న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

‘AIFFపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయడానికి కేంద్రం ప్రో యాక్టివ్ పాత్ర తీసుకోవాలి’: సుప్రీంకోర్టు

Centre should take pro active role to lift suspension imposed on AIFF: Supreme Court

అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ ఏఐఎఫ్ఎఫ్)‌పై ఫిఫా విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసేందుకు కృషి చేయాలని సుప్రీంకోర్టు బుధవారం ప్రభుత్వానికి సూచించింది. థర్డ్ పార్టీ వ్యక్తుల మితిమీరిన జోక్యం కారణంగా ఫిఫా ఇండియా యొక్క టాప్ ఫుట్‌బాల్ అథారిటీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఫిఫా నిషేధం విధిస్తూ.. అండర్-17 మహిళల ప్రపంచ కప్‌ను ప్రస్తుతం భారతదేశంలో నిర్వహించలేము అని కూడా పేర్కొంది. సస్పెన్సన్ నిర్ణయం వెలువడ్డ ఒక రోజు తర్వాత సుప్రీంకోర్టు న్యాయస్థానం ఈ విషయానికి సంబంధించిన కేసును విచారించింది. ఈ కేసును కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదోపవాదాలను వినిపించారు. ఏఐఎఫ్‌ఎఫ్‌ సస్పెన్షన్‌ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఫిఫాతో చర్చలు జరిపిందని తెలిపారు.

'ఇక సొలిసిటర్ జనరల్ మెహతా అభ్యర్థన మేరకు.. U17 ఫుట్ బాల్ ప్రపంచకప్‌ను ఇండియాలో నిర్వహించడానికి, అలాగే AIFFపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయడానికి కేంద్రం ప్రో యాక్టివ్ పాత్రను తీసుకోవాలని కోరుతున్నామని' అని సుప్రీంకోర్టు పేర్కొంది. U17 మహిళల ప్రపంచ కప్‌ను నిర్వహించడం వల్ల భారతదేశానికి ఫుట్ బాల్ విషయంలో లబ్ధి చేకూరాలన కూడా సుప్రీం పేర్కొంది. ఇక కేంద్రం తరఫున మెహతా వాదిస్తూ.. ఈ సమస్యను పరిష్కరించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఈ అంశాన్ని ఆగస్టు 22 సోమవారం నాటికి వాయిదా వేయాలని కేంద్రం తరఫున అభ్యర్థించాడు. సస్పెండ్ అనంతరం ఫిఫాతో రెండు సమావేశాలు నిర్వహించినట్లు కూడా చెప్పారు.

అయితే FIFA కౌన్సిల్ బ్యూరో FIFA చట్టాలను స్పష్టంగా ఉల్లంఘనించినట్లు తేలడంతో సస్పెండ్ చేస్తున్నట్లు ఖరాకండింగా చెప్పింది. AIFF దాని 85ఏళ్ల ఉనికిలో తొలిసారి FIFAచే నిషేధాన్ని ఎదుర్కోవడంతో భారత ఫుట్ బాల్ చరిత్రలో ఈ ఘటన ఓ మాయని మచ్చగా పరిణమించింది. ఇక భారత యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖతో FIFA నిరంతరం నిర్మాణాత్మక సంప్రదింపులు జరుపుతోందని, అన్ని అనుకున్నట్లు జరిగితే నిషేధం ఎత్తివేత జరగవొచ్చని' అని ఫుట్‌బాల్ పాలకమండలి తన ప్రకటనలో పేర్కొంది.

Story first published: Wednesday, August 17, 2022, 12:30 [IST]
Other articles published on Aug 17, 2022
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X