Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెల్సియా మిడ్ ఫీల్డర్‌కు చైనా క్లబ్ భారీ ఆఫర్

లండన్: ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఇపిఎల్) ప్రముఖ క్లబ్‌ల్లో ఒకటైన చెల్సియా మిడ్ ఫీల్డర్ ఆస్కార్ త్వరలో మొదలయ్యే చైనా సూపర్ లీగ్ (సిఎస్ఎల్) క్లబ్ షాంఘై ఎస్ఐపిజి జట్టులో చేరిపోయాడు. ఈ విషయాన్ని ఆస్కార్ అధికారికంగా ధ్రువీకరించాడు.

వచ్చే ఏడాది జనవరిలో షాంఘై ఎస్ఐపిజిలో చేరతాడు. 'ఆస్కార్ శాశ్వత బదిలీ కోసం చెల్సియా ఫుట్‌బాల్ క్లబ్, షాంఘై ఎస్ఐపిజి క్లబ్ మధ్య ఒప్పందం కుదిరింది. 25 ఏళ్ల ఈ మిడ్ ఫీల్డర్ వచ్చేనెల ప్రారంభంలో చైనా సూపర్ లీగ్ టీంలో చేరతాడు' అని చెల్సియా ఫుట్ బాల్ క్లబ్ వైబ్ సైట్ తెలిపింది.

చెల్సియాలో ఆస్కార్ 2012 నుంచి సభ్యుడిగా ఉన్నాడు. గత నాలుగేళ్ల చెల్సియా క్లబ్ కెరీర్‌లో ఆస్కార్ 203 మ్యాచ్ ల్లో ఆడి 38 గోల్స్ సాధించాడు. ఒక ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఇపిఎల్), యూరప్ లీగ్, ఇంగ్లిష్ ఫుట్ బాల్ లీగ్ (ఇఎఫ్ఎల్) టైటిళ్లను గెలుచుకున్నాడు. ఇంగ్లండ్ మీడియాలో వచ్చిన వార్తా కథనాల ప్రకారం ఆస్కార్ కోసం బదిలీ జోన్ కింద చెల్సియా జట్టుకు షాంఘై ఎస్ఐపిజి యాజమాన్యం 60 మిలియన్ల డాలర్లు చెల్లిస్తుంది.

Chelsea confirm midfielder Oscar's transfer to Shanghai SIPG

ప్రస్తుతం ఇపిఎల్ టోర్నీలో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న చెల్సియా హెడ్ కోచ్‌గా అంటోనియో కాంటే వచ్చినప్పటి నుంచి ఆస్కార్ ప్రాధాన్యం తగ్గింది. ప్రస్తుత టోర్నీలో చెల్సియా జట్టు తుది జట్టులో ఆయన పేరు చోటుచేసుకోలేదంటే అతిశేయోక్తి కాదు. చైనీస్ సూపర్ లీగ్ (సిఎస్ఎల్)లో చేరిక వల్ల ఆస్కార్ కు ఆర్థికంగా భారీ లబ్ధి చేకూరనున్నది.

వారానికి 4.90 లక్షల మిలియన్ల డాలర్లు చొప్పున షాంఘై ఎస్ఐపిజి ఆయనకు వేతనంగా చెల్లించనున్నది. దీంతో ఇటీవలి కాలంలో చైనా ఫుట్‌బాల్ క్లబ్‌ల్లో చేరుతున్న బ్రెజిల్ ఇంటర్నేషనల్ ప్లేయర్ల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటికే షాంఘై ఎస్ఐపిజి క్లబ్‌లో బ్రెజిలియన్ ఫార్వర్డ్ ప్లేయర్లు ఎల్కేసన్, హుల్క్ సభ్యులుగా ఉన్నారు.

ఈ ఏడాది చైనీస్ సూపర్ లీగ్ టోర్నీలో షాంఘై మూడో స్థానంలో నిలిచింది. స్వెన్ గోరాన్ ఎరిక్సన్ స్థానే చెల్సియా మాజీ కోచ్ అండ్రె విల్లాస్ వోయాస్ హెడ్ కోచ్‌గా నియామకం కావడం గమనార్హం. చైనీస్ సూపర్ లీగ్ (సిఎస్ఎల్) క్లబ్ ట్రాన్స్ ఫర్ అయ్యేందుకు అంగీకరించినందుకు చెల్సియా యాజమాన్యానికి ఆస్కార్ ధన్యవాదాలు తలెలిపాడు.

తనను మంచి ప్లేయర్‌గా ఎదిగేందుకు సమయం కేటాయించినందుకు క్లబ్ సభ్యులకూ ధన్యవాదాలు తెలిపాడు. చెల్సియా యాజమాన్యం కూడా తమ జట్టుకు సేవలందించినందుకు ఆస్కార్ కు ధన్యవాదాలు తెలియజేయడంతోపాటు ఆయనకు ఉజ్వల భవిష్యత్ లభించాలని ఆకాంక్షించింది.

హుల్క్ కంటే ఆస్కార్‌కు అత్యధిక ధర

గత జూన్ లో షాంఘై ఎస్ఐపిజిలో చేరిన బ్రెజిలియన్ స్ట్రయికర్ హుల్క్ కంటే ఆస్కార్ కు ఇచ్చే వేతనం చాలా ఎక్కువ. జెనిట్ సెయింట్ పీటర్స్ బర్గ్ నుంచి షాంఘైలో చేరిన హుల్క్ కు వారానికి 3.20 లక్షల యూరోల వేతనం లభిస్తుంది. నాలున్నరేళ్ల క్రితమే బ్రెజిలియన్ క్లబ్ నుంచి ఆస్కార్‌ను తమ జట్టులో కలుపుకునేందుకు షాంఘై ఎస్ఐపిజి క్లబ్ 19 మిలియన్ల యూరోలు చెల్లించేందుకు సిద్ధపడింది. ఇక చెల్సియా చీఫ్ కోచ్ ఆంటోనియో కాంటే మరో ఇద్దరు ప్లేయర్లను ట్రాన్స్‌ఫర్ జోన్ కింద బయటకు పంపిన తర్వాత జట్టును బలోపేతం చేయాలని భావిస్తున్నాడు.

చైనాలో చేరిన చెల్సియా ప్లేయర్లలో డిడియర్ డ్రోగ్బా, రామైరెస్, నిలోలస్ అనెల్కా, డెంబా బా ఉన్నారు. చైనా సూపర్ లీగ్ క్లబ్‌లు కూడా యూరప్‌లోని హై ప్రొఫెల్ ప్లేయర్లను తమ జట్లలో చేర్చుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆస్కార్ చేరికతో యూరప్ నుంచి చేరిన అత్యంత ప్రముఖ ఫుట్ బాల్ ఆటగాళ్ల సంఖ్య ఐదుగురికి చేరింది.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+