Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెన్నై గెలిచిందిలా?: కోచ్‌గా ఉండనని కుండబద్ధలు

చెన్నై: డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నైయిన్‌ ఎఫ్‌సి ఖాతాలో ఎట్టకేలకు విజయం నమోదైంది. గురువారం రాత్రి చెన్నైలో ఎఫ్‌సి గోవా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 2 - 0 స్కోర్‌ తేడాతో రికార్డు విజయం ఐఎస్‌ఎల్‌ 3 ఎడిషన్‌లో ఇదే మొదలు.

కుర్రాళ్లు చురుగ్గా స్పందించక పోవడంతో ఎఫ్‌సిగోవా జట్టు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. మ్యాచ్‌ ప్రారంభమైన రెండో నిమిషంలో గోవా జట్టు గోల్‌చేసే అవకాశం రాగానే స్పందించిన చెన్నై కరంజిత్‌సింగ్‌ దూసుకొచ్చి మరీ మిడ్‌లైన్‌లోనే బంతిని పక్కకు తప్పించాడు.

విజయంపై సంతృప్తి చెందినా చెన్నై కోచ్‌ మాట్టరాజీ ఇకముందు సెమీ ఫైనల్స్‌లో అడుగు పెట్టకుంటే వచ్చే ఎడిషన్‌లో కోచ్‌గా ఉండబోనని కుండబద్ధలు కొట్టారు. డిఫెండింగ్‌ చాంపియన్లుగా చెన్నై కుర్రాళ్లు మ్యాచ్‌లో విజయం కోసం కసిగా ఆడారు. ఫస్ట్‌ హాఫ్‌లోనే సారధి మెహ్రాజుద్దీన్‌, హన్స్‌ ముల్లర్‌ తమ పని కానిచ్చేశారు.

15వ నిమిషంలో బాక్స్‌ బయట నుంచి రాఫెల్‌ అగస్టో నుంచి బాల్‌ అందుకున్న ముల్లర్‌.. గోవా గోల్‌కీపర్‌ లక్ష్మీకాంత్‌ కట్టిమని పాస్ట్‌గా డైవ్‌ కొట్టి అడ్డుకునేలోపు, డిఫెండర్లు స్పందించకముందే బంతిని గోల్‌పోస్ట్‌ బాట పట్టించాడు. గోవా డిఫెండర్‌ రిచర్డ్‌ దుమాస్‌ అడ్డుపడినా తప్పించుకుని మరీ చెన్నై కెప్టెన్‌ మెహ్రాజుద్దీన్‌ బంతిని 26వ నిమిషంలో గోల్‌పోస్ట్‌కు మళ్లించడంతో స్కోర్‌ 2 - 0కు చేరుకున్నది.

Chennaiyin FC beat FC Goa 2-0 to record 1st win in ISL-3

ఎఫ్‌సి గోవా కుర్రాళ్లలో చురుకుదనం లోపించడంతో గోల్‌చేసేందుకు వచ్చిన అవకాశాలను మిస్‌చేసుకున్నారు. తొలి హాఫ్‌లో రాఫెల్‌ కోయెల్హో మాత్రమే స్కోర్‌ మెరుగుదలకు విశ్వ ప్రయత్నాలుచేశాడు. ఫుల్గాంకో కార్డోజో పంపిన లాంగ్‌బాల్‌ను చెన్నైయిన్‌ గోల్‌కీపర్‌ కరంజిత్‌సింగ్‌ అడ్డుకున్నాడు.

తర్వాత టైమ్‌కోసం వేచి చూడకుండానే రైనాల్డో ఒలివెరియా పెనాల్టీబాక్స్‌ నుంచి బంతిని గోల్‌పోస్ట్‌కు పంపినా రిఫరీ ఆమోదించలేదు. తిరిగి 42వ నిమిషంలో జాఫ్రీ గోంజాలెజ్‌ నుంచి స్వాధీనంచేసుకున్న బంతిని బ్రెజిలియన్‌ స్ట్రయికర్‌ హెడర్‌ద్వారా గోల్‌పోస్ట్‌కు పంపితే.. అది పక్కకెళ్లిపోయింది.

సెకండాఫ్‌లో చెన్నైపై అటాకింగ్‌ కోసం గోవా చీఫ్‌ కోచ్‌ జికో పలు మార్పులుచేర్పులు చేసినా ప్రయోజనం లేకపోయింది. చెన్నై కుర్రాడు డావిడే సక్కీకి గోల్‌చేసి.. రికార్డు స్థాయి స్కోర్‌ ఆధిక్యం 3 - 0 సాధించేందుకు వచ్చిన గోల్డెన్‌ చాన్స్‌ మిస్సయింది. సారధి ముల్డర్‌ పంపిన లాంగ్‌ బాల్‌ను అందుకున్న డావిడే.. గోల్‌పోస్ట్‌కు పంపితే యధావిధిగా కీపర్‌ కట్టిమని తిరగొట్టాడు. సారధి ముల్డర్‌కు వచ్చిన మరో అవకాశాన్ని ఇండియన్‌ స్ట్రైకర్‌ అడ్డుకున్నాడు. ఆ తర్వాత కూడా స్కోర్‌ను సమయంచేసేందుకు గోవా చేసిన ప్రయత్నాలను చెన్నై తిప్పికొట్టింది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+