ఎవరైనా చరిత్రే: 18న ఐఎస్ఎల్ టైటిల్ పోరు
కోచి: ఐఎస్ఎల్ 3 ఎడిషన్‌లో భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో వరుసగా ఐదింటిలో విజయం సాధించి ఫైనల్స్‌లో అడుగు పెట్టిన కేరళ బ్లాక్ బస్టర్స్‌కు ఈ దఫా మాజీ చాంపియన్లను తిప్పికొట్టేందుకు చాన్స్ లభించింది. ఆదివారం కోచిలో జరిగే టైటిల్ పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి.
అయితో సొంతగడ్డపై జరిగే ఈ మ్యాచ్‌లో కేరళ బ్లాక్ బస్టర్స్‌కు అభిమానుల మద్దతు దండిగా లభిస్తుందనడంలో సందేహం లేదు. రెండేళ్ల క్రితం ఐఎస్ఎల్ టోర్నీ ప్రారంభించిన 2014లో కేరళ బ్లాక్ బస్టర్స్, అట్లెటికో డి కోల్‌కతా జట్ల మధ్య ముంబైలో జరిగిన మ్యాచ్‌లో విజయం సౌరవ్ గంగూలీ సేననే వరించింది.
ఈ ఓటమితో జరిగిన గాయానికి మందేసేందుకు.. అట్లెటికో డి కోల్‌కతా జట్టుపై ప్రతీకారం తీర్చుకునేందుకు సచిన్ టెండూల్కర్ సహ యజమానిగా గల కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టుకు లభించింది. అయితే రెండు జట్లలో ఏ జట్టు టైటిల్‌ను గెలుచుకున్నా చరిత్రే కానున్నది. 'రెండేళ్ల క్రితం మాకు కొద్దిమంది ప్లేయర్లు మాత్రమే ఉన్నారు.
విన్నింగ్ గోల్ చేయగల సామర్థ్యం ఉన్న ప్లేయర్ ఒక్కడే ఉన్నాడు' అని కేరళ బ్లాక్ బస్టర్స్ హెడ్ కోచ్ స్టీవ్ కొప్పెల్ వ్యాఖ్యానించాడు. నాటి చిరస్మరణీయమైన మ్యాచ్‌లో మహ్మద్ రఫీఖ్ బెంచ్‌కు మాత్రమే పరిమితం కాగా, ఎటికె నాలుగో నిమిషంలో గోల్ సాధించడంతో చారిత్రక తొలి టైటిల్‌ను సౌరవ్ సేన గెలుచుకున్నది.

క్రీడాస్ఫూర్తితో ఫైనల్స్‌లో టైటిల్ గెలుచుకుంటాం
నాటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం రఫీఖ్ కేరళ బ్లాక్ బస్టర్స్ తరఫున ఆడుతున్నాడు. గురువారం ఢిల్లీ డైనమోస్ జట్టుతో జరిగిన సెమీ ఫైనల్స్ లో షూటౌట్ల ద్వారా జట్టును గెలుపు బాట పట్టించడంలో కీలక భూమిక పోషించాడు. ‘పరిస్థితి చాలా మారింది. ఇది పూర్తిగా విభిన్నమైన పోటీ, మాలో ప్రతీకారం తీర్చుకోవాలనే భావన లేదు. కేవలం మేం క్రీడాస్ఫూర్తితో ఫైనల్స్ లో టైటిల్ గెలుచుకునే దిశగా ఆడాలన్నదే మా ద్రుడ సంకల్పం' అని స్టీవ్ కొప్పెల్ చెప్పాడు.

మంచి జట్టుతో ఫైనల్స్ ఆడబోతున్నాం
ఐదు వరుస విజయాల్లో అభిమానుల మద్దతు ఇతోధికంగా సహకరించినా.. ఫైనల్స్ కు అదే అభిమానులు హాజరైనా పరిస్థితులు విభిన్నంగా ఉంటాయని కొప్పెల్ తన కుర్రాళ్లను హెచ్చరిస్తున్నాడు. ‘మేం చాలా మంచి జట్టుతో గేం ఆడబోతున్నాం. కేరళ బ్లాక్ బస్టర్స్ మాజీ ఆటగాళ్లు పియర్సన్ స్టీఫెన్, ఇయాన్‌హుమ్ వంటి వారు కోల్‌కతాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారికి కూడా స్థానిక అభిమానులు మద్దతునిచ్చే అవకాశముంది.

ఇది ఫేవరెట్ జట్టని చెప్పలేం
మన అభిమానుల నుంచి గొప్ప మద్దతు లభిస్తుందని ఆశించొచ్చు. కానీ అందుకు గ్యారంటీ ఏమీ లేదు. మ్యాచ్ గెలుచుకోవడమే ప్రధానం తప్ప.. మనం ఫేవరెట్ జట్టని చెప్పడానికి ఎటువంటి మార్గం లేదు' అని కొప్పెల్ తన శిష్యులకు హితబోధ చేశాడు. కేరళ ప్రత్యర్థి జట్టుగా కోల్‌కతా ఆటగాళ్లు కూడా టైటిల్ ను గెలుచుకోవడంపైనే అంతా కేంద్రీకరించారు. మూడేళ్లలో రెండోసారి టైటిల్ గెలుచుకునే దిశగా కష్టపడి ఆడే అవకాశముంది. ఎటికె మాత్రమే వరుసగా మూడేళ్లు ఫ్లేఆఫ్ దశకు చేరుకున్న జట్టుగా నిలిచింది.

టైటిల్ పోరు సౌరభ్ Vs సచిన్‌లా
మరో దఫా టైటిల్ కోసం తలపడనున్నది. టైటిల్ పోరు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ మధ్యేనన్న ప్రచారమూ సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నది. వారిద్దరూ క్రికెట్ ఆడిన రోజుల్లో టీమిండియాకు పలుసార్లు ఉత్తమ భాగస్వామ్యాలు నెలకొల్పిన రికార్డు ఉంది. ఆదివారం ఇద్దరు క్రీడా ప్రముఖుల రాకతో వారి జట్లకు స్ఫూర్తిదాయకం కానున్నది. 2014లో గంగూలీ గట్టినా నవ్వేసినా ఈ దఫా సచిన్ సేనకు సొంతగడ్డపై అభిమానుల దన్ను బలంగా ఉన్నదనడంలో సందేహం లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications