Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

4 లక్షలు కట్టి మూడు మ్యాచ్‌ల వరకు కనిపించకు

Chennaiyin coach Gregory suspended for three matches

హైదరాబాద్: జట్టు కోచ్ అయినంత మాత్రాన తన ఇష్టం వచ్చినట్టు చేస్తే సరిపోతోందా. మరి అంత తలబిరుసు పనికి రాదనుకున్నారో ఏమో.. తీసి పక్కన పడేశారు. అక్కడితో ఆగలేదు నాలుగు లక్షలు జరిమానా కూడా కట్టాలంటూ శిక్ష వేయించారు. చెన్నైయిన్ ఎఫ్‌సీ జట్టు ప్రధాన కోచ్ ప్రస్తుతం ఇండియన్ సూపర్ లీగ్ యాజమాన్యంతో చివాట్లు తింటున్నాడు.

ఐఎస్‌ఎల్(ఇండియన్ సూపర్ లీగ్) ఇచ్చిన నివేదిక ప్రకారం.. జట్టు అధికార ప్రతినిధులతో అసభ్య ప్రవర్తన చేసినందుకు గాను ఆర్టికల్ 50 ప్రకారం, ఆటలో సరైన తీరు ప్రదర్శన చూపించకపోవడం వల్ల ఆర్టికల్ 58 ప్రకారం మూడు మ్యాచ్‌ల వరకు బహిష్కరించారు. దాంతో పాటు నాలుగు లక్షల జరిమానా కూడా విధించారు.

డిసెంబరు 28న జంషెడ్‌పూర్ ఎఫ్‌సీతో చెన్నై ఎఫ్‌సీ తలపడింది. కాగా ఈ మ్యాచ్‌లో చెన్నైయిన్ ఎఫ్‌సీ విజయం సాధించనప్పటికీ ఇరు జట్ల మధ్య కాస్త వివాదం చెలరేగింది. ఈ వివాదానికి పెద్దదవడానికి ప్రధాన కారణం కోచ్ జాన్ గ్రెగరీ యేనని నిర్ధారించిన యాజమాన్యం ఇంత కఠిన నిర్ణయం తీసుకోకతప్పలేదు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, January 6, 2018, 15:54 [IST]
Other articles published on Jan 6, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+