న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

Fifa World Cup 2022: వరల్డ్ కప్‌లో స్విట్జర్లాండ్ బోణీ.. గోల్ కొట్టినా సెలబ్రేట్ చేసుకోని స్విస్ ప్లేయర్..!

Cameroon born Embolo wins the game for Switzerland against his birth nation

ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో స్విట్జర్లాండ్ బోణీ కొట్టింది. గ్రూప్-జీ నుంచి తర్వాతి దశకు చేరుకునే అవకాశాలు మెరుగ్గా ఉన్న జట్లలో స్విట్జర్లాండ్ ఒకటి. ఇదే గ్రూప్‌లో బ్రెజిల్ కూడా ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే కామెరూన్, స్విట్జర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. తొలి అర్ధభాగంలో నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌.. రెండో అర్ధభాగంలో మలుపు తిరిగింది. ఆ తర్వాత కామెరూన్ గట్టిగా ప్రయత్నించినా కూడా ఓటమిని తప్పించుకోలేకపోయింది.

వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఆడిన చివరి ఐదు మ్యాచుల్లో మూడు విజయాలు, రెండు పరాజయాలతో నమోదు చేసింది స్విట్జర్లాండ్. అదే సమయంలో కామెరూన్ రికార్డు ఏమంత బాగలేదు. ఈ జట్టు ఆడిన చివరి ఐదు మ్యాచుల్లో ఒక విజయం, రెండు పరాజయాలు, రెండు డ్రాలుగా నిలిచాయి. దీంతో ఈ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ ఫేవరెట్‌గా బరిలో దిగింది. ఆ జట్టు కోచ్ మురాట్ యాకిన్ కూడా బలమైన జట్టును మైదానంలోకి పంపించాడు.

ఆట తొలి హాఫ్‌లో రెండు జట్లు గట్టిగా పోరాడాయి. ఈ సమయంలో 51 శాతం సమయం బంతిని స్విట్జర్లాండ్ ఆటగాళ్లు తమ దగ్గర ఉంచుకుంటే, మిగతా సమయం కామెరూన్ ఆటగాళ్లు బంతిని తమతో ఉంచుకున్నారు. కానీ రెండు జట్లు కూడా తమకు దక్కిన అవకాశాలను గోల్స్‌గా మలచలేకపోయాయి. అయితే రెండో సగం ఆరంభమైన మూడో నిమిషంలోనే స్విట్జర్లాండ్ గోల్ చేసింది. జెర్డాన్ షాకిరీ అందించిన పాస్‌తో బ్రీల్ ఎంబోలో సులభంగా గోల్ చేశాడు. ఎంబోలో జన్మస్థలం కామెరూన్ కావడంతో అతను ఈ గోల్‌ను సెలబ్రేరట్ చేసుకోలేదు. ఇది అభిమానుల మధ్య పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత మరింత గట్టిగా కామెరూన్ పోరాడినప్పటికీ.. స్విస్ గోల్ కీపర్ యనన్ సోమర్ అడ్డుగోడలా నిలబడ్డాడు. దీంతో ఈ మ్యాచ్‌ను 1-0 తేడాతో స్విట్జర్లాండ్ తమ ఖాతాలో వేసుకుంది.

Story first published: Friday, November 25, 2022, 10:54 [IST]
Other articles published on Nov 25, 2022
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X