
నమ్మశక్యంగానీ ఫామ్‌లో మార్సిలిన్హో
ఢిల్లీ డైనమోస్ ఎఫ్ సి స్టార్ ఫార్వర్డ్ ప్లేయర్ మార్సిలిన్హో ప్రస్తుత సీజన్‌లో జట్టుకు నమ్మశక్యంగాని ఫామ్‌లో సాగుతున్నాడు. తొమ్మిది గోల్స్, ఐదు అసిస్టెన్స్‌లతో అందరికంటే ముందు వరుసలో నిలిచిన ఆటగాడు. లీగ్ లోనే దూకుడుగా ఆడుతున్న ప్లేయర్. మంచి స్పీడ్‌తోపాటు బంతిపై నియంత్రణ సాగిస్తూ ప్రత్యర్థి జట్ల డిఫెన్స్‌లో గందరగోళం నెలకొల్పుతూ గోల్స్ కోసం అవకాశాలు కల్పించడం ఆయన స్పెషాలిటీ. అంతేకాదు విపత్కర పరిస్థితుల్లోనూ గోల్ సాధించగల సామర్థ్యం, నేర్పు ఆయనకే సొంతం. ఫుట్‌బాల్ అభిమానుల ఫాంటసీల్లో మార్సిలిన్హో ధర అక్షరాలా రూ.8.4 కోట్లు పలుకుతోంది. 92 ఫాంటసీ పాయింట్లు పొందిన ఈ బ్రెజిలియన్ కేవలం ఫార్వర్డ్ ప్లేయర్లకు నాయకత్వం వహించడమే కాదు ఓవరాల్ ఫాంటసీ లీడర్‌గా నిలిచాడు.

కేరళ మిడ్‌ఫీల్డ్‌లో వినీత్‘కీ’
కేరళ బ్లాక్ బస్టర్స్ మిడ్ ఫీల్డర్ సికె వినీత్ కేవలం ఐదు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడినా యెల్లో మెన్ విజయంలో కీలకపాత్ర. ఆ ఐదు మ్యాచ్‌ల్లో జట్టు విజయావకాశాలను మెరుగుపర్చడంలో అత్యధిక ప్రభావం చూపాడు. జట్టు తరుపున చేసిన గోల్స్‌లో నాలుగు వినీత్‌వి కావడం గమనార్హం. ఈ దఫా లీగ్ టోర్నీలో అత్యధిక గోల్స్ సాధించిన మిడ్ ఫీల్డర్ కూడా వినీతే. 40 ఫాంటసీ పాయింట్లు పొందిన ఈ 28 ఏళ్ల కుర్రాడు.. టాప్ మిడ్ ఫీల్డర్ల జాబితాలో 13వ స్థానం పొందాడు. ప్రస్తుతం ఐఎస్ఎల్ 3 ఎడిషన్‌లోని కీలక ప్లేయర్లలో ఆయనొక్కడంటే అతిశేయోక్తి కాదు. అభిమానుల ఫాంటసీ టీంలో వినీత్ దర రూ.7.6 కోట్లు పలుకుతోంది.

ముంబై మూలస్థంభాల్లో లుసియాన్ గోయాన్
ప్రస్తుత ఐఎస్ఎల్ సీజన్‌లో ముంబై సిటీ ఎఫ్ సి జట్టు మూల స్తంభాల్లో ఒకడు. డిఫెన్సివ్ ఆటలో ముంబై జట్టు రికార్డు నెలకొల్పింది. ఉత్తమ డిఫెన్స్ వ్యూహం అమలులో ఈ 33 ఏళ్ల కుర్రాడి పాత్ర స్పష్టంగా ఉంది. సన్నగా పొడవుగా ఉండే లుసియాన్.. సెంటర్ బ్యాక్ ప్లేయర్ కావడమే కాదు లెక్కలేనన్ని సార్లు ప్రత్యర్థి జట్ల అటాకింగ్‌కు చోటు కల్పించకుండా జట్టును పరాజయ భారీ నుంచి తప్పించాడు. 84 ఫాంటసీ పాయింట్లతో డిఫెండర్ల జాబితాలో టాపర్‌గా, ఓవరాల్ లీడర్ బోర్డులో రెండోస్థానంలో నిలిచాడు. రూ.6.4 కోట్లకు ఆయన పేరు ఫాంటసీ వేలంలో మార్ర్మోగుతున్నది.

దేబ్జిత్ ఫామ్ ఫైన్
అట్లెటికో డీ కోల్‌కతా గోల్ కీపర్ దేబ్జిత్ మజుందార్ ప్రస్తుత ఐఎస్ఎల్ సీజన్ లో అద్భుతమైన ఫామ్‌లో దూసుకెళుతున్నాడు. ఢిల్లీ డైనమోస్ సారధి ఫ్లోరెంట్ మాలౌదా పెనాల్టీతో సహా అద్బుతమైన గోల్స్ సేవ్ చేసిన ఘనత సాధించాడు. పెనాల్టీ ఏరియాలో జట్టు తరఫున ప్రతి నిమిషం కమాండింగ్ వ్యూహంతో దూకుడుగా వ్యవహరించిన దేబ్జిత్ ప్రతిభ వెలకట్టలేం. లాంగ్ బాల్స్‌ను కట్టడిచేస్తూ జట్టు డిఫెన్స్ విభాగానికి నైతిక స్థైర్యాన్ని అందించడంలో ముందంజలో ఉన్నాడు. మొత్తం 41 ఫాంటసీ పాయింట్లతో ఆయన ధర రూ.5.4 కోట్లు పలుకుతున్నది. అత్యుత్తమ గోల్ కీపర్ల జాబితాలో దేబ్జిత్ మజుందార్‌ది మూడోస్థానం. సెమీస్ బరిలో నుంచి బయటకు వచ్చిన ఎఫ్ సి ఫుణె సిటీ గోల్ కీపర్ ఎడెల్ బెటె, గాయంతో ఇంతకుముందు మ్యాచ్‌కు దూరంగా ఉన్న నార్త్ఈస్ట్ యునైటెడ్ గోల్ కీపర్ సుబ్రతాపాల్ ముందు వరుసలో ఉన్నాడు. ఇతరుల జట్లలో తప్పనిసరిగా రీ ప్లేస్ కాగల సామర్థ్యం దెబ్జిత్‌ది.

సెమీస్‌కు ఎటువంటి సమస్యల్లేవన్న మొలీనా
ముచ్చటగా మూడోసారి సెమీ ఫైనల్స్ దశకు చేరుకున్న అట్లెటికో డీ కోల్‌కతా కోచ్ జోస్ మొలీనా తమకు గోల్స్ చేయడానికి ఇబ్బందులేమీ లేవని పేర్కొన్నాడు. శుక్రవారం పుణె సిటీతో జరిగిన మ్యాచ్‌లో అత్యంత తేలికైన బెలెంసోకో నాలుగు గోల్స్ చాన్స్ లు మిస్సవ్వడం పట్ల నిరాశ వ్యక్తంచేశాడు. అఫెంట్సే నాటో, కింగ్ సుక్ దేవ్ నాథ్ లను బరిలోకి దించానన్నాడు. బెలెంకోసో ఆటపై సంతోషంగానే ఉన్నానని చెప్పాడు. బెలెంకోసో ఒక స్ట్రయికర్ ఆటగాడన్నాడు. అతడు నాలుగు చాన్స్ లు మిస్స్ అవడం తనకు సంతోషంగా లేదన్నాడు. బెలెంకోసో కూడా హ్యాపీగా ఉండక పోవచ్చునన్నాడు. ఢిల్లీ డైనమోస్ తో జట్టు సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ లో మాత్రమే విజయం సాదించామని అంగీకరించాడు. సెమీ ఫైనల్స్ పోటీ రెండు జట్ల మధ్య ఉంటే బెటర్ ఫలితాలు ఉంటాయన్నాడు. ఎఫ్ సి గోవా, ఢిల్లీ డైనమోస్, నార్త్ఈస్ట్, చెన్నైయిన్ జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో తమ జట్టు చేసిన పొరపాట్లను సరిచేసుకోవాల్సి ఉందన్నాడు. గత మ్యాచ్‌లో కేరళ జట్టు చేసిన గోల్ కూడా అటువంటిదేనన్నాడు. మరిన్ని గోల్స్‌తో ఫైనల్స్‌లో అడుగు పెట్టడమే తమ లక్ష్యమని మొలీనా వ్యాఖ్యానించాడు.


Click it and Unblock the Notifications













