చెన్నై బిడ్: రొనాల్డో హ్యాట్రిక్‌తో రియల్ పైచేయి
కోల్‌కతా: భారత్‌లో క్షేత్రస్థాయిలో పుట్‌బాల్ బలోపేతానికి అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) చర్యలు తీసుకుంటున్నది. ఈ నేపథ్యంలో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫ్రాంఛైసీ.. ప్రస్తుతం డిపెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ ఎఫ్‌సి క్లబ్ కూడా వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమయ్యే ఐ-లీగ్ టోర్నీలో పాల్గొననున్నది.
ఈ అంశాన్ని ఐ - లీగ్ వర్గాలు ధ్రువీకరించాయి. బిడ్ దాఖలు చేయడానికి శనివారం చివరి రోజు కావడంతో చెన్నైయిన్ ఎఫ్ సి జట్టు పత్రాలు సమర్పించింది. తద్వారా ఐ - లీగ్‌లో భాగస్వామి కావడానికి సంసిద్ధత వ్యక్తంచేసింది. దీని ప్రకారం చెన్నైయిన్ ఎఫ్ సి జట్టు లోకల్ లీగ్‌లో ప్రారంభం నుంచి ఆడుతుంది.
దీనికి టాప్ మీడియా సంస్థ దన్నుగా నిలిచింది. ఇంతకుముందుకు చండీగడ్ కేంద్రంగా పనిచేస్తున్నమినర్వా అకాడమీ ఎఫ్ సి, ఎఫ్ సి బర్డేజ్ క్లబ్ జట్లు కూడా వచ్చే ఏడాది జనవరి ఏడో తేదీ నుంచి మొదలయ్యే ఐ - లీగ్ టోర్నీలో పాల్గొననున్నాయి. చెన్నైయిన్ ఎఫ్ సికి అవకాశం కల్పించే విషయమై ఈ నెల 23న తుది నిర్ణయం వెలువడనున్నది.

మూడేళ్ల తర్వాత అట్లెటికో మాడ్రిడ్‌పై రొనాల్డో రికార్డు
రియల్ మాడ్రిడ్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో చెలరేగిపోయాడు. సొంత గడ్డపై అట్లెటికో డీ మాడ్రిడ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ చేసి.. లా లీగ పాయింట్ల పట్టికలో జట్టును టాప్‌లో నిలబెట్టాడు. అట్లెటెటికో డీ మాడ్రిడ్ పై జరిగిన మ్యాచ్ లో రియల్ మాడ్రిడ్ 3 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించగా, మెస్సీ లేకుండా బరిలోకి దిగిన బార్సిలోనా ఎఫ్ సి జట్లు మలాగా జట్టు చేతిలో మ్యాచ్ ను డ్రాగా ముగించుకున్నది. ఫలితంగా రియల్ మాడ్రిడ్ కంటే బార్సిలోనా నాలుగు పాయింట్లు వెనుకబడింది. గత మూడేళ్లలో అట్లెటికో మాడ్రిడ్ జట్టుపై రియల్ మాడ్రిడ్ జట్టు గెలుపొందడం ఇదే మొదటిసారి.

పెనాల్టీల్లో అట్లెటికోపై పై చేయి
చాంపియన్స్ లీగ్‌లో రొనాల్డో విధాన నిర్ణాయక కిక్‌తో రియల్ మాడ్రిడ్ పెనాల్టీల్లో అట్లెటికోపై పై చేయి సాధించింది. 19వ నిమిషానికే డబుల్ గోల్స్ సాధించిన రొనాల్డో పెనాల్టీ స్పాట్‌లో గారెథ్ బాలె ముందు తెలివిగా వ్యవహరించి హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. అట్లెటికో మాడ్రిడ్ పై విజయంపై రియల్ మాడ్రిడ్ యజమాని మాట్లాడుతూ జైనెడిన్ జిడానే మాట్లాడుతూ చాలా కష్టతరమైన ప్రత్యర్థి అట్లెటికో మాడ్రిడ్‌పై అపరిమితమైన మ్యాచ్ ఆడగలమన్నాడు. చాలా కొద్ది జట్లు మాత్రమే 3 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించగలవని వ్యాఖ్యానించారు.

అట్లెటికో మాడ్రిడ్ ఓడిపోవడం మూడోసారి
నాలుగు లీగ్ మ్యాచ్‌లలో అట్లెటికో మాడ్రిడ్ జట్టు మ్యాచ్ ఓడిపోవడం మూడోసారి. సెకండాఫ్ తొలి 20 నిమిషాల్లో తాము పలు అవకాశాలు కల్పించి, మ్యాచ్ పై నియంత్రణ సాధించినా రియల్ మాడ్రిడ్ కుర్రాళ్లు దూసుకొచ్చి మ్యాచ్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారని అట్లెటికో మాడ్రిడ్ ప్లేయర్ సిమ్మోన్ వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్ లో రియల్ మాడ్రిడ్ కీలక ప్లేయర్లు సెర్జియో రామోస్, పెపె, కాష్మిరో, టోనీ క్రూస్, అల్వారో మొరాట, కరీం బెంజెమా లేకున్నా మిగతా ప్లేయర్లు ఫస్టాఫ్ లో 45 నిమిషాల పాటు స్ఫూర్తి దాయక ఆట ఆడారు.

మెస్సీ లేకుండానే మలాగాపై బార్సిలోనా డ్రా
లియానెల్ మెస్సీ, లూయిస్ సౌరెజ్ వంటి స్టార్ స్ట్రయికర్లు లేకుండానే మలాగా జట్టుపై జరిగిన మ్యాచ్‌ను బార్సిలోనా ఎఫ్ సి జట్టు గోల్స్ లేని డ్రాగా ముగించింది. సౌరెజ్ సస్పెన్షన్, మెస్సీ అనారోగ్యం కారణంగా మలాగా జట్టుపై లూయిస్ ఎన్రిక్యు కుర్రాళ్లు దూకుడుగా ఆడారు. కానీ మలాగా గోల్ కీపర్ ను అధిగమించి గోల్స్ సాధించలేకపోయారు. క్యాంప్ నౌపై కేటలాన్స్ ఆధిపత్యం ప్రదర్శించినా, ఆర్డా తురాన్, రఫిన్హా, గెర్రాడ్ పిఖ్యూ పలు అవకాశాలు కల్పించినా గోల్స్ మాత్రం సాధించలేకపోయారు. 69వ నిమిషంలో డిఫెండర్ డియాగో ల్లోరెంటె మ్యాచ్ ను వీడాల్సి రావడంతో బార్సిలోనా కుర్రాళ్లు మలాగా డిఫెన్స్‌ను బద్దలు కొట్టడంలో విఫలమయ్యారు. మెస్సీ, సౌరెజ్ గైర్హాజరీలో నేయ్మార్ దూకుడుగా ఆడాల్సి వచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications