Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Fifa World Cup 2022: వరల్డ్ కప్‌లో ఎలిమినేట్ అయి.. ఇంటి దారి పట్టిన మరో జట్టు..!

Canada becomes second eliminated team from Fifa World Cup 2022

ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌ నుంచి మరో జట్టు నిష్క్రమించింది. కొన్నిరోజుల క్రితమే వరల్డ్ కప్ ఆతిథ్య జట్టు ఖతర్.. సెనెగల్ చేతిలో 3-1 తేడాతో ఓడి ఇంటి దారి పట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కెనడా కూడా అదే బాటలో నడిచింది. క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో తేలిపోయిన కెనడా.. 4-1 తేడాతో ఓటమిపాలై వరల్డ్ కప్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. ఈ మ్యాచ్‌లో కెనడాకు అదిరే ఆరంభం లభించినప్పటికీ ఆధిక్యాన్ని కాపాడుకోలేకపోయింది.

గత మ్యాచ్‌లో బెల్జియం చేతిలో 1-0 తేడాతో ఓడిన కెనడా జట్టు ఎలాగైనా గెలవాలని పట్టుదలగా కనిపించింది. అదే సమయంలో మొరాకోతో మ్యాచ్‌ను 0-0తో డ్రా చేసుకున్న క్రొయేషియా కూడా గెలుపు కోసం తహతహలాడింది. ఈ క్రమంలోనే మ్యాచ్ మొదలైన వెంటనే దూకుడు ప్రదర్శించిన కెనడా.. 70 సెకన్లలోనే తొలి గోల్ సాధించింది. ఆ జట్టు ప్లేయర్ ఆల్‌ఫోన్సో డేవిస్ అద్భుతమైన గోల్ చేశాడు. ఈ వరల్డ్ కప్‌లో మ్యాచ్ మొదలైన తర్వాత అత్యంత వేగంగా గోల్ చేసిన జట్టుగా కెనడా నిలిచింది.

అయితే ఈ ఆధిక్యాన్ని నిలుపుకోవడంలో కెనడా విఫలమైంది. తొలి గోల్ షాక్ నుంచి తేరుకున్న క్రొయేషియా బలంగా ప్రతిఘటించింది. మ్యాచ్ మొదలైన 36వ నిమిషంలో తొలి గోల్ చేసింది. ఆ వెంటనే 44వ నిమిషంలో క్రొయేషియా ప్లేయర్ మార్కో లివాజా మరో గోల్ చేశాడు. దీంతో తొలి హాఫ్‌ను 2-1 ఆధిక్యంలో ముగించిందా జట్టు. సెకండ్ హాఫ్ కూడా ఇదే రీతిలో జరిగింది.

రెండో సగం ఆట ఆరంభం నుంచే దూకుడు కనబరిచిన క్రొయేషియా.. మరో రెండు గోల్స్ చేసి తమ ఆధిక్యాన్ని అమాంతం పెంచేసుకుంది. దీంతో ఆట చివరకు 4-1 తేడాతో కెనడా ఓటమిపాలైంది. ఈ ఓటమితో ఆతిథ్య ఖతర్ తర్వాత ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన రెండో జట్టుగా కెనడా నిలిచింది.

Story first published: Monday, November 28, 2022, 10:53 [IST]
Other articles published on Nov 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+