
రైస్, హుమ్ అనుభవం రెండు జట్లకు పెట్టని కోట
సొంతగడ్డపై విజయం సాధించడానికి జాన్ ఆర్నె రైస్ వంటి అనుభవం గల ప్లేయర్ సూపర్ మాచన్స్‌కు అవసరం. రైస్ ఎల్లవేళలా అట్లెటికో డీ కోల్‌కతాపై ముందు పీఠిన నిలిచి అటాకింగ్ చేయగల సామర్థ్యం గల సత్తా ఉంది. కోల్‌కతా సారధి హెల్డర్ పొస్టిగ, ఇయాన్ హుమ్, జావీ లారాల మాదిరిగా మ్యాచ్‌లో బిజిబిజీగా గడుపుతూ స్కోర్ పాయింట్ సాధించడానికి ప్రాధాన్యం ఇస్తాడు. ఇక కొల్‌కతాకు ఇయాన్ హుమ్ కుడివైపు నుంచి పికప్ అందుగోగల నేర్పు గల ప్లేయర్. చివరి క్షణంలో కెనడియన్ స్ట్రయికర్ జట్టును కాపాడేందుకు అట్లెటికో డీ కోల్‌కతా క్రుషి చేశాడు. తద్వారా ఈ దఫా జాయింట్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హుమ్ తన ఐదో గోల్ నార్త్ఈస్ట్‌పై జరిగిన మ్యాచ్‌లో చేసిన గోల్‌తోనే సాధ్యమైంది. గతంలో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో చెన్నైకి వ్యతిరేకంగా జరిగిన మ్యాచ్‌లలోనూ హుమ్ గోల్స్ సాదించాడు.

మిడ్‌ఫీల్డ్‌లో రాఫెల్, జావీ లారా కీలకం
అట్లెటికో డీ కోల్ కతాపై జరిగే మ్యాచ్ లో స్కోర్ సాదించేందుకు రాఫెల్ అగస్టో చాలా కీలక పాత్ర పోషిస్తాడు. సూపర్ మాచన్స్ తరపున వరుసగా రెండో ఏడాది ఆడుతున్న సాధారణంగా మిడ్ ఫీల్డర్‌గా మార్కో మాటరాజ్జీ జట్టులో చాలా కీలకపాత్ర వహిస్తున్నాడు. ఈ 25 ఏళ్ల కుర్రాడు సాంకేతికంగా వ్యూహం అమలులో తిరుగులేని శక్తిసామర్థ్యాలు కలిగి ఉన్నాడు. ప్రత్యర్థి స్థానంలో ఏ జట్టు ఉన్నా గేమ్ చేంజర్ పాత్ర పోషించగల సమర్థుడు. కోల్‌కతా మిడ్ ఫీల్డ్‌లో ప్రభావిత ప్రాధాన్యం గల ప్లేయర్ జావీ లారా. తన టీమ్మెట్స్ కు అవసరమైన స్ఫూర్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాడు. ఈ స్పానిష్ ప్లే మేకర్ హైలాండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇయాన్ హుమ్‌కు పంపిన ఫ్రీ కిక్ తోనే మ్యాచ్ డ్రాగా ముగిసింది. క్లినికల్ రేంజ్ నుంచి బయటకు వచ్చిన లారా బంతిని తన నియంత్రణలో తీసుకునేందుకు ఏమాత్రం భయపడడంటే అతిశేయోక్తి కాదు.

జెజె, అర్నాబ్ సమ ఉజ్జీలే
ఇంతకుముందు పుణె సిటీతో జరిగిన మ్యాచ్‌లో చేసిన గోల్‌తో చెన్నై సంచలనం జెజె లాల్పెఖ్లౌ గోల్స్ మూడుకు చేరాయి. ఎటికెతో జరిగే మ్యాచ్‌లో నెమ్మదిగానైనా గోల్స్ రాబట్టాలని ఈ ఇండియన్ ఇంటర్నేషనల్ చూస్తున్నాడు. లాల్పెఖ్లౌ.. కోల్ కతా బ్యాక్ లైన్ నుంచి డిఫెన్సివ్ వ్యూహం అమలుచేయాలని భావిస్తున్నాడు. ఈ ఏడాది పలు దఫాలు డిఫెన్స్ అస్థిరంగా ఉన్నప్పుడు జట్టును ఆదుకున్నాడు జెజె. డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నైయిన్ జట్టుపై విజయం సాధించాలంటే అర్నాబ్ మొండల్ చురుగ్గా ఆడుతూ నేరుగా దూసుకెళ్లగలిగినప్పుడే కోల్ కతా విజయం సాధించగలుగుతుంది. ఈ ఇండియా ఇంటర్నేషనల్ మార్షల్ నార్త్ఈస్ట్ జట్టుతో ఇంతకు ముందు జరిగిన మ్యాచ్‌లో తన జట్టు కోల్ కతా బ్యాక్ లైన్ వెంబడి సాగుతూ డిఫెన్స్ బలహీనతలను అధిగమించడంలో కీలక పాత్ర పోషించాడు. జెజె మాదిరిగానే మొండాల్ సైతం ప్రత్యర్థి జట్టులోని లాల్పెఖ్లౌ, అగస్టో, డేవిడ్ సుక్కీ వంటి ప్లేయర్లను ఎదుర్కోవడంలో బిజిబిజీగా ఉంటాడని అంతా ఆశిస్తున్నారు.

జట్ల వివరాలు:
చెన్నైయిన్ ఎఫ్ సి: కరంజిత్ సింగ్, పవన్ కుమార్, దువాయ్నే కెర్రె, బెర్నాండ్ మెండీ, మెహ్రాజుద్దీన్ వాడో, ఎలి సాబియా, ఎడర్ మొంటారియో, జెర్రీ లాల్రింజులా, అభిషేక్ దాస్, జాన్ ఆర్నె రైస్, బల్జిత్ సాహ్ని, హన్స్ ముల్డర్, మ్యానుల్లె బ్లాసీ, థాయిసింగ్, రాఫెల్ అగస్టో, హర్మాంజోత్ సింగ్ ఖబ్రా, డేవిడ్ సుక్కీ, మౌరిజియో పెలుసో, బెదాశ్వోర్ సింగ్, ఉత్తం రాయ్, జెజె లాల్పెఖ్లౌ, జకీర్ ముందాంపరా, జయేశ్ రాణె.
అట్లోటికో డీ కోల్‌కతా: దేబ్జిత్ మజుందార్, దాని మల్లో, షిల్టోన్ పాల్, అర్నాబ్ మొండాల్, హెన్రిక్యూ ఫొనెస్కా సెరెనో, జోస్ అర్రోయో, కీగాన్ పెరీరా, కింగ్‌సుఖ్ దేవ్‌నాథ్, ప్రబీర్ దాస్, ప్రీతం కోతల్, రాబర్ట్ లాల్థామౌనా, అభినాష్ రుడియాస్, బైద్యనాథ సింగ్, బికాశ్ జైరు, బిక్రంజిత్ సింగ్, బొర్జా ఫెర్నాండెజ్, జావీ లారా, జువెల్ రాజా, లాల్రిండికా రాల్టే, అఫెంస్టె నాటో, సమీగ్ దౌటీ, స్టీఫెన్ పియర్సన్, హెల్డర్ పొస్లిగ, ఇయాన్ హుమ్, జువాన్ బెలెంకోసో.


Click it and Unblock the Notifications













