చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్-3లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నయిన్ ఎఫ్‌సీ తొలి విజయాన్ని నమోదు చేసింది. గురువారం రాత్రి చెన్నైలోని జవహర్‌లాల్ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో చెన్నయిన్ జట్టు అద్భుతమైన ఆటతీరుతో ఎఫ్‌సీ గోవా జట్టుపై 2-0 తేడాతో విజయం సాధించింది.
ఆట ప్రారంభం నుంచే చెన్నయిన్ జట్టు ఆటగాళ్లు మైదానంలో అద్భుతమైన ఆటతీరుని కనబర్చారు. దీంతో చెన్నయిన్ ఆటగాళ్ల జోరుతో గోవా జట్టు ఒత్తిడిలో పడింది. చెన్నయిన్ ఆటగాడు రాఫెల్ అగస్టో 15వ నిముషంలో డిబాక్స్ బయట నుంచి ముల్డర్‌కు బంతిని పాస్ చేయగా అద్భుతమైన షాట్‌తో అతను బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపాడు.

దీంతో చెన్నయిన్ 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత ఆటలో 26వ నిమిషంలో చెన్నయిన్ కెప్టెన్ మెహ్రాజుద్దీన్ క్రాస్‌షాట్‌తో గోల్ చేసిన జట్టుకు 2-0 ఆధిక్యం అందించాడు. దీంతో తొలి అర్ధభాగంలోనే 2-0 ఆధిక్యాన్ని సాధించిన చెన్నయిన్ జట్టు మ్యాచ్ చివరి వరకు దానిని కాపాడుకుంది.
మరోవైపు గోవా ఎఫీ ఆటగాళ్లు గోల్స్ చేయడానికి విఫల యత్నం చేసినా చెన్నయిన్ ఆటగాళ్లు దానిని అడ్డుకున్నారు. మ్యాచ్ మొదటి అర్ధభాగం నుంచే చెన్నయిన్ ఆటగాళ్లు దూకుడుగా ఆడుతూ గోల్ అవకాశాలను సృష్టించడంలో సక్సెస్ అయ్యారు. కాగా ఈ మ్యాచ్‌లో గోవా జట్టులో డిఫెన్స్ లోపాలు ఎక్కువగా కనిపించాయి.
దీంతో భారీ మూల్యం చెల్లించుకుంది. గతేడాది ఫైనలిస్ట్‌గా నిలిచిన గోవాకు ఈ ఏడాది టోర్నీలో ఇది వరుసగా మూడో పరాజయం. ముంబై సిటీ ఎఫ్‌సీ 7 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా గోవా ఎఫ్‌సీ జట్టు ఇంకా ఖాతానే తెరవకుండా పట్టికలో అట్టడుగున ఉంది.