
హైదరాబాద్: పారిస్ సెయింట్ జర్మైన్ స్టార్ ఎడిన్‌సన్ కావని వ్యక్తిగత గెలుపు ముఖ్యం కాదని తన టీంను గెలిపించడం కోసం కష్టపడతానని, కానీ తన ఖాతాలో పాయింట్లు పెరగాలని రికార్డులు రావాలనే తాపత్రయంతో ఆడనని తేల్చి చెప్పేశాడు.
స్వీడన్ ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు జ్లాటన్ ఇబ్రహీమొవిక్ రికార్డుకు ఒక 156 పాయింట్లు కాగా దానికి కేవలం 3 పాయింట్లు తేడాతో ఉండి కూడా తను టీం విజయాన్ని కోరుకుంటానని అన్నాడు. 'ప్రతి ఒక్క ఆటగాడికి తాను టీం గెలవడం కోసం ఆడటంలో పాత్ర ఉంటుంది. అంతేగాక కొన్ని సార్లు ప్రముఖ పాత్ర వహించాల్సి ఉంటుంది. ఇదొక సదవకాశంగా భావించాలి' అని తెలిపాడు.

తన లక్ష్యం చాలా పెద్దదని, తాను చిన్నవాటి దగ్గర ఆగిపోనని తెలిపాడు. ఈసారి తన జట్టు ట్రోఫీ గెలుస్తుందనే ధీమాను వ్యక్తం చేశాడు. ఆ నమ్మకం తనకు ఉందని చెప్పాడు. లీగ్‌లో ఉన్న గ్రూప్-బిలో ఉన్న టీంలలో (పారిస్ సెయింట్ జర్మైన్ ఎఫ్‌సీ) పీఎస్‌జీ టాప్ పొజిషన్‌లో ఉంది.
కాగా ఇది మంగళవారం జర్మనీతో తలపడుతుండగా వీరు నాలుగు గోల్స్ చేస్తే లీగ్‌లో ముందున్నట్లే. కోచ్ యునై ఎమెరీ శిక్షణలో మేము ఇంకా మెరుగైన ప్రతిభను చూపిస్తామని అన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.