చెన్నై: చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఎఫ్‌సి పుణె జట్టుకు ఆతిథ్యం ఇవ్వనున్న డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నైయిన్ ఎఫ్ సి మళ్లీ విజయాల దిశగా తన పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నది. ఇంతకుముందు రెండు మ్యాచ్ ల్లోనూ ఓటమి పాలైన మార్కో మాటరాజ్జీ సేన.. తమ సొంత గడ్డపై ప్రతీకారం తీర్చుకోవాలని తలపోస్తున్నది.
పుణెపై జరిగే మ్యాచ్‌లో సొంతగడ్డపై అభిమానుల మద్దతుతో విజయం సాధించి సెమీ ఫైనల్స్ దిశగా ముందడుగు వేయాలని భావిస్తున్నది. ఢిల్లీ డైనమోస్ చేతిలో 4 - 1 స్కోర్ తేడాతోనూ, కేరళ బ్లాక్ బస్టర్స్ చేతిలో 3 - 1 స్కోర్ తేడాతో ఘోర పరాజయంతో చెన్నైయిన్ కుర్రాళ్లలో లోపాలు బహిర్గతం అయ్యాయి. సూపర్ మాచన్స్ సెమీస్ లోకి తమ జట్టును తీసుకెళ్లేందుకు గల అవకాశాలపై భారీ ఆశలతో ముందుకు సాగుతున్నారు.
మరోవైపు ఎఫ్ సి ఫుణె సిటీ ప్రారంభ కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నది. మాజీ చాంపియన్స్ అట్లెటికో డీ కోల్ కతాపై 2 - 1 స్కోర్, పుణెలో ముంబై సిటీపై 1 - 0 స్కోర్ తేడాతో సాధించిన విజయాలతో హబాస్ కుర్రాళ్లలో ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతున్నది. ఇటు డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నైయిన్, అటు ఎఫ్ సి పుణె జట్లు సెమీ ఫైనల్స్‌లో చోటు దక్కించుకునేందుకు ఈ మ్యాచ్ చాలా కీలకం.

ఇంతకుముందు జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో పుణె సిటీ 2014లో తొలిసారి చెన్నైయిన్ తో 1 - 1 స్కోర్ తేడాతో డ్రా చేసుకుంటే, తర్వాత 3 -1 తేడాతో ఓటమి పాలైంది. 2015లో చెన్నైయిన్ 2 - 1 తేడాతో గెలుపొందితే, తర్వాత పుణెలో జరిగిన మ్యాచ్ లో 1 - 0 స్కోర్ తేడాతో ఓటమి పాలైంది. ఈ ఏడాది పుణెలో జరిగిన మ్యాచ్ 1 - 1 స్కోర్ తేడాతో డ్రాగా ముగిసింది.
డిఫెన్స్‌లో జాన్, అటాకింగ్‌లో అనిబల్ సమ ఉజ్జీలే
చెన్నైయిన్ ప్లేయర్ జాన్ ఆర్నె రైస్ ఎల్లవేళలా అనుభవజ్నుడైన ప్లేయర్‌గా మ్యాచ్ సమయంలో పిచ్‌పై అందరికీ అందుబాటులో ఉంటాడు. డిఫెన్సివ్ ఆటలోనూ క్లీన్ టాక్లింగ్‌లోనూ నేర్పరి. సమస్యల సమయంలో ముప్పును ఎదుర్కోవడంలోనూ, తరుచుగా షాట్లు కొడుతూ మిగతావారికి విభిన్నంగా కనిపిస్తాడు.
ఈ సీజన్‌లో రెండుసార్లు బంతిని నెట్ వైపు పంపి, పుణె ప్రణాళికల అమలులో కేంద్రస్థానంగా నిలుస్తాడంటే అతిశేయోక్తి కాదు. పుణె సిటీ సాధించిన స్కోర్‌లో అత్యధికం అనిబల్ కొట్టినవే. ప్రత్యర్థిపై డిఫెన్సివ్‌గా ఆడటంలోనూ, జట్టును కాపాడుకోవడంలోనూ ప్రాధాన్యం సంతరించుకున్నాడు. ఎక్కువ ఎత్తు కలిగి ఉండటం అనిబల్‌కు అదనపు అడ్వాంటేజ్.
అటాకింగ్‌లో హన్స్ ముల్లర్, లింగ్డో పోటాపోటీ
ఈ ఏడాది చెన్నైయిన్ మిడ్ ఫీల్డ్ మార్షల్‌గా హన్స్ ముల్లర్ చెలరేగిపోతున్నాడు. అటాకింగ్, డిఫెన్స్ ఆటలో ముందుపీఠిన నిలిచి జట్టును ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మ్యాచ్ విజయానికి అవసరమైన వ్యూహాల అమలులో డార్టింగ్ రన్స్ లోనూ, కీలక సమయంలో జోక్యం చేసుకోవడంలోనూ, రెండు గోల్స్ సాధించడంలోనూ ముందున్న హన్స్ ముల్లర్.. మాటరాజ్జీ టీంలో అత్యవసరం.
సెంటర్ ఆఫ్ ది పార్క్‌లో నీట్‌గా మ్యాచ్ ఫినిషింగ్ లోనూ కీలకం హన్స్ ముల్లర్. ఇంతకుముందు ముంబైతో జరిగిన మ్యాచ్ లో కీలక గోల్ తో జట్టు విజయానికి ఏగెన్సోన్ లింగ్డో కీలక పాత్ర పోషించాడు. 30 ఏళ్ల ఈ కుర్రాడు జట్టుకు పరిపూర్ణ విశ్వాసాన్ని అందించి ముందడుగు వేసేందుకు సహకరిస్తాడు. అటాకింగ్, పాసింగ్ స్కిల్స్, గోల్స్ సాధనలో తద్వారా గేమ్ చేంజర్‌గా వ్యవహరిస్తాడు.
సుక్కీ, ఫెరీరా ఎవరికి వారే సాటి
నెట్ ముందు తన నైపుణ్యం, శక్తి సామర్థ్యాల ప్రదర్శనలో కీలకం డేవిడ్ సుక్కీ. ఈ ఏడాది ప్రారంభంలోనే నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టుకు వ్యతిరేకంగా జట్టు విజయ సాధనలో శక్తియుక్తులు ప్రదర్శించాడు. నిరంతరం బంతిపై నియంత్రణ సాధిస్తూ తెలివిగా వ్యవహరిస్తూ అదే స్థాయిలో ప్రత్యర్థిపై డిఫెన్సివ్ ఆటతో దూసుకెళ్లగలడు.
35 ఏళ్ల ఈ ఇటాలియన్ ప్లేయర్ గాలిలోనే శక్తిమంతంగా వ్యవహరిస్తూ బంతిపై విరుచుకుపడగలడు. పుణె సిటీ తరఫున ఆడుతున్న ఎడుయారో ఫెరీరా ఫార్వర్డ్ ప్లేయర్‌గా తరుచుగా ప్రత్యర్థులకు రాతి గోడ వంటి ప్రతిఘటన ఇవ్వగల సమర్థుడు. ప్రస్తుత ఐఎస్ఎల్ సీజన్‌లో ఫార్వర్డ్ ప్లేయర్‌గా స్మార్ట్ గా జోక్యం చేసుకోవడంలోనూ, అటాకింగ్ లోనూ కీలకంగా వ్యవహరిస్తున్నాడు.
జట్ల వివరాలు:
చెన్నైయిన్ ఎఫ్‌సి: కరంజిత్ సింగ్, పవన్ కుమార్, దువాయ్నే కెర్ర్, బెర్నాండ్ మెండీ, మెహ్రాజుద్దీన్ వాడో, ఎలీ సాబియా, ఎడర్ మొంటెరియో, జెర్రీ లాల్రింజౌలా, అభిషేక్ దాస్, జాన్ఆర్నె రైస్, బల్జిత్ సాహ్ని, హన్స్ ముల్లర్, మానైల్లే బ్లాసి, థాయిసింగ్, రాఫెల్ అగస్టో, హర్మాన్జోత్ సింగ్ ఖబ్రా, డేవిడ్ సుక్కీ, మౌరిజియో పెలుసో, బెదాశ్వోర్ సింగ్, ఉత్తం రాయ్, జెజె లాల్ఫెఖౌలా, జాకీర్ ముందంపరా, జయేశ్ రాణె.
ఎఫ్‌సి పుణె సిటీ: ఎడెల్ బెటె, అరిందమ్ భట్టాచార్య, విశాల్ కైథ్, జోడింగ్లియానా రాల్టే, రాహుల్ భెకె, యుమ్నం రాజు, నారాయణ్ దాస్, అగస్టైన్ ఫెర్నాండెజ్, ధర్మరాజ్ రావణన్, ఎడుయారో ఫెరీరా, గౌరామాంజీ సింగ్, అరాటా ఇజుమి, జొన్నాథన్ లుక్కా, ఫ్రాన్సిస్ ఫెర్నాండెజ్, బ్రూనో ఏరియాస్, జోసెప్ మారియా కొమాడేవాల్స్ క్రౌస్ (పిటు), లెన్నీ రోడ్రిగ్స్, మోమర్ డోయే, సంజయ్ ప్రదాన్, అనిబల్ జుర్డో రోడ్రిగ్జ్, గుస్తావో ఒబర్మన్, జీసస్ రోడ్రిగ్స్ టాటూ, ఎగెన్సోస్ లింగ్డో.