్డోను రంగంలోకి దించింది. లింగ్డో రాకతో సానుకూల వాతావరణం ఏర్పడినా చెన్నైయిన్ గోల్ కీపర్ కరంజిత్ సింగ్ అడుగడుగునా లింగ్డో ప్రయత్నాలను తిప్పికొట్టాడు. జొన్నాథన్ లుక్కా షాట్లను సైతం పూర్తిగా కరంజిత్ సింగ్ అడ్డుకున్నాడు. స్కోర్ సమంచేసేందుకు పుణె ప్రయత్నిస్తున్న తరుణంలోనే 51వ నిమిషంలో డేవిడ్ సుక్కీ రెండో గోల్ సాధించడంతో హబాస్ సేనపై 2 - 0 స్కోర్ తేడాతో చెన్నైయిన్ సునాయస విజయానికి దారి తీసింది.

నిరాశకు గురైన పుణె
జెజెతోపాటు రాఫెల్ అగస్టో కుడివైపు నుంచి పరుగులు తీస్తూ బంతిని డేవిడ్ సుక్కీకి అందించారు. అక్కడ నుంచి సుక్కీ హెడ్డర్ ద్వారా పంపిన బంతి నేరుగా గోల్ పోస్ట్‌కు చేరిపోయింది. సెకండాఫ్‌లో ఆరు నిమిషాల తర్వాత చెన్నై రెండో గోల్ చేసిన తర్వాత పుణె పూర్తిగా నిరాశకు గురైంది. నారాయణ్ దాస్, యుమ్నం రాజు బంతిని లక్ష్యం దిశగా పంపిన ప్రయత్నాలు ఫలించలేదు. రెండో గోల్ సాధించిన తర్వాత రాఫెల్ అగస్టో అసాధారణమైన రీతిలో డ్రిబ్లింగ్ స్కిల్స్ ప్రదర్శించడంతో చెన్నై పూర్తిగా మ్యాచ్‌పై పట్టు సాధించింది.

ఆకట్టుకున్న చెన్నై డిఫెన్సివ్
ఈ దశలో ఇరు జట్లు పలు మార్పులు చేశాయి. గోల్స్ సాధించే లక్ష్యంతో జీసస్ టాటూ, మొమ్మర్ డోయేలను రంగంలోకి దించినా చెన్నై అందుకు అవకాశమివ్వలేదు. పూర్తిగా మ్యాచ్‌కు పద నిర్దేశంచేసింది. పుణె కుర్రాళ్లు బంతిపై పట్టు సాధించేందుకు పరుగులు తీసినా ప్రయోజనం లేకపోయింది. జట్టును వీడనున్న రాఫెల్ అగస్టోకు వీడ్కోలు చెప్పేందుకు జాన్ ఆర్నె రైస్ క్లీన్ షీట్ ఏర్పాటుచేయడంతో స్టేడియం అంతా చప్పట్లతో మార్మోగిపోయింది. చివరి నిమిషాల్లో పుణె సబ్ స్ట్యూట్ డోయె బంతిని కట్ చేసి డ్రామానె ట్రౌర్ కు పంపినా అది క్రాస్ బార్ మీదుగా గోల్ పోస్ట్ దాటుకుని వెళ్లిపోయింది. చెన్నై డిఫెన్సివ్ ఆటతీరుతోనే మ్యాచ్ లో విజయం సాధించి మూడు పాయింట్లు పొందగలిగింది.

యూత్ లీగ్ క్లబ్ జట్లకు పేర్లివ్వండి: ఎఐఎఫ్ఎఫ్
వచ్చే ఏడాది జరిగే ఫిఫా - 17 వరల్డ్ కప్ టోర్నీ కోసం ప్రస్తుతం యు - 16 జట్లలో మంచి ప్లేయర్ల పేర్లు ప్రతిపాదించాలని దేశంలోని 55 ఫుట్ బాల్ క్లబ్ లను అఖిలభారత ఫుట్ బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) కోరింది. ఒక్కో క్లబ్ నుంచి ముగ్గురు ప్లేయర్ల పేర్లు పంపాలని ఎఐఎఫ్ఎఫ్ డైరెక్టర్ అభిషేక్ యాదవ్ తెలిపారు. వారికి మూడు వేర్వేరుశిక్షణా శిబిరాల్లో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత జాతీయ జట్టును ఎంపికచేస్తామన్నారు. ఇప్పటి నుంచి యు - 17 వరల్డ్ కప్ ఏడాది సమయం ఉన్నదని గుర్తుచేశాడు. ఈ నెల 19, 20 తేదీల్లో కోల్ కతాలో, 25, 26 తేదీల్లో గోవాలో, 28, 29 తేదీలలో న్యూఢిల్లీలో శిబిరాలు నిర్వహిస్తామన్నారు. టోర్నీ నిర్వహిస్తున్న భారత్ తరుఫున ప్రతిభావంతులైన జట్టును ఎంపిక చేసుకోవాల్సి ఉన్నదన్నాడు. ఐ - లీగ్ సిఇఓ సునందో ధార్ సానుకూలంగా స్పందించాడు. ఇప్పటికే ప్లేయర్ల పేర్లు పంపించామని తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications